Suryaa.co.in

Telangana

విద్య ద్వారానే వికాసం

-నేటి బాలలే రేపటి పౌరులు
-రేపటి పౌరులే భావి భారత నిర్మాతలు
-టివిఎం పాఠశాలలో నియోజకవర్గస్థాయి క్రీడల ను -ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క

విద్య ద్వారానే సమాజం వికసిస్తుందని మధిర శాసనసభ్యులు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని, రేపటి పౌరులే భావి భారత నిర్మాతలన్నారు. శనివారం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ దినోత్సవం సందర్భంగా మధిర టీవీఎం పాఠశాలలో నియోజకవర్గస్థాయిలో ఏర్పాటు చేసిన క్రీడలను రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ రూపొందించిన రాజ్యాంగంలో బాల బాలికలను స్వేచ్ఛను కాపాడే విధంగా అనేక హక్కులు పొందుపరిచామన్నారు. స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి సతీసహగమనం, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ ను నిర్మూలించి నిర్బంధ ఉచిత విద్యను తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ కు ఉందన్నారు. సమాజంలో నెలకొన్న సాంఘిక దురాచారాలను కాంగ్రెస్ రూపుమాపిందన్నారు. భారత ప్రభుత్వ చట్టంలో పొందుపరిచిన హక్కుల ద్వారా బాలబాలికలు తమ బాల్యాన్ని సంతోషంగా గడుపుతున్నారని వివరించారు. విద్య ద్వారా వికాసాన్ని పొందే విధంగా రూపొందించారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీఐ మురళి, మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిర్యాల రమణ గుప్తా, జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్నాటి రామారావు, సైదలిపురం సర్పంచ్ చిట్టిబాబు, మధిర మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్, మాగంటి జంపయ్యా, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE