జగన్ రెడ్డి … నెలరోజుల్లో కృష్ణానదిలో చేప పిల్లలను వదలకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
కృష్ణానదికి గత నాలుగు నెలలుగా వరదఫ్లో వస్తూనే ఉండటంతో కృష్ణానదిలో చేపల వేట పూర్తిగా నిలిచిపోవడంతో తినడానికి తిండిలేక, వేటకు వెళ్ళడానికి పనిలేక మత్య్సకారులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి వెంటనే బియ్యం, తదితరాలు ఇచ్చి చేప పిల్లలను నదిలో వదలకపోతే జేడీ కార్యాలయం ముందు మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో కలసి మత్య్స కారులు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇబ్రహీంపట్నం మడంలంలోని తుమ్మలపాలెం గ్రామంలో మత్య్సకారులను కృష్ణానది ఒడ్డున ఆయన కలిసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…బాధ, ఆవేదనతో మత్యకార సోదరులున్నారు.. మేము మనుషులమే, మేము బతకాలి, తాడేపల్లి కొంప ఇక్కడికి ఎంతో దూరంలో లేదు, చేప పిల్లలు వెయ్యడానికి ముఖ్యమంత్రికి చేతులు రావడం లేదు. నీ కొంపకు దగ్గరలో మ్యత్యకార సోదరుల ఆవేదన చూడండి జగన్ రెడ్డి, నీ శాసనసభ్యుడిని అడిగితే ఎవడికి డబ్బులు కట్టావో వాడిని ఆడ్డుకో అంటున్నాడు. 150 రుపాయల దానికి 550 వసూలు చేశారు, 6 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి పేదవారి దగ్గర ఇలా వారి కష్టం దోచేస్తారా ?
లక్షల టన్నుల బియ్యం వస్తే గోడాన్ లో పెట్టారు, కేంద్ర పంపిన బియ్యం కుడా ఇవ్వడం లేదు. కృష్ణ నదిని ఎలా చేశారో చూడండి, మీ నాడు నేడు ఇదేనా, మీ పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇవేనా ?తినడానికి లేక, వేటకు వెళ్ళడానికి పని లేక ఇబ్బందులు పడుతుంటే మానవత్వం లేకుండా చేస్తున్నారు. వెంటనే వీరికి బియ్యం తదితరాలు ఇవ్వాలి, చేప పిల్లలను వదలాలి లేకపోతే మీ కార్యాలయాన్ని మత్యకారులతో ముట్టడి జరుగుతుంది అని హెచ్చరిస్తున్నా.నెల రోజుల్లోపు చేప పిల్లలను వదలకపోతే మీ జేడీ కార్యాలయం ముందు కొల్లు రవీంద్ర నేను ప్రత్యక్షంగా ఆందోళనకు వస్తానని జగన్ రెడ్డి నీ, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా !
మేం మనుషులం కాదా ? ఇళ్ళు కట్టరు, ఇళ్ళ స్థలాలు ఇచ్చాం అంటారు స్థలం చూపించరు. మేం వేసిన సిమెంట్ రోడ్లు, లైట్లు తప్ప పెద్దగా చేసిందేమీ లేదు, మత్యకారులకు మేం చేసిందీ తప్ప ఈ ప్రభుత్వం ఏం చెయ్యలేదు వెంటనే స్పందించాలి.పార్టీ తరుపున కుడా అండగా ఉంటాం, మత్యకారులకు అండగా ఉంటాం, అందరం కలిసి ఈ ప్రభుత్వంపై పోరాటం చేద్దాం. పెర్రీ లో ఇసుక తోలుకెళ్లడానికి తోడేళ్ళలాగా పల్లెకారులను బెదిరిస్తున్నారు అంట.. పడవ ఇసుక తెచ్చి యూనిట్ ఇసుక 200 రుపాయలకు అప్పజెప్పాలంట. ఎమ్మెల్యే … వినపడుతుందా ఏవిధంగా చేస్తున్నారో.. యూనిట్ ఇసుక 180 ఇచ్చి యునిట్ ఇసుక 6 వేలకు దోచుకెళుతున్నారు.. పేదవాడి దగ్గర 180 ఇచ్చి కోట్టేస్తున్నారు. ఎమ్మెల్యే, అతని అనుచరులు ఇసుక దోచేస్తున్నారు, ఇతర రాష్ట్రాలకు అమ్మేసుకున్నారు, నేను ప్రశ్నిస్తే నన్ను బూతులు తిడుతున్నారు.
నువ్వు ఎన్ని తిట్టినా, అసభ్యంగా మాట్లాడిన నీ పాపాన నువ్వే పోతావు, పోయేకాలం వచ్చింది ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఇంకో సంవత్సరం మాత్రమే ఉంటుంది.పల్లెకారులు, మత్యకారులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వరదల వలన నష్టపోతే ఎవరికి నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ కృష్ణా నది వరద లోనే ఈ జగన్ ప్రభుత్వాన్ని కలిపేస్తారు.