Suryaa.co.in

Andhra Pradesh

కేంద్రం ఇచ్చిన నిధులతో ఏపీ అభివృద్ధి

– ప్రభుత్వానికి రంగులు మార్చుకోవడం ఉన్న శ్రద్ద ఇళ్ల నిర్మాణం లో లేదు
– కేంద్రం సర్పంచు లకు నిధులు ఇస్తే వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించింది
– ప్రకాశం జిల్లాకు చెందిన సర్పంచులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మ హత్యాయత్ననికి పాల్పడ్డారు
– రాయలసీమ ఏడు జిల్లాల జోనల్ మీటింగ్ లో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
– ప్రొద్దుటూరు లో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

మొట్టమొదటి సారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కడప వచ్చాను.రాష్ట్ర పర్యటన రాయలసీమ నుంచి ప్రారంభించడం సంతోషదాయకం. తండ్రి దివంగత మహానేత నందమూరి తారకరామారావు రాయలసీమ నుంచే రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. అన్ని వర్గాల వారి సంక్షేమమే బీజేపీ ద్యేయం.పేదరికంలో పుట్టి పెరిగిన ప్రధాని పేదల పక్షాన నిలబడ్డారు.

ప్రత్యేక రాష్ట్రంగా ఏపీ ఏర్పడ్డాక అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.కేంద్రం ఇచ్చిన నిధులతో అభివృద్ధి జరుగుతుంది. ఏపీకి కేంద్రం 22 లక్షల ఇల్లు మంజూరు చేసింది.కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమేరకు ఇల్లు నిర్మించింది. రాష్ట్ర ప్రభుత్వానికి రంగులు మార్చుకోవడం ఉన్న శ్రద్ద ఇళ్ల నిర్మాణంలో లేదు. మద్యంతో వైసిపీ ప్రభుత్వం జేబులు నింపు కుంటుంది.మైనింగ్ వైసీపీ ప్రభుత్వానికి కావాల్సిన వారికి ఇచ్చుకుంటున్నారు. కేంద్రం సర్పంచు లకు నిధులు ఇస్తే వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించింది. ప్రకాశం జిల్లాకు చెందిన సర్పంచులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మ హత్యాయత్ననికి పాల్పడ్డారు. సర్పంచులకు కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం.రాయలసీమ కరువు ప్రాంతం.రాష్ట్రంలో ప్రాజెక్టు ల పరిస్థితి అద్వాన్నంగా ఉంది.రాయలసీమ ఎత్తిపోతల పథకం నల్లేరు మీద నడకలా సాగుతుంది. అన్నమ్మయ్య డ్యామ్ గేటు కొట్టుకుపోతే ఇంత వరకు మరమ్మత్తులు చేయలేని రాష్ట్ర ప్రభుత్వం.వరదల్లో ఇల్లు కొట్టుకుపోయిన వారికీ ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వలేదు.3 నెలల్లో వరద బాధితులకు ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన సిఎం జగన్.

కడప స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తామని నిరుద్యోగ యువత ను మోసం చేసింది.నిరుద్యోగ యువత వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏపీ లో ఏర్పడింది.నేషనల్ హై వే లకు వేల కోట్లు మంజూరు చేసిన ఘనత కేంద్ర లోని బీజేపీ ది..ఏపీ లో అభివృద్ధి కి కేంద్ర సహకారం ఉంది. ప్రాజెక్టు ల మీద సీత కన్ను రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఏపీ లో రోడ్ల పరిస్థితి అద్వాన్నం గా ఉంది.ఇసుక లో వైసిపీ కి చెందిన ప్రజాప్రతినిధులు అవినీతి కి పాల్పడుతున్నారు..

LEAVE A RESPONSE