– మీ సమస్యలను కూడా పరిష్కరించా
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశా…. మీ సమస్యలను కూడా పరిష్కరించాను… మీ ఓటు ను తప్పకుండా కారు గుర్తుపై వేసి తనను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలి అంటూ సనత్ నగర్ MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అమీర్ పేట డివిజన్ లోని BJR నగర్ 2 లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయనకు ప్రతి ఇంటి వద్ద మహిళలు మంగళహారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. శ్రీనన్న మా ఓటు మీకే అన్న అంటూ ఓటర్లు మంత్రికి హామీ ఇచ్చారు. అదేవిధంగా శ్రీనికేతన్ అపార్ట్మెంట్ వాసులు,లీలా నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాలలో మంత్రి పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అభివృద్ధి పనులు జరిగాయని, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించామని చెప్పారు. తన కంటే ముందు ఇక్కడి నుండి గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా ఉన్న మర్రి చెన్నారెడ్డి, ఆయన కుమారుడు 4 సార్లు MLA గా వ్యవహరించి ఉన్నత పదవులను అనుభవించిన మర్రి శశిధర్ రెడ్డి లు కూడా చేయలేని అభివృద్ధి పనులు తాను చేశానని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి KTR గార్ల సహకారంతో సుమారు 1400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి వివిధ పనులు చేశామని చెప్పారు.
బస్తీ, కాలనీ అనే తేడా లేకుండా నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలను ఎవరు ఊహించని స్థాయిలో అభివృద్ధి చేశామని, చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తుందని అన్నారు. అభివృద్ధి లో సనత్ నగర్ నియోజకవర్గాన్ని మోడల్ గా తీర్చిదిద్దాలనేది తన లక్ష్యం అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన వివరించారు. 2014 కు ముందు అద్వాన్నంగా ఉన్న రోడ్లను, డ్రైనేజీ వ్యవస్థ ను ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. ఇవే కాకుండా తాను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేస్తూ వస్తున్నామని వివరించారు.
నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ అవసరమొచ్చినా తాను అండగా నిలబడతున్నానని, ఇక ముందు కూడా ఉంటానని హామీ ఇచ్చారు. తమకు ఎప్పుడూ అండగా నిలిచి మా సమస్యను తన సమస్యగా భావించి పరిష్కరించే గొప్ప నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని, అలాంటి నాయకులు తమకు ఉండటం మా అదృష్టం అని ఆయా కాలనీ, అపార్ట్మెంట్ వాసులు తమ సంపూర్ణ మద్దతు ను ఏకగ్రీవంగా ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, BRS డివిజన్ అధ్యక్షులు హన్మంతరావు, జనరల్ సెక్రెటరీ సంతోష్, శ్రీనికేతన్ అపార్ట్మెంట్ అధ్యక్షులు నీరజ, చందన్, వేణుగోపాల్, లీలా నగర్ ప్రతినిధులు శర్మ, వెంకట రాజాం, అజయ్ అగర్వాల్, సురేందర్ రాజ్ పురోహిత్, ఉత్తమ్ సింగ్, గులాబ్ సింగ్, నాయకులు అశోక్ యాదవ్, నర్సింహ, ప్రవీణ్ రెడ్డి, సురేందర్ సింగ్, లలితా చౌహాన్, ఆనంజీత్ కౌర్, బాసా లక్ష్మీ తదితరులు ఉన్నారు.