తక్కువ టైమ్ లో డాటా ట్రాన్స్‌ఫార్మేషన్, సెన్సార్ సిస్టమ్‌ని అందిస్తామని అభ్యర్థన
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని డెక్సార్ మల్టీ నేషనల్ కంపెనీ ప్రతినిధులు మంత్రుల నివాసంలో మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వారు మంత్రితో మాట్లాడుతూ మల్టీ గిగాబిట్ పాయింట్ టు మల్టీ పాయింట్ డాటా ట్రాన్స్‌పోర్ట్ లో, సెన్సారింగ్ సిస్టమ్స్ లో తమ కంపెనీ ఎక్స్‌పర్ట్ అని చెప్పారు.
ఈ రెండు రకాల సాఫ్ట్ వేర్‌ని తాము అందిస్తామని ఇందుకు అవకాశం ఇవ్వాలని వారు కోరారు. సమయం ఇస్తే, ఇందుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తామన్నారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చూశాక… సిఎం కెసిఆర్, ఐటీ మంత్రి కెటిఆర్ ల దృష్టికి తీసుకెళ్ళి ఆలోచిస్తామని చెప్పారు. మంత్రిని కలిసినవ వారిలో డెక్సార్ సిఇఓ డాక్టర్ డిమిట్రీ కాచన్, ప్రొఫెసర్ ఎడ్వార్డ్ సిమెన్స్, ఇతర ప్రతినిధులు ఉన్నారు.