ఇప్పటిదా..అప్పటిదా..
నీ కోసం నా కోసం
ముందే ఆలోచించి
యుగాలకు మునుపే
ఉద్భవించిన ధన్వంతరి..
అలా దశావతారాలకు
మునుపే తొలి అవతారమెత్తిన హరి!
ఆరోగ్యమే మహాభాగ్యం..
ఈ సూత్రానికి జీవం పోస్తూ
సృష్టిలో ఆది వైద్యుడిగా
రూపు దాల్చిన ధన్వంతరి..
అప్పటికీ..ఇప్పటికీ..ఎప్పటికీ
రోగాలకు వైరి…!
వైద్యో నారాయణో హరి..
ధన్వంతరి పేరు చెబితేనే
వ్యాధులు హరీ..
అలా వరమిచ్చెను మురారి..
సర్వరోగాలను హరియించే
భాస్కరుని శిష్యుడై..
బ్రహ్మాదులే ధన్వంతరి అని
నామకరణం చేయగా
ఇలను చేరిన
మొదటి వైద్యుడు..
శస్త్రచికిత్సలకూ ఆద్యుడు!
ధనుశల్యం..తస్యంతం
సారం ఇయర్తి
గచ్చతీతి ధన్వంతరి..
మనసుకు..శరీరానికి
బాధ కలిగించే శల్యాలను..
వికృతులు..అఘాతాలను
నివారించే శక్తిసంపన్నుడు
ఈ ధన్వంతరుడు..!
ఇది వ్యుత్పత్తి..లోకోక్తి..
అనేక సందేహాలకు నివృత్తి..!!
క్షీరసాగర మథనం జరుగుతున్న శుభవేళ..
కామధేనువు..ఉచ్చశ్రైవం..
ఐరావతం..పారిజాతం..
ఇన్ని అద్భుతాలు..
అనంతరం ముకుందప్రియ..
మహాద్భుత ఉద్భవం
తదుపరి..
అసురులు అక్షింతలు చేసుకుని వీక్షిస్తుండగా..
అసలే మూతపడని
రెప్పలను మరింతగా
తెరచి చూస్తుండగా..
పీనాయుత బాహుదండ
యుగళుడై..
కంబుకంటుడై..
పద్మారుణ లోచనుడై..
విశాల వక్షస్థలుడై..
సుస్నిగ్ధ కేశజాలంతో..
నీలగాత్ర తేజుడై..
పీతాంబరం..మణికుండల
సమాభాసితుడై..
అమృతకలశంతో
అరుదెంచినాడు ధన్వంతరి..
లోకకళ్యాణం కోరి..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286