Suryaa.co.in

Andhra Pradesh

వైఎస్‌ వర్ధంతికి ‘ధర్మాన’ దూరం

శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన అనంతరం శ్రీకాకుళం నియోజక వర్గంలో ధర్మాన ప్రసాదరావు క్యాడర్‌కు దూరంగా ఉండడంపై కొందరు కృష్ణదాస్‌ వద్ద ప్రస్తావించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సైతం మంత్రి పదవిరాకపోవడంతో బంగ్లాకే పరిమితమయ్యారని విమర్శలు ఉన్న విషయం విదితమే. శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా బంగ్లా దాటి బయటకు రావడంలేదని కొందరు కార్యకర్తలు చెబుతున్నారు. అయితే ధర్మాన ప్రసాదరావు పార్టీపై విముఖతతో ఉన్నారని, అందుకే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని కొందరంటున్నారు.

LEAVE A RESPONSE