Suryaa.co.in

Telangana

ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తాం

ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తాం
వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ దర్శనం
బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు.. 2జీ, 3జీ, 4జీ పార్టీలు
మీడియా సమావేశంలో కేంద్రమంత్రి అమిత్ షా

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం.మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తాం. పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ ను తగ్గిస్తాం. రానున్న రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వారం రోజుల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికలు తెలంగాణకు అత్యంత కీలకమైనవి. సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణలో.. తెలంగాణ ఆత్మగౌరవం, సుభిక్ష తెలంగాణ, ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల ఆకాంక్షలకు భిన్నంగా పాలన కొనసాగుతోంది.

సుదీర్ఘ పోరాటాలు చేసి..1200 మంది యువత బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆశించినట్లు .స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో యువత, పేదలు, రైతులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆయన చెప్పారు.గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది. 30 నవంబర్ నాడు తెలంగాణ ఎన్నికల్లో.. బీజేపీకి భారీ మెజారిటీ ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నాను.మీ నిర్ణయం ప్రభుత్వం, మీ ఎమ్మెల్యే కోసమో కాదు.. మీ ఓటు తెలంగాణ భవిష్యత్తును, దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చైతన్యవంతమైన తెలంగాణ ఓటర్లు.. బీజేపీకి, మోదీ గారికి అండగా ఉంటారని పూర్తి విశ్వాసముంది.

బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. అవినీతి తప్ప.. ప్రజలకు బీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీ లేదు.మియాపూర్ భూకుంభకోణం, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఔటర్ రింగ్ రోడ్డు టోల్,మద్యం కుంభకోణం.. గ్రానైట్ కుంభకోణం వంటివాటిలో కేసీఆర్ ప్రభుత్వం కూరుకుపోయింది. బీఆర్ఎస్ కార్యకర్తలు.. డబుల్ బెడ్రూం, దళితబంధు పథకాల్లో చేతివాటం ప్రదర్శించారు. ఏ పార్టీపై విశ్వసనీయత అయినా.. ఆ పార్టీ ఇచ్చే మేనిఫెస్టో అమలుపై ఆధారపడి ఉంటుంది. ఇచ్చిన ఏ హామీనీ కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదు. ఫిల్మ్ సిటీ, ఫార్మా సిటీ, టెక్స్ టైల్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి హామీలన్నీ ఉత్తుత్తివే అని తేలిపోయింది.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేజీ టు పీజీ విద్యను గాలికొదిలేశారు. ఉద్యోగాలు భర్తీ చేయలేదు.రైతు రుణమాఫి పూర్తి చేయలేదు.. నిరుద్యోగ భృతి అమలు చేయలేదు. ప్రతీ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి హామీ అమలు కాలేదు. మిషన్ కాకతీయలో రూ.వేల కోట్లు ఖర్చు చేసినా పనులు పూర్తి కాలేదు.దళిత బంధు లో అవినీతి జరిగిందని చెప్పారు.పేపర్ లీకేజ్ ఎట్లా జరిగిందో అందరికీ తెలుసు. యువత, దళితులు, వెనుకబడిన వర్గాలు చాలా అసంతృప్తిగా ఉన్నాయి. సిటీలు ఎక్కడా కనిపించవు. సిటీ పేరుతో కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, పార్టీ భూములను కబ్జా చేసుకుంది.

అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది చేసింది. రామమందిరమైనా, ట్రిపుల్ తలాక్ అయినా.. ఆర్టికల్ 370 అయినా.. ఏదైనా.. మేం పూర్తిచేశాం.ఏ పార్టీ తాను ఇచ్చిన హామీలను పూర్తిచేస్తోంది. అనేదానిపై ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వం.. పూర్తిగా అవినీతి, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది, మత రాజకీయాలకు పాల్పడుతూ.. రాజ్యాంగ విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు ఇస్తోంది. 4% రిజర్వేషన్లు తొలగించి.. వాటిని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పంచుతాం.

ఓ వర్గానికి ఉచితంగా కోచింగ్ పేరుతో విభేదాలు సృష్టించే ప్రయత్నం ఏ పార్టీ ఇంతవరకు చేయలేదు. మేం ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం. వరికి క్వింటాలుకు రూ.3,100 ఇస్తాం. పారాబాయిల్డ్ రైస్ కొంటాం.మోదీ ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తే.. బీజేపీ పాలిత రాష్ట్రాలుచాలావరకు ధరలు తగ్గించి పేదలపై భారాన్ని తగ్గించాయి.కానీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు నామమాత్రంగా తగ్గిస్తే.. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ.. వ్యాట్ తగ్గించలేదు. మేం అధికారంలోకి రాగానే.. వ్యాట్ తగ్గిస్తాం. రామమందిర నిర్మాణం.. జరుగుతోంది. మేం వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ దర్శనం చేయిస్తాం.

నరసింహారావు గారిని కాంగ్రెస్ అవమానించింది. అంజయ్య గారిని అవమానించింది. కాంగ్రెస్ తీరు ఇదే.తెలంగాణను అవకాశం దొరికినప్పుడు అవమానించడం కాంగ్రెస్ కు అలవాటు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరి ఆలోచన ఒక్కటే. వారిద్దరూ ఒక్కటే. మీరు వేసే ఓటు.. అధికార మార్పిడి అయితే.. కాంగ్రెస్ కు వేస్తే.. అది బీఆర్ఎస్ కు మళ్లీ అధికారం అప్పగించినట్లే.

బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు.. 2జీ, 3జీ, 4జీ పార్టీలు.ఇక్కడ ప్రజాస్వామ్య విలువలకు గుర్తింపు లేదు. కేవలం కుటుంబమే వీరి సర్వస్వం.ఎన్నికల సమయంలో వీరి జెండాలు వేరైనా.. ఎన్నికల తర్వాత ఏం చేయాలనే అజెండా మాత్రం ఒక్కటే. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసే బాధ్యత బీజేపీది. కాంగ్రెస్ పార్టీ.. 2004 నుంచి 2014 కు సంయుక్త ఆంధ్రప్రదేశ్ కు 2 లక్షలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇస్తే.. ఈ పదేళ్ల లో.. మా ప్రభుత్వం ఒక్క తెలంగాణకే.. రూ. 2.5 లక్షలకోట్లు ఇచ్చాం.

హైవేలు, రైల్వేలు, ఇతర మౌలిక వసతుల కల్పన, పరిశ్రమలు.. ఇలా అవకాశమున్నచోటల్లా తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది.మాదిగ సామాజిక వర్గానికి దశబ్దాలుగా జరుగుతున్న అన్యాయానికి.. చరమగీతం పాడేందుకు.. నిర్ణయం తీసుకున్నాం. ఈ దిశగా పనిచేస్తున్నాం.

వెనుకబడిన వర్గాల రాజ్యాధికార ఆకాంక్షలకు అనుగుణంగా.. వారిని బీసీ చేస్తాననిచెప్పాం. బీజేపీకి అవకాశం ఇవ్వండి. మీరు కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే వారు బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే.. వారు అవినీతిలో మునిగిపోయారు. బీజేపీకి అవకాశం ఇస్తే.. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం.

అల్లర్ల విషయంలో బీజేపీ ట్రాక్ రికార్డు మీకు ఆన్ లైన్లో దొరుకుతుంది. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత అల్లర్లకు ముగింపు పలికాం. మేం అప్పీజ్ మెంట్ కు మద్దతివ్వం కాబట్టి.. అల్లర్లు లేవు. తెలంగాణ విమోచన దినోత్సవం జరపకూడదని ఎందుకు బీఆర్ఎస్ నిర్ణయించిందో చెప్పండి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో.. అవినీతి కేసులను విచారణ సంస్థలు జరుపుతాయి.బెంగాల్ లో భారతీయ పౌరసత్వాన్ని అమ్ముకుంటున్నారని తెలిసింది. మేం దీన్ని విచారిస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించం. ప్రధానమంత్రి గురించి.. హీనమైన భాష వాడినపుడు.. ప్రజలే అలా మాట్లాడిన వారికి సరైన సమాధానమిచ్చారు.

బెంగాల్ లో భారతీయ పౌరసత్వాన్ని అమ్ముకుంటున్నారని వస్తున్న వార్తలపై మేం దీన్ని విచారిస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించం. ప్రధానమంత్రి గురించి.. హీనమైన భాష వాడినపుడు.. ప్రజలే అలా మాట్లాడిన వారికి సరైన సమాధానమిచ్చారు. ఒవైసీ పార్టీ పాలస్తీనా పార్టీతో ఓట్లు అడగడంలో వింతేముంది. అందులో ఆశ్చర్యం ఏముంది. ఒవైసీ అంతకన్నా గొప్పగా ఏం చెప్పగలరు. హైదరాబాద్ లో రోహింగ్యాలున్నాయని.. వస్తున్న వార్తల విషయంలో మేం విస్మరించలేదు. ఎన్ఐఏ పనిచేస్తోంది. మేం ఈ పరిస్థితులను ఉపేక్షించం. ఒవైసీ, బీఆర్ఎస్ కు రోహింగ్యాలు ఓటుబ్యాంకు . మాకు మాత్రం దేశ ద్రోహులే.

ఇంట్లో కూర్చుని ప్రభుత్వాలు నడిపే వారికి అకౌంటింగ్ లెక్కలు తెలియవు. ఇందుకోసం ఆఫీసుకు వెళ్లి.. అధికారులతో నిరంతరం చర్చించాల్సి ఉంటుంది. కేసీఆర్ ఫాంహౌజ్ లో కూర్చుంటాడు ఆయనకు లెక్కలేం తెలుసు.మేం రైతుబంధు ఆపబోం.మేం దక్షిణభారతంలోని అన్ని రాష్ట్రాలపై సమాన దృష్టితో పనిచేస్తాం.సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అంటే.. కుల, మతాలకు అనుగుణంగా ఎవరిపైనా వివక్ష చూపబోమని దానర్థం. మైనారిటీలకు ఉచిత ధాన్యం దొరకడం లేదా? మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం. పాతబస్తీ అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం.

LEAVE A RESPONSE