• పోలవరం నిర్మాణంపై పొరుగు రాష్ట్ర వ్యక్తి వెదిరేశ్రీరామ్ నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమంత్రి అసమర్థత కాదా?
• సోయిలేని రాంబాబుతో సొల్లుకబుర్లు చెప్పించకుండా, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ముఖ్యమంత్రి ప్రజలముందుకొచ్చి సమాధానం చెప్పాలి
• రౌతుని బట్టే గుర్రంపరిగెడుతుంది… చంద్రబాబుసమర్థుడు కాబట్టే పోలవరం నిర్మాణాన్ని 72శాతంపూర్తిచేశాడు.
• సీబీఐ, ఈడీకేసులభయంతో, ఎన్నికల్లో పొరుగుముఖ్యమంత్రి డబ్బులిచ్చాడని, జగన్మోహన్ రెడ్డి పోలవరాన్నితాకట్టు పెట్టేశాడు
• ముఖ్యమంత్రి మూర్ఖత్వం, డబ్బువ్యామోహం, తెలివితక్కువతనం, అవగాహనారాహిత్యమే పోలవరానికి శాపాలు
• టీడీపీహాయాంలో రూ.55,548కోట్లకుప్రాజెక్ట్ నిర్మాణవ్యయం ఆమోదంపొందితే, ఇప్పుడు వెదిరేశ్రీరామ్ రూ.9వేలకోట్లు చాలంటే విజయసాయిరెడ్డి మూసుక్కూర్చున్నాడు
• 800కోట్లతో గుంతలుపూడుస్తాము.. 2వేలకోట్లతో నీళ్లు తోడతామంటూ ఎన్నాళ్లుకబుర్లు చెబుతావు రాంబాబు?
• ఎత్తిపోతల పథకాల లొసుగుల్ని ఎత్తిచూపినవారిని తిడితే రైతులకు నీళ్లుఅందవు రాంబాబు.
• పోయిన మంత్రేమో బుల్లెట్ దిగుద్ది అన్నాడు.. వచ్చిన మంత్రికేమో పులిచింతల చూడగానే నోరుపడిపోయింది
• మూడేళ్లలో రాష్ట్రంలో ఒక్కప్రాజెక్ట్ పూర్తిచేశారా? 6 ప్రాధాన్యతాప్రాజెక్ట్ ల్లో ఎన్నిపూర్తిచేశారు?
• పరిపాలన చేతకాకపోతే రాజీనామాలు చేసిఎన్నికలకు వెళ్లండి. మీలాంటి వారుకోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
పోలవరం నిర్మాణాన్ని ప్రశ్నార్థకంగా మార్చిన జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుతూ పాడిందేపాటరా…పాచిపళ్లరాంబాబు అన్నట్టుగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై బాధ్యతలేకుండా ఇరిగేషన్ మంత్రి మాట్లాడాడని, ముఖ్యమంత్రి నోరు తెరవకుం డా, పోలవరం నిర్మాణాన్ని పక్కరాష్ట్రం వ్యక్తిచేతిలోపెట్టారని, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే …
వెదిరే శ్రీరామ్ పక్కరాష్ట్రానికిచెందిన వ్యక్తి. ఐదేళ్లపాటు టీడీపీప్రభుత్వం పోలవరంపనుల్ని పరుగులుపెట్టించి 72శాతం పూర్తిచేసింది. రెండుసీజన్లలో గోదావరిలో వచ్చేవరదను తట్టుకు నేలా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తిచేశాము. 24గంటల్లో నిర్విరామంగా 32,535క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పోలవరంప్రాజెక్ట్ చేరింది. కేంద్రఇంధనశాఖమంత్రి చేతులుమీదుగా బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గా 2018లో టీడీపీప్రభుత్వంలో అవార్డుతీసుకున్నాము. దేశంలో 16జాతీయప్రాజెక్ట్ లుఉంటే, వాటిలో ఒక్కపోలవరానికి మాత్రమే అవార్డ్ దక్కింది.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక డబ్బుకక్కుర్తితో పోలవరంపనులుచేస్తున్న ఏజెన్సీ లను (కాంట్రాక్ట్ సంస్థలు) తన్నితరిమేశాడు. కచ్చితంగా వరదలువచ్చేసమయంలో ఏజెన్సీ లను డ్యామ్ సైట్ నుంచి బయటకుపంపించాడు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తొందరపడి నిర్ణ యాలు తీసుకోవద్దని, డిఫెక్ట్ మేనేజ్ మెంట్ లోపాలను సరిదిద్దుకోవడం కష్టమవుతుందని చెప్పినావినకుండా, 2019 నవంబర్లో రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడాడు. రివర్స్ టెండరిం గ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ జరిపిన జగన్ రెడ్డి, ఒకేఏజెన్సీకి పనులు అప్పగించి పోలవరం ప్రాజెక్ట్ ని ప్రశ్నార్థకంచేశాడు.
ముఖ్యమంత్రి మూర్ఖత్వం, తెలివితక్కువతనం, అవగాహానా రాహిత్యం, అనుభవంలేని కారణంగా జాతీయప్రాజెక్ట్ నీరుగారిపోయింది. పోలవరం నిర్మాణం పై రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేసింది. ముఖ్యమంత్రిమౌనం రాష్ట్రరైతాంగానికి మంచిదికాదు. జోకర్ లాంటి జలవనరులమంత్రితో పిచ్చిమాటలు మాట్లాడించడంకాదు ముఖ్యమంత్రి చేయాల్సింది. కేంద్రజలవనరులశాఖామంత్రిగా గడ్కరీ ఉన్నప్పుడు రెండుసార్లు పోలవరం ప్రాజెక్ట్ నుసందర్శించి, జరుగుతున్న పనులపై సంతోషం వ్యక్తం చేశారు. అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నిర్మాణంలో దేశం గర్వించేలా ప్రాజెక్ట్ పూర్తి కాబోతోందని గర్వంగా చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో పోలవరానికి ఈ ఖర్మ పట్టిందేమిటని ఈమధ్యనే కేంద్రజలవన రులమంత్రి షెకావత్ తలకొట్టుకోలేదా? రెండేళ్లక్రితమే తాను డ్యామ్ సందర్శనకు వచ్చిఉంటే, ప్రాజెక్ట్ కి ఈ గతి పట్టేదికాదని ఆయన వాపోయింది నిజంకాదా? రౌతునిబట్టే గుర్రం పరిగెడు తుంది అనడానికి ఇదే నిదర్శనం.
టీడీపీప్రభుత్వం ఉన్నప్పుడు వెదిరేశ్రీరామ్ అనేవ్యక్తి అడ్రస్ లేడు. పోలవరం నిర్మాణంపై ఎవ రో సంబంధంలేని వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్థతే. ముమ్మాటికీ జగన్మోహన్ రెడ్డి మౌనమే రాష్ట్రరైతాంగానికి శాపంగా మారింది. జోకర్ లాంటి జలవనరుల మంత్రితో పిచ్చిమాటలు మాట్లాడిస్తేసరిపోదు. చంద్రబాబుని, దేవినేని ఉమాని, టీడీపీనేతల్నితిడితే పోలవరం పూర్తికాదని తెలుసుకోండి. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి, అసెంబ్లీలో మాట్లాడుతూ పోలవరం ఎత్తుతగ్గిస్తారన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరుతెరవలేదు? గత ఎన్నికల్లో నిధులు తెచ్చుకున్నదానికి ప్రతిఫలంగానే జగన్మోహన్ రెడ్డి, పొరుగుముఖ్యమంత్రి ఆదేశాలకులోబడి పోలవరాన్ని తాకట్టుపెట్టాడు. పోలవరంనిర్మాణంపై పొరుగురాష్ట్రవ్యక్తి నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమంత్రి అసమర్థత కాదా?
టీడీపీప్రభుత్వంలో వెదిరే శ్రీరామ్ అడ్రస్ లేడు. టీడీపీహాయాంలో, చంద్రబాబుగారిచొరవతో రూ.55,548కోట్లకుప్రాజెక్ట్ నిర్మాణవ్యయం కేంద్రప్రభుత్వంతో ఆమోదింపబడితే, ఇప్పుడేమో వెదిరేశ్రీరామ్ మొత్తంగా ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.9వేలకోట్లు చాలంటున్నా విజయసాయిరెడ్డి ఢిల్లీలో మూసుక్కూర్చున్నాడు. ముఖ్యమంత్రేమో అసలు తానేమీ వినలేదు…తనకేమీ తెలియదన్నట్లే ఉన్నాడు.
2020లోనే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే 2021లో, 2022 జూన్ , 2023 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి ఎలాచెప్పారు? పాతజలవనరుల మంత్రి బుల్లెట్లు దించుతాము..ప్రాజెక్ట్ ఓపెనింగ్ కి టీడీపీవాళ్లను పిలుస్తాము అని వ్యంగ్యంగా మాట్లాడాడు. మంత్రి పదవిపోయాక నన్నేమీ అడగొద్దంటూ నంగినంగిగా మాట్లాడుతున్నా డు. మీ నాయకుడిపై ఉన్న సీబీఐ, ఈడీకేసులభయంతో పోలవరాన్ని తాకట్టుపెడతారా? ముఖ్యమంత్రినిజంగా పోలవరాన్ని పూర్తి చేయాలనుకుంటే, టీడీపీహాయాంలో ఆమోదింప డిన ప్రాజెక్ట్ నిర్మాణవ్యవయం రూ.55,548కోట్ల అంచనవ్యయానికి ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడి ఎందుకు ఆమొత్తాన్నిసాధించలేకపోతున్నాడు? డయాఫ్రమ్ వాల్ నిర్మాణం గురించి పెద్దపెద్ద కబుర్లు చెప్పే వ్యక్తికి, పులిచింతల ప్రాజెక్ట్ లో గేటు కొట్టుకుపోయి ఎన్నాళ్లైందో తెలియదా?
డయాఫ్రమ్ వాల్ వద్ద 800కోట్లతో గుంతలుపూడుస్తాము.. 2వేలకోట్లతో నీళ్లుతోడతామంటూ ఎన్నాళ్లుకబుర్లు చెబుతావు రాంబాబు? పోయిన మంత్రేమో బుల్లెట్ దిగుద్ది అన్నాడు.. వచ్చిన మంత్రికేమో పులిచింతల చూడగానే నోరుపడిపోయింది. పులిచింతల గేట్ కొట్టుకుపోయి నెలరోజులైతే ఏంచేస్తున్నావు రాంబాబు? మూడేళ్లలో రాష్ట్రంలోఒక్కప్రాజెక్ట్ అయినా పూర్తిచేశారా? 6 ప్రాధాన్యతాప్రాజెక్ట్ ల్లో ఎన్నిపూర్తిచేశారు? పరిపాలన చేతకాకపోతే రాజీనామాలు చేసిఎన్నికలకువెళ్లండి. మీలాంటి వారుకోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే. పక్కరాష్ట్రవ్యక్తి పోలవరంపై రివ్యూచేస్తుంటే ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ లో చేతులుకట్టుకొని కూర్చుంటాడా? నిర్వాసితులసొమ్ముని, వారికే తెలియకుండా వైసీపీవారు పందికొక్కుల్లా తింటుంటే ముఖ్యమంత్రికి, రాంబాబుకి కనిపించ లేదా?
పాదయాత్రలో నిర్వాసితులకు ఇస్తానన్న అదనపుసాయం, నిర్మిస్తానన్న ఇళ్లసంగతి ఏంచేశావు జగన్మోహన్ రెడ్డీ? రాష్ట్రవ్యాప్తంగాఉన్నఎత్తిపోతలపథకాల్లోని లొసుగుల్ని ఎత్తి చూపిన వారిని తిడితే రైతులకునీళ్లుఅందుతాయా రాంబాబు? చంద్రబాబుగారి హయాం లో రాష్ట్రంలోని400ఎత్తిపోతలపథకాలు బ్రహ్మండంగా నడిచాయి. వాటినుంచి దాదాపు 8లక్షలఎకరాలకురైతులకు నీరు అందింది. ఎత్తిపోతల పథకాలను గాలికి వదిలేసింది కాక, వాటినిర్వహణను ఎత్తి చూపిన వారిపై నిందలేస్తారా? ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తేనే నిర్వాసితుల సమస్యలు, ప్రాజెక్ట్ నిర్మాణంలోని దుస్థితిబయటపడిందని తెలుసుకోండి. సోషల్ ఇంజనీ రింగ్ లోపూర్తిగా వైఫల్యంచెంది, సాగునీటిసంఘాలు, రైతుసంఘాలను గాలికి వదిలేయడం వల్లే సాగునీటిపథకాలు చంకనాకిపోయాయి.
శ్రీశైలం డ్యామ్ స్పిల్ వే వద్దఉన్న 40మీటర్లు గుంతకానివ్వండి, ప్రకాశం బ్యారేజ్ లో పడవ అడ్డంపడటంగానీ, పులిచింతలగేటు కొట్టుకుపోవడంగానీ, అన్నమయ్యప్రాజెక్ట్ కొట్టుకుపోవడం గానీ, రాష్ట్రంలోని డ్యామ్ ల భద్రతావిషయాలుగానీ ఇలాచెప్పుకుంటూపోతే ఈ ప్రభుత్వ వైఫల్యాలు చాలానేఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి కేఆర్ఎంబీ, డ్యామ్ డిజైన్ రివ్యూ సభ్యులు, పాండ్యాకమిటీ, ఇతరనిపుణులకమిటీలు ఇచ్చిననివేదికల్ని పక్కనపెట్టిన ప్రభుత్వం సోయిలేకుండా నిద్రపోతోంది. మొదటిపంటతాలూకా ధాన్యాన్నికొనలేని ఈ ప్రభు త్వం మూడుపంటలకు నీళ్లిస్తుందా? ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.3వేలకోట్లు ఇంకా చెల్లించలేదు. బస్తాకి రూ.200నుంచి, రూ.300వరకు దోచుకుంటున్నారు. రైతుభరోసా కేంద్రాల్ని రైతుబోగస్ కేంద్రాలుగా మార్చారు.
పోలవరం డ్యామ్ డయాఫ్రమ్ వాల్ కు ఎందుకుఇలాంటిదుస్థితివచ్చిందో ముఖ్యమంత్రి ప్రజలముందుకు వచ్చిసమాధానంచెప్పాలి. సోయిలేని రాంబాబుతోసొల్లుకబుర్లు చెప్పించడం మానుకోండి. పోలవరం నిర్వాసితులసొమ్ముపై కూడా ముఖ్యమంత్రి సమాధానంచెప్పా లి. తప్పుడుపత్రాలతో కోట్లరూపాయలు చేతులుమారినట్లు కథనాలువస్తున్నాయి. దానిపై ముఖ్యమంత్రి స్పందించకపోతే, నిర్వాసితుల్నిదోచుకునే తంతులో ఆయనకు భాగముందనే అనుకోవాలి.