– జగన్ చేతిలో కీలుబొమ్మగా మారారు
– చట్టబద్దంగా వ్యవహరించకపోతే డీఓపీటీని మా డెలిగేషన్ కలుస్తుంది
– డీజీపీ ఐపీఎస్ అధికారిగా పనికిరారని సాక్ష్యాధారాలతో సహా మేం నిరూపిస్తాం
– ‘ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా’’ అన్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్టు చేసి బైండోవర్ చేయాలి
– టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
‘‘ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా’’ అన్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్టు చేసి బైండోవర్ చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడిన మాటలు …
డీజీపీ రాజేంద్రనాధరెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటినుండి ఆయన వ్యవహారశైలి నానాటికి దిగజారుతోంది
డీజీపీ రాజేంద్రనాధరెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటినుండి ఆయన వ్యవహారశైలి నానాటికి దిగజారుతోంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజేంద్రనాధరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనిగా మారింది. టీడీపీ నాయకులు, రాజేంద్రనాధరెడ్డి అపాయింట్ మెంట్ కోరితే ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇవ్వలేదు.
మహిళా నాయకురాళ్లు వారి ఇబ్బందులు చెప్పుకోవాలనుకున్నా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. వైసీపీ నాయకులు అపాయింట్ మెంట్ కోరితే గేటు వద్దకొచ్చి సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్తారు, అదే టీడీపీ నాయకులు అపాయింట్ మెంట్ కోరితే మొండిచేయి చూపుతారు. సభ్యతా, సంస్కారాలు లేని వ్యూహం సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అపాయింట్ మెంట్ అడిగితే డీజీపీ బయటికొచ్చి మరీ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ల కు దున్నపోతు తలలు పెట్టి పోస్టర్ రిలీజ్ చేసిన వ్యక్తికి సాదర గౌరవమిస్తారా? ఇదెక్కడి న్యాయం? ప్రతిపక్ష నాయకులకు మీ ఆఫీసులో ప్రవేశం లేదా? వైసీపీ సభ్యత్వం ఉంటేనే రానిస్తారా?
డీజీపీకి నైతిక విలువలు ఉంటే వెంటనే రాంగోపాల్ వర్మను అరెస్టు చేయాలి. కడుపు మండి కామెంట్ చేసిన యువకుడిని కాకుండా పొగరుతో కుల, మతాల మధ్య వైషమ్యాలు పెంచాలని పోస్టర్ రిలీజ్ చేసిన రాంగోపాల్ వర్మని అరెస్టు చేయాలి. అరాచకాలను సృష్టిస్తూ, శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యూహం సినిమా ను విడుదల కానీయకుండా చూడాలి. డీజీపీ వెంటనే సెంట్రల్ సెన్సార్ బోర్డు కు లేఖ రాయాలి. డీజీపీగా రాజేంద్రనాధరెడ్డి ఏకపక్ష వైఖరిని డీవోపీటీ దృష్టికి తీసుకెళ్తాం.
డీజీపీ సరైన పోలీసు అధికారి అయితే వ్యూహం సినిమాను రిలీజ్ కాకుండా గట్టిగా పోరాడాలి. తాడిపత్రి ఎమ్మెల్యే ‘‘ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా’’ అనడం చట్టాలను శాసించేలా ఉంది, అతన్ని వెంటనే అరెస్టు చేసి, బైండోవర్ చేయాలి. ఇకనైనా డీజీపీ బాధ్యతాయుతంగా నడుచుకుంటూ, చట్టబద్ధంగా వ్యవహరిస్తూ.. సమధర్మం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సిన అవసరముంది.
తప్పు చేసినవారిని శిక్షించాలి, మంచివారిని రక్షించాలి కానీ డీజీపీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు
తప్పు చేసినవారిని శిక్షించాలి, మంచివారిని రక్షించాలి కానీ డీజీపీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సివున్నా ఆ విద్యుక్త ధర్మాన్ని మరచిపోయారు. రాజేంద్రనాధరెడ్డి ఆయన విధులను విస్మరించి అందుకు భిన్నంగా వెళ్తున్నారు.
డీజీపీకి అలంకార ప్రాయమైన అత్యున్నత స్థానాన్ని జగన్ ఇచ్చారని, తాను బతికున్నంత కాలం నీ బాంచన్ దొర అంటూ జగన్ కు విశ్వాసపాత్రుడిగా ఉండాలనుకుంటున్నాడు. ముఖ్యమంత్రే డీజీపీని ఎంపిక చేసుకుంటారు, అంతమాత్రాన డీజీపీ సీఎం అడుగులకు మడుగులొత్తాల్సిన అవసరం లేదు. ధర్మాన్ని పాటించాలి, చట్టాన్ని పరిరక్షించాలి. ఆపన్నులను కాపాడాలి, దుర్మార్గులను శిక్షించాలని మరచి వైసీపీని కాపాడటం కోసం, మిగతా పార్టీలను తన్ని తరిమేయాలని ఉన్నారు. ఇది ధర్మమా?
డిజిపీగా ప్రమాణం చేసినదానికి చేస్తున్నదానికి సంబంధం లేదు
డీజీపీ ఐపీఎస్ గా చేసిన ప్రమాణానికి చేస్తున్న పనికి ఏమైనా సంబంధం ఉందా? టీడీపీ ప్రతిపక్ష పార్టీ. రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది. ఒక ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రత్యర్థ పార్టీలపై ఇనుప పాదం మోపాలని చూస్తున్నారు. అలాంటప్పుడు ప్రత్యర్థ పార్టీలకు రక్షణగా, అండగా ఉండాలి. కనీసం వారి వినతులు తీసుకోవాలన్న బాధ్యతను కూడా విస్మరించారు. టీడీపీ నేషనల్ జనరల్ సెక్రటరిగా, పొలిట్ బ్యూరో సభ్యులుగా రాష్ట్రంలో పాలన చాలా దుర్మార్గం జరుగుతోంది, మీతో చెప్పుకోవాలి, మీ అపాయింట్ మెంట్ ఇవ్వండని అడిగాను. ఇవ్వలేదు.
దుర్మార్గంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి దాసోహమయ్యారు
వైసీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ, అధికార పార్టీకి దాసోహం అయ్యారని మీ దృష్టికి తీసుకొని రావాలనే ఉద్దేశంతో అడిగితే ఒక్క ప్రతిపక్ష నాయకుడికి కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. మీరున్నది వైసీపీ నాయకులను నెత్తిన పెట్టుకోవడానికేనా? అధికార పార్టీకి జీ హుజూర్ అని పనిచేస్తున్నారు. వైసీపీకి పనిచేయడానికేనా మీరున్నది?. ప్రత్యర్థుల బాధలు పట్టించుకోరా? టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడానికి వస్తున్నారంటే కిలో మీటరు దూరంలో బ్యారికేట్స్ పెట్టి ఆపుతారు. టీడీపీ తరపున ఫిర్యాదులను చిన్నా, చితక ఆఫీసర్లకు ఇవ్వమంటారు. మేమిచ్చిన ఫిర్యాదుల్లో ఒక్కదానికైనా చర్యలు తీసుకున్నారా?
ఎందుకిలా వన్ సైడ్ గా వ్యవహరిస్తారు?
డీజీపీ ఎందుకిలా వన్ సైడ్ గా వ్యవహరిస్తారు? దేశ విదేశీయుల ప్రశంసలు అందుకున్న వ్యక్తి చంద్రబాబు ముఖానికి దున్నపోతు ఫోటో పెట్టారు. ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్, లక్షలాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఆయన కు దున్న పోతు ఫొటు పెట్టారు. 3,023 కిలో మీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన యువ నాయకుడి ఫొటోకి దున్నపోతు తల పెట్టారు. ఇటువంటి పోస్టర్ రిలీజ్ చేసిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మని సదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మర్యాదలు చేస్తారా? ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఫొటో దిగడం సిగ్గుచేటు. మీకే ఆ పనిచేస్తే మీ కుటుంబ సభ్యులు ఏమంటారు. జగన్ చేతిలో కీలుబొమ్మగా మారారు. వెంటనే అరెస్టు చేయాలి.
డీజీపీ సరైన పోలీసు అధికారి అయితే వ్యూహం సినిమా రిలీజ్ కాకుండా చూడాలి
డీజీపీ సరైన పోలీసు అధికారి అయితే వ్యూహం సినిమా రిలీజ్ కాకుండా తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. డీజీపీకి తాను ఏదైనా చట్టపరంగా చేస్తానని చెప్పే ధైర్యముందా? మా నాయకుల ఫొటోలకు దున్నపోతు ఫోటోలు ఎలా పెడతారు? అలా పెట్టి పోస్టర్ రిలీజ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఓ కుర్రాడు టీవీ ఛానల్ లో కూర్చొని ఏదో కామెంట్ చేస్తే అతన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది అన్యాయం.
కడుపు మండి కామెంట్ చేస్తే ఇంతగా చేయాలా జగన్మోహన్ రెడ్డి బై ఎలక్షన్ లో చంద్రబాబునాయుడుని కాల్చి పడేయండన్నాడు. దానికి దీనికి తేడా ఏమీ లేదు. ఇతను తలకాయ అడిగాడు, అతను కాల్చిపడేయమన్నాడు. రెండిండిలో తేడా ఏమైనా ఉందా? ఇతనిమీద చర్య తీసుకుంటే జగన్ మీద తీసుకోరా? మీరు పోలీసు ఆఫీసరేనా? జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్ గా మారింది.
చట్టబద్దంగా వ్యవహరించకపోతే డీఓపీటీని మా డెలిగేషన్ కలుస్తుంది. డీజీపీ ఐపీఎస్ అధికారిగా పనికిరారని సాక్ష్యాధారాలతో సహా మేం నిరూపిస్తాం. వ్యూహం సినిమా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది కనుక ఈ సినిమా విడుదల కాకుండా చూసే బాధ్యత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ భుజ స్కందాలపై ఉందని డీజీపీ గుర్తించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వివరించారు.