– తప్పుడుకేసులతో నీ చేతగానితనాన్ని, అసమర్థతను కప్పిపుచ్చలేవు జగన్ రెడ్డీ..
• అచ్చెన్నాయుడు, అశోక్ బాబుసహా, నారాయణపైపెట్టినకేసులన్నీ జగన్ రెడ్డి బుద్ధిలేకుండా పెట్టినవే.
• తిరుపతి సభలో ముఖ్యమంత్రి మాట్లాడాకే నారాయణ విద్యాసంస్థల్ని, నారాయణ పేరుని పేపర్ లీకేజ్ కు జతచేశారు.
• తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోతే ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షచేశాడా?
• తెలుగుజాతి ప్రైడ్ అయిన చంద్రబాబుకి నోటీసులిచ్చి,అరెస్ట్ చేస్తే, 60లక్షలమంది కార్యకర్తలఆగ్రహం చవిచూస్తావు జగన్ రెడ్డి..
• 16నెలలు జైల్లో ఉండివచ్చావని, అవినీతిచేశావని అందరూ జైళ్లలోనే ఉండాలని పగటికలలు కనడంమానేయ్..
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
కుట్ర, కుతంత్రాలే ఎజెండాగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వం, లక్షలాది విద్యార్థులకు విద్యాబుద్ధులునేర్పిస్తున్న నారాయణవిద్యాసంస్థల అధిపతినిలక్ష్యంగా చేసు కుందని, తిరుపతి సభలో ముఖ్యమంత్రి మాట్లాడాకే పేపర్ లీక్ ఘటనపై ప్రభుత్వంలో చలనం వచ్చిందని, అంతకుముందు మంత్రిబొత్స రాష్ట్రంలో ఎక్కడా పేపర్ లీక్ కాలేదన్నాడ ని టీడీపీసీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
నారాయణపై పెట్టినకేసులుపరిశీలిస్తే తొలుతచిత్తూరులో కేసునమోదైనప్పుడు సెక్షన్ 408 నమోదుచేశారు… తరువాత సెక్షన్ 409 యాడ్ చేశారు. టీడీపీనేతలెవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి నేను బురదజల్లుతాను..మీరు కడుక్కుంటూ ఉండండి అన్నట్లే వ్యవహరిస్తు న్నాడు. అచ్చెన్నాయుడు, అశోక్ బాబుసహా, ఇప్పుడు నారాయణపై నమోదుచేసినకేసుల న్నీ తప్పుడుకేసులే. తాను 16నెలలు జైల్లోఉండివచ్చాడుకాబట్టి,అందరూ జైల్లోఉండాలి.. అన్నట్టుగా జగన్ రెడ్డి తీరుఉంది.
ఒకపక్క రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం పడింది. చాలాప్రాంతా ల్లో అకాలవర్షాలు, ఈదురుగాలులకు పంటలు దెబ్బతిన్నాయి. అరటి, బొప్పాయి, మామిడి, కూరగాయలపంటలన్నీ నేలమట్టమయ్యాయి. జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి కనీసం అరగం టకూడా అధికారులతో సమీక్షచేయలేదు. కేబినెట్లోని మంత్రుల్లో ఒక్కమంత్రికూడా రైతుల వద్దకెళ్లి పరామర్శించి, ఎంతనష్టంజరిగిందని ఆరాతీసిందిలేదు. తుఫాన్ నష్టనివారణ చర్యలు తీసుకోవడంగానీ, రైతాంగాన్ని ముందస్తగా అప్రమత్తంచేయడంగానీ చేయలేదు. అసలు ఈ ముఖ్యమంత్రికి, మంత్రులకు బుద్ధి,జ్ఞానం, సిగ్గు,శరం ఉన్నాయా అని ప్రశ్నిస్తు న్నాం. జగన్మోహన్ రెడ్డి, ఆయనమంత్రుల తాపత్రయమంతా..ఎవరిని తిట్టాలి, ఎవరిపై తప్పుడు కేసులుపెట్టాలనే తప్ప, ప్రజలకష్టసుఖాలపై లేదు.
జగన్మోహన్ రెడ్డి అసలు నీకుబుద్ధుందా… తెలుగుజాతి గర్వపడే వ్యక్తి, తెలుగుప్రైడ్ అయిన చంద్రబాబుగారికి నోటీసులుఇస్తావా? ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఖ్యాతి ఇనుమడింపచేసి నవ్యక్తి చంద్రబాబుగారు. అలాంటివ్యక్తిని ఏదోచేయాలనుకుంటే నువ్వే నష్టపోతావు జగన్ రెడ్డి. తప్పుడు పనులుచేయాలనిచూస్తే జగన్ రెడ్డి.. 60లక్షలమంది కార్యకర్తలు రోడ్లపైకి వస్తారు. అదిగుర్తుంచుకో. తప్పుడుపనులు, 420పనులకు స్వస్తిచెప్పు. నీ పాలనా వైఫల్యాన్ని, పరీక్షలు నిర్వహించలేని నీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబా బుపై కేసులుపెడతావా జగన్ రెడ్డి? హెరిటేజ్ సంస్థపై కేసులు పెడతావా?
ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడుంది..హెరిటేజ్ సంస్థ భూమి ఎక్కడుంది? ఎవరో పనికిమాలిన వాడు ఫిర్యాదుచేశాడని తప్పుడుకేసులతో నోటీసులిస్తావా? కోర్టుతీర్పులు అసలు చదువుతున్నావా జగన్ రెడ్డి? ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హైకోర్ట్ గతంలో ఏమని తీర్పుఇచ్చింది? బుద్ధి, జ్ఞానంలేకుండా పనులుచేస్తున్నావు జగన్ రెడ్డి. నీ అతితెలివితేటలు, తప్పుడు నిర్ణ యాలు, తప్పుడుఫిర్యాదులు కట్టిపెట్టు. నాకునచ్చినట్టేచేస్తాను… నాకునచ్చనివారికి నోటీ సులిస్తాను, జైలుకుపంపుతాను అంటే 60లక్షల మందికార్యకర్తల ఆగ్రహం చవిచూస్తావు జగన్ రెడ్డి…. గుర్తుంచుకో.