Suryaa.co.in

Telangana

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ రద్దు

– రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే కొంటుంది
– చట్టపరంగా రైతు కమిషన్‌
– ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం
– రేవంత్‌రెడ్డి టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులు, సామాన్య ప్రజలను ఇబ్బందిపెడుతున్న ధరణి పోర్టల్‌ను రద్దుచేస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. వరంగల్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్‌ను తూచ తప్పకుండా పాటిస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే కొంటుందని హామీ ఇచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి పసుపు రైతులను ఆదుకుంటామని వెల్లడించారు. పంటల బీమా పథకం అమలు చేసి.. పరిహారం వెంటనే అందజేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ రద్దు చేస్తామని ప్రకటించారు. పోడు రైతులకు పట్టాలు ఇస్తామని తెలిపారు. పెండింగ్‌ ప్రాజెక్టులను అన్నింటిని పూర్తి చేస్తామన్నారు. చట్టపరంగా రైతు కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి.. ‘వరంగల్ డిక్లరేషన్‌’ ప్రకటించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ది పనుల గురించి ప్రసంగించారు.

తెలంగాణ అంటే తమకు ఆత్మగౌరవమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుల కుటుంబాలను కేసీఆర్‌ ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. భూమిలేని కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.12వేలు సాయం చేస్తామని చెప్పారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు.

ఈ సందర్భంగారేవంత్ ఇంకా ఏమన్నారంటే… ‘వరికి ప్రస్తుతం మద్దతు ధర రూ.1960 ఉంది. క్వింటాల్‌ వడ్లను రూ.2500కు చొప్పున కొంటాం. పసుపు పంటను క్వింటాల్‌కు రూ.12 వేలకు కొంటాం. మొక్కజొన్న పంటకు క్వింటాల్‌కు రూ.3500 చెల్లిస్తాం. కాంగ్రెస్‌తోనే రైతు సంక్షేమ రాజ్యం సాధ్యం. వరంగల్‌ డిక్లరేషన్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. వరంగల్, ఖమ్మం ప్రాంతాలలో నకిలీ విత్తనాలతో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి.. విత్తనాలు అమ్మే వారి ఆస్తులు జప్తు చేస్తాం. పీడీ యాక్ట్ కింద జైల్లో వేస్తాం. పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి చివరి ఎకరాకు నీళ్లు ఇస్తాం.

రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం. నూతన వ్యవసాయ విధానం.. పంటల విధానం రూపొందిస్తాం. అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర.చెరుకు కర్మాగారాలను తెరిపించి రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తాం.పంటల బీమా ద్వారా ప్రతి రైతుకు నష్టపరిహారం.రైతుకూలీలకు రైతుబీమా.ఉపాధి హామిని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం.దళితులు , గిరిజన లకు ఇచ్చిన అసైన్డ్ భూముల హక్కులు కల్పిస్తాం”

LEAVE A RESPONSE