-అందుకేనా పేదల ఇళ్లు సమాధులంటూ కూతలు
-చంద్రబాబుకు రక్త పరీక్ష చేయించాలి
-నీళ్లు తాగి మాట్లాడాడా? లేక అయ్యన్న గంజాయి తీసుకున్నాడా?
-ఆయన మాటలు వింటుంటే అనుమానం వస్తోంది
-బాబూ.. ఏమిటా గతి, మతి లేని మాటలు
-నిరుపేదలకు ఒక్క ఇంటి స్థలం అయినా ఇచ్చావా?
-టీడీపీ పాలనలో సెంట్ భూమి అయినా పంచావా?
-దమ్ము, ధైర్యం ఉంటే మీడియా ముందు పెట్టు..అన్నీ చర్చిద్దాం
-పెత్తందార్లకు కొమ్ము కాస్తున్న చంద్రబాబు
-అమరావతిలో ఇళ్ల పట్టాలు అడ్డుకునే ప్రయత్నం
-కోట్లు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు
-అయితే అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయ వేసింది
-జగన్ నిరుపేదల వర్గం. వారి పక్షపాతి
-పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు. 22 లక్షల ఇళ్ల నిర్మాణం
-అలా కోటి మందికి ఆవాసం కల్పిస్తున్న సీఎం
-అందుకే నిరుపేదల గుండెల్లో జగన్
-ఎవరు ఎలా జత కట్టి వచ్చినా, వారికి ఓటమి తప్పదు
-2024 ఎన్నికల్లో జగన్‌దే విజయం. ఇది తథ్యం
ప్రెస్‌మీట్‌లో మంత్రి జోగి రమేష్ స్పష్టీకరణ
వైజాగ్‌లో ఏం తాగావు బాబూ?:
నిన్న విశాఖపట్నంలో చంద్రబాబు మాటలు వింటుంటే, ఆయన మంచినీళ్లు తాగి మాట్లాడాడా? లేక అయ్యన్నపాత్రుడు ఇచ్చిన గంజాయి తాగి మాట్లాడాడా? అనిపించింది. చంద్రబాబుకు రక్త పరీక్ష చేయించాలి. ఏ మాత్రం సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నాడు. తాను పేదలకు 3 సెంట్ల చొప్పున భూమి ఇచ్చినట్లు చెబుతున్నాడు. నిజానికి 30 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇళ్ల పట్టాల ఇచ్చే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించాం.
సమాధి కట్టుకోవాలా?:
అయితే ఆ స్థలం ఇంటికి సరిపోతుందా? అక్కడ సమాధి కట్టుకోవాలా? అని చంద్రబాబు అంటున్నారు. ఇక్కడ ఒక విషయం ఆయన గమనించాలి.
30 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం, 17,005 జగనన్న కాలనీల్లో వేగంగా జరుగుతోంది. కోటి మంది నివాసం ఉండే ఆవాసాలను సమాధులు అని బాబు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు.
2024లో బాబుకు రాజకీయ సమాధి:
1995 నుంచి 2019 వరకు 24 ఏళ్లలో.. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు.. నీ హయాంలో 2014 నుంచి 2019 వరకు, నిరుపేదలకు ఒక్క సెంట్ భూమి అయినా ఇచ్చావా? అయినా సిగ్గు లేకుండా అబద్ధం ఆడుతున్నావు. మేము నిరుపేదలకు ఇచ్చిన స్థలం సమాథికి కూడా సరిపోదని ఎలా అంటున్నావు? 30 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అంటే దాదాపు కోటి మందికి ప్రయోజనం కలిగింది. వారంతా కలిసి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని నిట్ట నిలువునా సమాధి చేయబోతున్నారు.
బాబూ నీకెంత కండ కావరం:
చంద్రబాబు నీకెంత కండ కావరం?. నీది ఒక అగ్ర కుల దురహంకారమా? లేక పేదలంటే నీకు అంత నీచ భావమా? మురికివాడల్లో ఎవరు జీవిస్తారు? అన్నావు. ఇంకా ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా? అన్నావు. ఇంకా బీసీల తోకలు కట్ చేస్తానన్నావు. అంటే, నీకు కేవలం వారి ఓట్లు మాత్రమే కావాలా? ఆ వర్గాల ప్రయోజనాు అవసరం లేదా? అసలు మా వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇస్తే నీకెందుకంత కడుపు మంట? నీ హయాంలో ఎలాగూ ఇవ్వలేదు. ఇళ్ల పట్టాలతో పాటు, ఇళ్ల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుంటే, ఎందుకంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నావు?
అక్కడ నిరుపేదలు ఉండకూడదా?:
అమరావతిలో పేదలు ఉండకూడదా? వారు అక్కడ నివసించే అర్హత లేదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్న చంద్రబాబు, గతి తప్పి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. ఏం మేము అక్కడ అమరావతిలో ఉండకూడదా? ఎంత దారుణం? నిరుపేదలు అమరావతిలో ఉండేలా, వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకుంటే, దాన్ని ఆపడానికి చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్తారా? పేదల పక్షాన నిలబడిన జగన్‌కి, చివరకు అత్యున్నత న్యాయస్థానం కూడా మద్దతు తెలిపింది. ఎందుకంటే జగన్ మనస్సు మంచిది. ఆయన చర్యలు నిరుపేదలకు ఎంతో మేలు చేస్తున్నాయి.
ఓటమి ఒప్పుకున్నారుగా:
నిరుపేదలకు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా, అడ్డుకునేందుకు కోట్లు ఖర్చు పెట్టి, అడ్డుకోవాలని చూసిన చంద్రబాబును, ఆయన పార్టీని పేదలంతా కలిసి పాతరేస్తారు. పేదలంతా జగన్ పక్షాన నిలబడ్డారు. అందుకే జగన్ ని ఒంటరిగా ఎదుర్కునే దమ్ము, ధైర్యం తమకు లేదని చంద్రబాబు చెబుతున్నాడు. తాను చేతకాని చవట, సన్నాసి అని అంటున్నాడు. అలాంటి నీవా.. జగన్‌ని ఒంటరిగా ఎదుర్కోలేక పొత్తుల కోసం పొర్లాడుతున్నావు. సీఎం పదవి కోసం అన్ని పొత్తులకు సిద్ధం అవుతున్నావు. మరోవైపు, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కూడా చెబుతున్నాడు. తనకు చేతకాదని, సన్నాసిని అని, తాను సీఎం పదవికి అర్హుడిని కాదని, తాను పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసం అంటున్నాడు.
మరి ఎవరు గెల్చినట్లు?:
అంటే ఎవరు గెల్చినట్లు?. ఒకవైపు చంద్రబాబు ఏమంటున్నాడు? తాను ఒంటరిగా జగన్‌గారికి ఎదుర్కోలేను అంటున్నాడు. మరోవైపు పవన్ తాను సీఎం పదవికి అనర్హుడిని, చంద్రబాబు కోసమే పని చేస్తున్నానని అంటున్నాడు. అంటే ఇద్దరూ ముందే ఓడిపోయినట్లు కదా? అందుకే ఎవరు, ఎన్ని పొత్తులతో వచ్చినా, ఎందరిని కట్టకట్టుకుని వచ్చినా, ప్రజలు భూస్థాపితం చేస్తారు. అందుకు వారు సిద్ధంగా ఉన్నారు. 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు, ఇళ్లు కట్టించి ఇస్తున్న సీఎం వైయస్ జగన్, అలా కోటి మందికి గూడు కల్పిస్తున్నారు.
బాబూ నీవే ఒక సైకో:
జగన్‌ని ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్న చంద్రబాబు.. నిజానికి ఒక సైకో. ఆయనే సైకో. ఆయన భాష గతి తప్పింది. దాన్ని సభ్య సమాజమంతా చూస్తోంది. 75 ఏళ్లు దాటాయి. ఈ వయసులో ఆ మాటలు ఏమిటని అందరూ అనుకుంటున్నారు. చెవిలో మైక్ పెట్టుకుని, కేకలు. రంకెలు. చూస్తుంటే ఒక సైకో మాదిరిగా తయారయ్యాడు. అందుకే ఒక సైకో మాదిరిగా ఎంత ఎగిరినా, మాట్లాడినా.. మరోవైపు నీ కొడుకు ఎలా వచ్చినా.. అందరినీ కట్ట కట్టుకుని ప్రజలు ఓడిస్తారు. మళ్లీ జగన్ సీఎం అవుతారు. మా పార్టీనే 2024లో ఘన విజయం సాధిస్తుంది. చివరకు కుప్పంలో కూడా మాదే విజయం.
ఈ విషయం గుర్తుంచుకో:
ఒక విషయం గుర్తు పెట్టుకో చంద్రబాబు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, నిన్ను ప్రజలు రాజకీయ సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేశంలో ఏ సీఎం అయినా.. నిరుపేదలకు రూ.2 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని నేరుగా ఇచ్చారా? వారి ఖాతాల్లో జమ చేశారా? జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఆయన వెంటే ఉన్నారు. అందుకే మీరు ఎన్ని వేషాలు వేసినా, చౌకబారుగా వ్యవహరించినా, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మబోరు.
దాన్ని మీడియా ముందు పెట్టగలవా?:
చంద్రబాబుకు మరో సవాల్. నీవు 2014 నుంచి 2019 వరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చానంటున్నావు కదా? నీకు నిజంగా దమ్ము ఉంటే, నీ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల వివరాలు చెప్పు. మీడియా ముందు ఉంచు. చర్చిద్దాం. నీ గత 5 ఏళ్ల పాలనలో ఒక్కరికి కూడా ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదు. ఇది వాస్తవం. అదే మేము ఒక యజ్ఞంలా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. మీకు ధైర్యం ఉంటే రండి. ఎక్కడైనా చూపిస్తాం.
మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
పేదలు–పెత్తందార్ల మధ్య యుద్ధం:
ధనికులు, పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఉంటే, పేదల పక్షాన జగన్ ఉన్నారు. ఈ యుద్ధంలో జగన్‌దే విజయం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపులంతా జగన్‌వెంట నడుస్తారు. ఇది పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం. జగన్ ప్రజల పక్షాన ఉన్నారు. వారి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. అందుకే ఆయనదే మళ్లీ విజయం.
బాబుకు ఎవరైనా ఓటేస్తారా?:
చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీని మోకులు, తాళ్లు, బుల్డోజర్లు పెట్టి లాగే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు బహిరంగ సభలకు జనం రావడం లేదు. ఆయనను చూడడానికి ఎవరొస్తారు? ఆయనకు ఎవరు ఓటేస్తారు? చంద్రబాబు నైజం తెలిసిన ఎవరైనా చంద్రబాబుకు ఓటేస్తారా? తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది.
175 చోట్ల బీ–ఫామ్స్ ఇస్తారా?:
తాము ఒంటరిగా జగన్‌ని ఎదుర్కోలేనని చంద్రబాబు స్వయంగా చెబుతుంటే, అంతకన్నా ఏం కావాలి? మొత్తం నియోజకవర్గాల్లో మా పార్టీని ఓడిస్తామని చచ్చు దద్దమ్మ కబుర్లు చెబుతున్న చంద్రబాబును ఒకటే సూటిగా అడుగుతున్నాం. మొత్తం 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా? అన్ని చోట్లా మీ పార్టీ గుర్తు మీద బి–ఫామ్ ఇచ్చే దమ్ము, ధైర్యం ఉందా? 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదు. ఆయన పొత్తులకు పోవాల్సిందే.
‘పాపం పిచ్చోడు’ ట్యాగ్ బెటర్:
నిన్న మొన్న పవన్‌కళ్యాణ్ ట్వీట్ చూశాను. పాపం పసివాడు అన్న ట్యాగ్‌లైన్. దాన్ని కొంచెం మార్చాలి. ‘పాపం పిచ్చోడు’ అని మార్చాలి. ఎందుకంటే చాలా మంది పవన్ సీఎం అవుతాడని, ఏదో ఒరగబెడతాడని అనుకుంటే.. తానేమో తాను సీఎం పదవికి అనర్హుడిని అని, తాను ఎమ్మెల్యే అయితే చాలని అనుకుంటున్నాడు. అందుకే ట్యాగ్‌లైన్‌ను ‘పాపం పిచ్చోడు’ గా మార్చాలి. ఆ టైటిల్‌తో సినిమా తీసినా బాగానే ఉంటుందని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు.