Suryaa.co.in

Telangana

బేగంపేట డివిజన్ లో 61కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృషి
– పద్మారావు నగర్ TRS ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్

సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట డివిజన్ లో 61 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం ఉదయం 8.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రారంభిస్తారని పద్మారావు నగర్ TRS పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేగంపేట వాసుల ఎన్నో సంవత్సరాల నిరీక్షణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ఫలించిందని తెలిపారు. ప్రతి ఏటా బేగంపేట నాలాకు ఎగువ నుండి వచ్చే వరదనీటితో ప్రకాష్ నగర్, అల్లంతోట బావి, బ్రాహ్మణ వాడి, మాతాజీ నగర్, వడ్డెర బస్తీ తదితర ప్రాంతాలు ముంపుకు గురవుతూ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గడచిన 40 సంవత్సరాల లో ఈ సమస్య పరిష్కారానికి ఎవరు పట్టించుకోలేదని అన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాలా పరిసర ప్రాంత ప్రజలు వరదనీటితో పడుతున్న అవస్థలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ల దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృషి ఫలితంగా SNDP కార్యక్రమం క్రింద బేగంపేట నాలా అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 45 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. ఈ నిధులతో చేపట్టనున్న నాలా అభివృద్ధి పనులతో ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.

నాలా అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి KCR, మున్సిపల్ శాఖ మంత్రి KTR లకు, సమస్య పరిష్కారానికి చొరవ చూపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు గుర్రం పవన్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE