-ఒక్క పంట చేనులో అడుగు పెట్టాడా?
-పశువులకు ఉచిత బీమా కింద రూ.200 కోట్లు ఇంత వరకు ఇవ్వలేదు
-రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానం
-మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
4 ఏళ్లుగా వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టివేయబడింది. రైతన్నలు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. వ్యవసాయంలో ఖర్చు, పెట్టుబడులు పెరిగింది. పొలాల్లో పారాల్సిన నీరు సముద్రంలోకి పోతుంది.పంటను కొనే వాడు లేక రైతులు ధైయనీయమైన జీవితాన్ని గడుపుతున్నారు.
అకాల వర్షాల వలన ధాన్యం చెడిపోతే పట్టించుకోలేదు. ఇంత వరకు పంట నష్టపోయిన ఒక్క రైతును జగన్ రెడ్డి పలకరించాడా? ఒక్క పంట చేనులో అడుగు పెట్టాడా? పత్రికా ప్రకటనల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు కాని రైతనన్ను ఆదుకోవడానికి చేతులు రావడం లేదు.
చంద్రన్న హయాంలో జలవనరులకు రూ.68వేల కోట్లు ఖర్చు పెడితే జగన్ రెడ్డి రూ. 25వేల కోట్లే ఖర్చు పెట్టారు. పోలవరంపై చంద్రబాబు అలుపెరుగని కృషి చేశారు. పనులు పరుగులు పెట్టించారు. కాని నేడు పోలవరం పనులు పడకేశాయి. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉంది. పశువులకు ఉచిత బీమా కింద రూ.200 కోట్లు ఇంత వరకు ఇవ్వలేదు.