కడప: కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ న్యాయవాది కర్నాటి భువన ఏకాదశి రెడ్డి. శనివారం సాయంత్రం కడప పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, ఏపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతం, ఏపీసీసీ రాయలసీమ ఇంచార్జ్ శ్రీరామ్ త్రిమూర్తులు మరియు ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి ల ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 5 వేలకు పైచేలకు ఓట్లు సంపాదించిన కర్నాటి భువన ఏకాదశి రెడ్డి కడప కోర్టులో ప్రముఖ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఈ మేరకు ఆయన తన అనుచర వర్గం తో కలసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం యొక్క లోపాయికార, అవినినీతిమయమైన, మతోగ్రవాధ పరిపాలన గురించి ప్రజలు తెలుసుకుంటున్నారని, అందుకే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు ఏంటో మళ్లీ ప్రజల దృష్టికి విస్తృతంగా తీసుకువెళ్తానని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కొరకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.