పది రూపాయలు ఇచ్చి రూ.100లు లాక్కుంటున్నాడు

– జగన్ ది పేదల ప్రభుత్వం కాదు.. పేదలను దోచే ప్రభుత్వం
– జిల్లాకు నెలకు 25 వేల కోట్లు 13 జిల్లాలు కలిపి 320 కోట్లు తాడేపల్లి కొంపకు
– రాష్ట్రంలో రూ.40 వేల కోట్ల భూదోపిడి జరిగింది.
– ఇసుక మాఫియా ప్రతి సంవత్సరం పదివేల కోట్లు .
– రేషన్ బియ్యం రీసైకిలింగ్ జరుగుతోంది. దీని వల్ల 7,000 కోట్లు, ఎర్రచందనం మాఫియాతో రు 7 వేల కోట్లు,లేపాక్షి హబ్ కింద కోట్లాది రూపాయలు తాడేపల్లి కొంపకు
– ఎంపీ రఘురామకృష్ణంరాజుని పోలీసులు తీసుకెళ్లి రాత్రంతా కొట్టారు. వీడియోలు తీసి ముఖ్యమంత్రికి చూపారు. ముఖ్యమంత్రి ఆనందపడ్డాడు.
– టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా కరెంటు రేట్లు పెంచలేదు.
– కరెంటు రేట్లు పెంచకుండా మిగులు కరెంటును సాధించాం
– ముఖ్యమంత్రి ప్రజల రక్తాన్ని తాగుతున్నాడు
– సాక్షి పక్షి సజ్జలకు రాజకీయం అంటే తెలియదు
– తోక జాడిస్తే కట్ చేస్తా
-పెళ్లి కానుక ఏమైంది? సంక్రాంతి కానుక ఏమైంది?
వివేకా హంతకులను కాపాడటానికి నానా యాతన పడుతున్నాడు.
– విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు ప్రసంగం ఆయన మాటల్లోనే …
నేను ఎక్కడికి వెళ్లినా అన్ని వర్గాల ప్రజలు ఎనలేని ఆదరాభిమానాలు చూపుతున్నారు.వారి ఆదరాభిమానాలు మరువలేనివి. టీడీపీకి మద్దతుగా యువత ముందుకు రావడం సంతోషదాయకం. యువత అంతా కలిసి పేటీఎం తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. జగన్ లాంటి సైకోలను అణచివేయాలి. జగన్ అధికారంలోకి వచ్చాక ఇంటి పన్ను పెరిగిందా లేదా? రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగాయా లేదా? బటన్లు నొక్కడంవలన ప్రయోజనం లేదు . జగన్ నొక్కేది బటన్ నొక్కుడు కాదు బటన్ బొక్కుడు.
పది రూపాయలు ఇచ్చి రూ.100లు లాక్కుంటున్నాడు.జగన్ ది పేదల ప్రభుత్వం కాదు.. పేదలను దోచే ప్రభుత్వం, ఈ విషయాన్ని ఆడబిడ్డలు ఆలోచించాలి. ఆడవాళ్లు వంటగదిలోకి వెళితే సైకో ముఖ్యమంత్రి గుర్తుకొస్తాడు. ఒకప్పుడు ఉల్లిపాయలు కట్ చేస్తే కళ్ళల్లో నీరు వచ్చేవి. నేడు వంటగదిలోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ను చూసినా.. నిత్యావసర వస్తువులు చూసినా కళ్ళ నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. అందుకే నేను బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రారంభించాను.

మీలో చైతన్యం రావాలి. బుద్ధిలేని ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. సిగ్గు లేకుండా బాదుడే బాదుడు బాదుతున్నాడు. కరెంటు రేట్లు పెంచాడు.ఇది మోయలేని భారం. 2014 లో కరెంటు కొరత ఉండగా, అధిగమించి మిగులు కరెంటు సాధించాం. టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా కరెంటు రేట్లు పెంచలేదు. కరెంటు రేట్లు పెంచకుండా మిగులు కరెంటును సాధించాం. సమర్థవంతమైన పాలనను ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది.ప్రస్తుతం ఎక్కడ చూసినా అవినీతి ఉంది. ఈ ప్రభుత్వంలో దోపిడీ తప్ప ఇంకొకటి లేదు. ఒకపక్క అసమర్థత మరో పక్క అవినీతి. ఇది పేదవారి పట్ల శాపంగా మారింది. ఇది సెంట్రలైజ్డ్ కరప్షన్. బ్రాందీ బాబుల పైన కన్నేసి వారిని దోచుకుంటున్నాడు.రాష్ట్రంలో కేంద్రీకృతమైన అవినీతి జరుగుతోంది. దీనికి నాయకుడు జగన్మోహన్ రెడ్డి.

ఒకప్పుడు 60 రూపాయలకు లభించే మద్యం మందు బాటిల్ ఇప్పుడు రూ.200 అయిపోయింది. ప్రస్తుతం బూమ్ బూమ్, జే బ్రాండ్లు, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్. అన్ని బ్రాండ్లు జగన్ వే. ఏ షాపులో గాని ఫోన్ పే, గూగుల్ పే, పేటియం లు లేవు. కిరాణా కొట్లు, తోపుడు బండ్లు అన్నింటిలో గూగుల్ పే, ఫోన్ పే లు ఉన్నాయి. మద్యం షాపుల్లో మాత్రం లేకపోవడం ఏమిటి? ఇది చిదంబర రహస్యం. మీరు కట్టే డబ్బుల్లో వాటా తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతోంది. ముఖ్యమంత్రి ప్రజల రక్తాన్ని తాగుతున్నాడు. మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరం లేదు. వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నాడు. ఇదే సెంట్రలైజ్డ్ కరప్షన్ .

ఉచిత ఇసుక రద్దు చేసి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారు. ఇసుక దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టిడిపి హయాంలో ఇసుక బాగా దొరికేది. ప్రస్తుతం లారీ ఇసుక రూ.70,000 పలుకుతోంది.జిల్లాకు నెలకు 25 వేల కోట్లు 13 జిల్లాలు కలిపి 320 కోట్లు తాడేపల్లి కొంపకు పోతోంది.ఇది సెంట్రలైజ్డ్ కరప్షన్ అవునా? కాదా? గ్రానైట్, ఇసుక, పొలాలలోని మట్టి, లాటరైట్ అన్ని ఖనిజ సంపదల మీద జగన్ బృందం పెత్తనం చెలాయిస్తోంది. ఒకప్పుడు సీనరేజ్ కట్టి ఎక్కడికక్కడ తీసుకుపోయేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఈ ముఖ్యమంత్రి సెంట్రలైజ్డ్ కరప్షన్ కు శ్రీకారం చుట్టారు. చెక్ పోస్టులు పెట్టారు. పొలం నుంచి మీ ఇంటికి మట్టి రావాలంటే డబ్బు కట్టాల్సిందే. పొలం నీది, మట్టి నీది వాటిపై ముఖ్యమంత్రి పెత్తనం ఏంటి?

వైసీపీ మాఫియా పెట్రేగిపోతోంది అవినీతి, అసమర్థ ప్రభుత్వం ఇది. మీరంతా బలైపోతున్నారు. దోచుకునేది జగన్.. సైకో ముఖ్యమంత్రి తప్ప మరెవరో కాదు. నా మీటింగులకు ప్రజలు తండోపతండాలుగా ప్రజలువస్తున్నారు. సంఘీభావాన్ని తెలుపుతున్నారు. ఈ ముఖ్యమంత్రికి కళ్ళు కుట్టి జీవో నెంబర్ వన్ తెచ్చాడు. 45 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను.. రోడ్ షోలు పెట్టాం, రోడ్డులోనే మీటింగులు పెట్టాం, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశాం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని తీసుకొచ్చాం. అలాంటిది జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూశాడు. కోర్టు మొట్టికాయలు వేసింది. ఈ సైకో ముఖ్యమంత్రికి భయపడకూడదు.మీటింగులు పెట్టడం మానేయకూడదు. సాక్షి పక్షి సజ్జల, సజ్జలకు రాజకీయం అంటే తెలియదు.. అటువంటి వ్యక్తి కారుకూతలు కూస్తుంటాడు. ఎమ్మెల్యే కాలేదు అలాంటివాడు ఉపన్యాసాలు ఇస్తున్నాడు, తోక జాడిస్తే కట్ చేస్తా. జాగ్రత్త.. ప్రజాస్వామ్యం అంటే తమాషా కాదు.

సైకోలు బెదిరిస్తే పారిపోకూడదు. సైకోలకు వింత ప్రవర్తన ఉంటుంది.. మనల్ని బెదిరిస్తారు. మనం బాధపడితే ఆనందపడతారు. అలాంటి సైకోలకు బుద్ధి చెబుదాం. ఎంపీ రఘురామకృష్ణంరాజుని పోలీసులు తీసుకెళ్లి రాత్రంతా కొట్టారు. వీడియోలు తీసి ముఖ్యమంత్రికి చూపారు. ముఖ్యమంత్రి ఆనందపడ్డాడు.డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే పిచ్చోడిని చేసి చంపారు.. ఇది న్యాయమా?నేను ఇంట్లో ఉండి బాడుగ కడుతుంటే అర్థం పర్థం లేకుండా నోటీసులు పంపారు. ఇలాంటి సైకోలను అణిచివేయాలి.బెదిరిస్తే భయపడడానికి నేను సామాన్యుడిని కాదు. నా ధైర్యమే ప్రజలు .నేను మాట్లాడేది ప్రజల కోసం. కబడ్దార్ గుర్తుపెట్టుకోండి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూముల్ని అమ్మాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. ప్రయత్నాలు చేసి చివరకు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా వ్యవహరించాడు.

ఒకే ప్రాంతంలో వెయ్యి ఎకరాలు సేకరించి మనిషికి సెంటు ఇస్తాడట. పేదవారికి 5 పర్సెంట్ జాగా ఇవ్వాలి.సంక్షేమ పథకాలకు నాంది తెలుగుదేశం.రెండు రూపాయలకు కేజీ బియ్యం, పక్కా ఇళ్ల నిర్మాణం, అన్నా క్యాంటీన్ లు, విదేశీ విద్య ఏమైంది? చంద్రన్న బీమా ఏమైంది పెళ్లి కానుక ఏమైంది? సంక్రాంతి కానుక ఏమైంది?వందల సంక్షేమ కార్యక్రమాల్ని రద్దు చేశారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పట్టణాల్లో ఒక్కొక్కరికి రెండు సెంట్లు భూమి ఇచ్చింది. ప్రస్తుతం జగన్ ఒక సెంటు ఇస్తానంటున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇచ్చాం. జగన్ ఇచ్చేది ఒక సెంటు భూమి. ఇల్లు కట్టుకోవాలంటే కనీసం మూడు సెంట్లు భూమి అవసరం.

ఇచ్చే ఒక సెంటు సమాధికి సరిపోతుంది. పేదవాడి మీద ప్రేమ ఉంటే మూడు సెంట్లు ఇవ్వాలి. రాష్ట్రంలో రూ.40 వేల కోట్ల భూదోపిడి జరిగింది. ఇసుక మాఫియా ప్రతి సంవత్సరం పదివేల కోట్లు . రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు అధికమయ్యాయి.గంజాయి అమ్మకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పేదల జీవితాలను నాశనం చేశాడు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదుగానీ గంజాయి మాత్రం ఫుల్ గా ఇస్తున్నాడు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియా పెట్రేగిపోతోంది.సిమెంటు మాఫియా తో రూ.12 వేల కోట్లు దోచుకున్నారు.
సెంటు పట్టా పేరుతో 7వేల కోట్లు కొట్టేశాడు.

రేషన్ బియ్యం రీసైకిలింగ్ జరుగుతోంది. దీని వల్ల 7,000 కోట్లు, ఎర్రచందనం మాఫియాతో రు 7 వేల కోట్లు,లేపాక్షి హబ్ కింద కోట్లాది రూపాయలు తాడేపల్లి కొంపకు చేరుతోంది.సెటిల్మెంట్లు చేయడంలో జగన్ దిట్ట. ప్రతి స్కీము ఒక స్కాం. సెటిల్మెంట్లలో నెంబర్ వన్.. సేవల్లో మాత్రం లాస్ట్. జగన్ కి పేదవాడు అంటే పడదు. పేదవారితో వెటకారం చేస్తాడు ఆయన వేసుకునే చెప్పులు, తాగే నీళ్లు, వేసుకొనే చొక్కా చాలా ఖరీదైనవి.

దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే ధనవంతుడు జగన్. రు. 508 కోట్ల రూపాయల ఆస్తులు అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. జగన్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వం. వివేకా హంతకులను కాపాడటానికి నానా యాతన పడుతున్నాడు.

Leave a Reply