కర్ణాటకలోని ధర్మస్థలలో హత్యాచారానికి గురైన వందలాది మహిళల మృతదేహాలను ఖననం చేసినట్లు చెబుతున్న మాజీ శానిటరీ వర్కర్ ఫొటో తొలిసారి బయటకు వచ్చింది. అతడు అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించినట్లు గుర్తించిన సిట్ అధికారులు.. ఇవాళ అరెస్టు చేశారు. అతడి పేరు చిన్నయ్య అలియాస్ చెన్నా అని పోలీసులు తెలిపారు. ధర్మస్థల వివరాలు చెప్పినందుకు తనను చంపుతారనే భయంతో మాస్క్ ధరించినట్లు ఇది వరకు అతడు చెప్పాడు.