ఒక పులి అడవిలో తాత, తండ్రి పేరు చెప్పుకుని తిరిగేది. అడవిలో అటుగా వచ్చిన జంతువులను తినేసింది. ఒకరోజు ఒకమనిషి అటుగా వస్తే… నేను మారాను…నా దగ్గర కు రా అని పులి చెప్పింది. అయినా నమ్మను అంటే…నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటా అని నమ్మబలికింది. దగ్గరకు వచ్చాక… ఆ మనిషిని పులి తినేసింది. ఇందులో పులి ఎవరో ఇప్పటికే అందరికీ అర్ధం అయ్యి ఉంటుంది. మనిషిని మారాను, అన్నీ ఇచ్చేస్తాను అంటే గెలిపించారు. ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అని మోసం చేశారు. మూడున్నర యేళ్లల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారా. నోటిఫికేషన్ అన్నావు, డిఎస్సీ అన్నావు.. ఏమైంది. వాళ్ల కార్యకర్తలు కు వాలంటీర్లు గా ఇచ్చి ఉద్యోగాలు గా ప్రచారం చేసుకుంటారా. వాలంటీర్ లను కమీషన్ ఏజెంట్లుగా మార్చారు. మోడీ దేశంలో ఐదు లక్షల మంది కి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. ఎపి లొ మాత్రం ఉన్న ఉద్యోగాలు కుడా జగన్ పీకేశారు. యువత భవిష్యత్తు ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్ లో మూడు శాతం, గుజరాత్ లో 2.2నిరుద్యోగ శాతం. జగన్ గొప్పగా చెప్పుకునే ఎపిలొ నిరుద్యోగ శాతం 5.5 శాతం. కేంద్రం నుండి నిధులు తెచ్చి కుడా అభివృద్ధి చేయలేదు. ఏ పధకం చూసినా సొంత పేరు, సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. పధకాలకు సొంత పేర్లు… కేంద్రం సొమ్ములు పక్కదారి పట్టిస్తున్నారు. ప్రజల సొమ్ముతో చేసే పధకాలకు మీ సొంత పేర్లు ఎందుకు. మోడి డబ్బులు ఇస్తుంటే… జగన్ సొంత గా ఇస్తున్నట్లు అబద్దాలు ప్రచారం చేసుకుంటున్నారు. ఒక సినిమాలో అబద్దాలు చెబితే ఆకులు రాలుతాయి. అలా జగన్ ను చెప్పిస్తే.. చెట్టుకు ఒక్క ఆకు కుడా ఉండదు. ప్రజలు ఇప్పుడు అయినా జగన్ మోసాలను గుర్తించండి.
ఎపిలో రాక్షస పాలన సాగుతుంది: కన్నా లక్ష్మీనారాయణ
మోడీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రచారం చేయాలి. ఎపిలో 2019నుండి రాక్షస పాలన సాగుతుంది. ఈ అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లిన బిజెవైఎం కార్యకర్తలు ను అభినందిస్తున్నా. ఒక్క అవకాశం ఇస్తే అన్ని విధాలా అభివృద్ధి చేస్తా అని జగన్ నమ్మించాడు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే
మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి కంపెనీ తో వ్యాపారం చేసుకుంటున్నాడు. రాష్ట్రం లో రాజకీయ క్రీడ లతో అభివృద్ధి లేకుండా చేశారు. కనీసం విలువలు లేని విధంగా రాష్ట్రం లో రాజకీయాలు దిగజారాయి. పోలీసులు ప్రతిపక్ష నేతలను నియంత్రణ చేయడానికే పని చేస్తున్నారు. అభివృద్ధి లేని రాష్ట్రం అంటే దేశంలో ఎపి మాత్రమే. పోలవరం నిర్మాణం విషయంలో రాజకీయమే. జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు కంపెనీ మాత్రమే దినదినాభివృద్ధి చెందుతుంది. అందులొ పని చేసే వాళ్లకి ప్రభుత్వం నుంచి జీతాలు ఇస్తున్నారు. ఈ రాక్షస పాలనకు చరమ గీతం పాడాలి. ఎపి అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజన్ పాలన రావాలి.
హామీలను అమలు చేయకుండా జగన్ మోసం చేశారు: సిఎం రమేష్
జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారు. ఉద్యోగాలు ఇవ్వలేదు… పరిశ్రమ లు ఏర్పాటు చేయలేదు. ఇలాగే ఉంటే రేపు రాష్ట్రంలో యువత భవిష్యత్తు ఏమిటి. జగన్ మాటలకు యువత మోస పోయారు. ఇక జగన్ మాటలను విశ్వసించే పరిస్థితి లేదు. ఎపిలో యువత కు బిజెపి అండగా ఉంటుంది. ప్రతి పనిలోనూ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి కి పాల్పడుతుంది. ప్రజలకు ఇచ్చేది కొంచెం… వివిధ రూపాలలో వసూళ్లు చేసేది రెట్టింపు. పెట్రో ఉత్పత్తులు, రోడ్ సెస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. రాష్ట్రం లో జాతీయ రహదారులు తప్ప, రాష్ట్ర రహదారుల పై ప్రయాణించి పరిస్థితి లేదు. చేసిన పనులకు కూడా కాంట్రాక్టర్ లకు డబ్బులు ఇవ్వడం లేదు. ఇటీవలే ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం చూశాం. ఇటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి. ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే మోడీకి పట్టం కట్టాలి. జగన్ ప్రభుత్వాన్ని దించే వరకు పోరాటం కొనసాగాలి.