– కేరళ రాష్ట్ర డీజీపీ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కడప జిల్లా పోరుమామిళ్ల వాసి ధర్మేష్ సాహెబ్
ధర్మేష్ సాహెబ్ IPS పుట్టి పెరిగిన ఊరు పోరుమామిళ్ల. ఆయన తండ్రి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ గ్రామంలోని పంచాయతీ ఆఫీస్ వెనకవైపు ఉన్న బెస్తవీధిలో నివాసం ఉండేవారు.ధర్మేష్ ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు పోరుమామిళ్ల OLF పాఠశాలలో చదివారు. ఆరు నుండి ఇంటర్ వరకు పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో చదువుకున్నారు. డిగ్రీ పీజీ తిరుపతిలో చదివారు.
ఐఏఎస్ సాధించాలని పట్టుదలతో ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ రాశారు. మొదటిసారి ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ కాగా దాన్ని వదులుకొని మరోసారి ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యారు. ఈసారి ఐపీఎస్ కేరళ క్యాడర్ గా సెలెక్ట్ కావడంతో కేరళ రాష్ట్రంలో తన ఉద్యోగాన్ని మొదలు పెట్టారు. జిల్లా ఎస్పీ గా బాధ్యతలు చేపట్టి నేడు కేరళ రాష్ట్రానికి D G P గా బాధ్యతలు చేపట్టారు. పోరుమామిళ్లలోని బంధువులు, స్నేహితులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు చేసుకుంటున్నారు.