Suryaa.co.in

National

శబరిమలకు పోటెత్తిన భక్తులు

-ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తుల తాకిడి
-విపరీతమైన రద్దీ ఉండడంతో ఏర్పాట్లు చేయలేకపోతున్న పోలీసులు
-ఆలయంలో స్వల్ప తోపులాటలు, తొక్కిసలాటలు

శబరిమలకు భారీగా భక్తులు తరలి వెళ్లుతున్నారు. అక్కడి అధికారులు, పోలీసులు అయ్యప్ప స్వాములను అదుపు చేయడం కష్టం గా‌ మారింది. అయ్యప్ప స్వామి ప్రదాన సన్నిధానం లోనూ, ఆలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ముందుకు తీసుకుని అయ్యప్ప స్వాములు దర్శనం కోసం వెళ్లుతున్నారు. సన్నిధానంలో విపరీతమైన రద్దీ పెరగడంతో పతనం తిట్ట, నిలక్కల్‌ లో కెఎస్‌ఆర్‌టిసి బస్సులు సహా, ప్రవేటు వాహనాలు గంటల తరబడి రోడ్లపై నిలిచి పోయాయి.

శబరిమల కు వెళ్లు దార్లు ట్రాఫిక్ తీవ్రంగా ఏర్పడింది. పలు ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో శబరిమల క్షేత్రం కిటకిటలాడుతుంది.‌ఒక వైపు కాలిబాట, మరోవైపు సన్నిధానం లోని అన్ని ద్వారాలు భక్తులతో నిండి పోయాయి. రద్దీ దృష్ట్యా గత రాత్రి 11 గంటలకు పంపా వద్దకు వచ్చిన భక్తులను సన్నిధానంలోకి అనుమతించడం లేదు. దీంతో త్రివేణి పంబాలలో భక్తులకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయ్యప్ప దర్శనం కోసం 12 గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

LEAVE A RESPONSE