విస్తృతంగా ఇంటింటికి బిజెపి కార్యక్రమం
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప
నారాయణఖేడ్: జన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు “ఇంటింటికీ బీజేపీ” కార్యక్రమం నారాయణఖేడ్ లోని నేమ్లీమేట్ గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప పాల్గొన్నారు.గడప గడపకు తిరుగుతూ రాష్ట్రంలో ప్రజలకు కేంద్రము నుండి అందుతున్న సంక్షేమ పథకాలను బిజెపి నాయకులు వివరించారు.
కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్అమ్ముడు పోతారన్నారు. మోడీ నాయకత్వంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సంగప్ప అన్నారు. కార్యక్రమం లో పార్టీ సీనియర్ నేతలు సాయిరాం, సంజు పాటిల్, రాజు గౌడ్ తో పాటు నమ్లిమేట్ బీజేపీ నాయకులు మహేష్, శివ, జైపాల్, కూర్మ రాజు, దత్తు, రజినీకాంత్ తో పార్టీ నాయకులు పాల్గొన్నారు.