ప్రజల నుంచి డైరెక్ట్ ఫీడ్ బ్యాక్ కోసం ‘జగనన్నకు చెబుదాం’

ఏపీలో వైసీపీ సర్కారు మరో కొత్త కార్యక్రమం
త్వరలోనే ప్రారంభం

ఏపీలో జగన్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ప్రజల నుంచి డైరెక్ట్ ఫీడ్ బ్యాక్ కోసం ‘జగనన్నకు చెబుదాం’ పేరుతో కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జగన్ సర్కారు కసరత్తు చేస్తోంది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం విధివిధానాలపై సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో సోమవారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, వాటిలో లోపాలు, ఇతర సమస్యలపై ప్రజలు నేరుగా సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసే అవకాశం లభించనుంది.