హిందీ సినిమా గమనానికి
ఆయనో గైడ్..
ఎన్నో హృదయాలను కొల్లగొట్టిన
జుయల్ తీఫ్
విఫలమైన ప్రేమ బాధించినా
మరో ప్రేమపుస్తకం తెరిచి
పెళ్లిపుస్తకాన్ని
అందంగా రాసుకున్న ప్రేమపూజారి
బాలీవుడ్లో స్టైల్ కి మరోపేరైన
బొంబాయి కీ బాబు..
ROMANCE WITH LIFE
అంటూ చివరి శ్వాస వరకు
జీవితాన్ని ప్రేమించిన
దేవానంద్ మేరా నామ్
నటనే ఆయన కామ్..!
ఒక దశలో హిందీ సినిమా
పూర్తిగా దేవా హవా..
ఆయన క్రాఫు..కెరీర్ గ్రాఫు..
ఆ బుర్ర ఊపు..అదో కైపు..
ఆయన మాట నిర్మాతలకు
కాసుల మూట..
సొంత సంస్థ నవకేతన్
ఆయన అభినయంతో విజయకేతన్..!
ఇండియన్ గ్రెగరీపెక్..
చూసేసాడు కెరీర్లో పీక్..
సురయాతో ఎఫైర్..
మతం కారణంగా మిస్ ఫైర్..
ఆ జంట కలిసి చేసిన సినిమాలు దృశ్యకావ్యాలు..
సొంత ప్రేమకథ మాత్రం
విషాద సాగరం..
దేవ్ ఇచ్చిన ప్రేమకానుక
వజ్రపుటుంగరం
అదే సాగరం పాలు..
సురయా అవివాహిత గానే మృత్యువు పాలు..!
తెరపై ఒకటిగా
దేవానంద్..సురయా
ఏలేసారు దునియా..!!
కల్పన..
కొత్త కథలో నాయిక
అయింది దేవానంద్ జీవితానికి ఏలిక..
షూటింగ్ విరామంలో
నిరాడంబరంగా వివాహం..
అక్కడా దేవ్ చూపించాడు
ఈ మునీంజీ
తన ప్రత్యేకత..
ప్రదర్శన లేని పెళ్లి..
ఆదర్శంగా కాపురం..!
కిశోర్ కుమార్ తో చెలిమి
సాగిన నాలుగు దశాబ్దాల
హిట్టు పాటల కలిమి..
గరుదత్ తో
చెక్కు చెదరని స్నేహం..
దిలీప్ కుమార్..
రాజ్ కపూర్..
దేవానంద్..
ఈ ముగ్గురు మిత్రులు త్రిమూర్తులై ఏలేసారు
బాలీవుడ్ సినిమాని..
మురిసిపోయాడు
ప్రతి అభిమాని..!
జీనత్ అమన్ కు జీవితం
హరేరామ హరేకృష్ణ..
తీరిన దేవానంద్ కళాతృష్ణ..
దమ్మారో దం
ఇలా సాగింది చెల్లి సరాగం..
ఫూలోంకా తారొంకా
సబ్ సే కెహనా హై..
ఏక్ హజారోమో మేరీ బెహనా హై..
సారి ఉమర్ హమే
సంగ్ రెహనాహై..
అలా గడిచింది అన్న విరాగం
ఆ సినిమా అందుకుంది
సూపర్ హిట్టు రాగం…!
వైద్యం కోసం
లండన్ వెళ్లిన స్టార్..
అప్పటికే దేవుడు
సిద్ధం చేసిన
ఛార్జ్ షీట్
ఎనభై దాటినా కుర్రాడిగానే
తిరిగిన దేవ్..
హోటల్ గది నుంచే తిరిగిరాని లోకాలకు
అంతిమ పయనం..
అంత్యక్రియలు అక్కడే జరిగినా అస్తికలు మాత్రం
కలిశాయి మన
పుణ్య గోదావరిలో..
గాతా రహే మెర దిల్..
తూహీ మేరీ మంజిల్..
అని తన స్టైల్లో ఆలపిస్తూ..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286