Suryaa.co.in

Andhra Pradesh

నీ ముఖం చూసి రాష్ట్రానికి పెట్టుబడులు రావని అర్థమైందా జగన్ రెడ్డి?

• ప్రపంచప్రఖ్యాత దావోస్ సదస్సులో ఏపీ ప్రాతినిధ్యం ఎందుకు లేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.
• పొరుగురాష్ట్ర మంత్రి కేటీఆర్, దావోస్ లో వేలకోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తుంటే, ఏపీమంత్రి కోడిపందాలు, రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగితేలుతున్నాడు.
• ఏపీ యువత బూమ్ బూమ్ బీర్లు అమ్ముతూ, మాంసం కొట్టుకుంటూ, గంజాయి పీలుస్తూ బతకాలన్నదే జగన్ రెడ్డి ఆలోచనా?
• 4ఏళ్ల పాలనలో రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమలు, ఉపాధి ఉద్యోగాల కల్పనపై జగన్ రెడ్డి తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాం.
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

తన విధ్వంసకరపాలన, అంతులేని అవినీతి, అడ్డూఆపులేని దోపిడీ, అన్నింటికంటే గొప్ప దైన తన ముఖారవిందం చూసి ఏపీకి పరిశ్రమలు రావని, పారిశ్రామికవేత్తలెవరూ పైసా పెట్టు బడి పెట్టరని జగన్ రెడ్డికి అర్థమైందని, అందుకే ప్రపంచప్రఖ్యాత దావోస్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో ఏపీప్రభుత్వం పాల్గొనలేదని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే ..

“చంద్రబాబునాయుడి పాలనలో రాష్ట్రం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా, పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంగా ఉండేది. దావోస్ వేదిక మొదలు, ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల్ని, పెట్టుబడి దారుల్ని ఆకర్షించడానికి చంద్రబాబు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక, పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. చంద్రబాబుహాయాంలో రాష్ట్రప్రభు త్వంతో పారిశ్రామికవేత్తలు చేసుకున్న రూ.16లక్షలకోట్ల పారిశ్రామికఒప్పందాల్ని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చీరాగానే దుర్మార్గంగా రద్దుచేశాడు. జగన్ అహంకారపూరిత నిర్ణయం, ప్రతిపారిశ్రామికవేత్తను ఆలోచించుకునేలా చేసింది. దానిప్రభావమే నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రానికి ఒక్కపరిశ్రమ రాకపోవడం.

టీడీపీప్రభుత్వంలో రూ.5,17,000కోట్ల పెట్టబడులు వచ్చాయన్న మేకపాటి గౌతమ్ రెడ్డి సమాధానంపై జగన్ రెడ్డి ఏం చెబుతాడు?
తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.5,17,000కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, 5లక్షల పైన ఉద్యోగాలు వచ్చాయని వైసీపీప్రభుత్వంలోని మంత్రే శాసనమండలిలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 10-07-2019న నాడు పరిశ్రమలశాఖామంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి, టీడీపీప్రభుత్వంలో ఏ జిల్లాకు ఎలాంటిపరిశ్రమలు వచ్చాయో, ఎన్నిలక్షల ఉద్యోగాలు వచ్చాయో స్పష్టంగా చెప్పారు. టీడీపీప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులే రాలేద నే ముఖ్యమంత్రి, స్వర్గీయ మేకపాటి గారి వ్యాఖ్యలపై ఏం సమాధానం చెబుతాడు?

పొరుగురాష్ట్ర మంత్రి దావోస్ లో పెట్టుబడులు ఆకర్షిస్తుంటే, ఏపీ మంత్రి విశాఖపట్నంలో కోడిపందాలు, రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగితేలుతున్నాడు
జగన్ రెడ్డి నాలుగేళ్లపాలనలో ఒక్కఫ్యాక్టరీ రాలేదు. జగన్ రెడ్డి దెబ్బతో గతప్రభుత్వంతో చేసుకున్న పారిశ్రామికఒప్పందాలను రద్దుచేసుకొని, పారిశ్రామికవేత్తలంతా పొరుగు రాష్ట్రాల కు పారిపోయారు. హార్డ్ వేర్ నుంచి అండర్ వేర్ కంపెనీ వరకు అన్నీ పలాయన బాటలో పయనించాయి. రాష్ట్రానికి పైసా పెట్టుబడి తీసుకురావాలన్న ఆలోచన, పదిమందికి ఉపాధికల్పించాలన్న సద్భుద్ధి జగన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి లేదు. నిన్నటినుంచి దావోస్ లో ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ మొదలైతే రాష్ట్రప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మ కంగా తీసుకోలేదు. దావోస్ వెళ్లిన తెలంగాణ ఐటీమంత్రి కేటీఆర్ వారి రాష్ట్రానికి వేలకోట్ల పెట్టుబడులు రాబడుతున్నాడు. దక్షిణాదిలో పారిశ్రామికవేత్తలకు హైదరాబాదే సురక్షితమని చెబుతూ, వారిని ఆకర్షిస్తున్నాడు. పొరుగురాష్ట్ర మంత్రి అలాచేస్తుంటే, ఈ ముఖ్యమంత్రేమో తాడేపల్లి వదిలి బయటకురాకుండా, సొంతరాష్ట్రంలోని పరిశ్రమల్ని తన్ని తరిమేస్తున్నాడు.

దావోస్ సదస్సులో ఏపీ ప్రాతినిధ్యం ఎందుకులేదో ముఖ్యమంత్రి చెప్పాలి. దేశంలోని అన్నిరాష్ట్రాలు పరిశ్రమల్ని ఆహ్వానించడానికి పడరానిపాట్లు పడుతుంటే, జగన్ రెడ్డికి అస లు వెళ్లాలన్న ఆలోచనే రాకపోవడం సిగ్గుచేటు. అన్నిరాష్ట్రాల పాలకులు దావోస్ వేదికపై తమస్వరాలు వినిపిస్తున్నవేళ, జగన్ రెడ్డి తాడేపల్లిలో చిందులేస్తుంటే, పరిశ్రమలమంత్రి విశాఖపట్నంలో కోడిపందాలు, రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నాడు. సొంత పార్టీవారు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తల్ని కమీషన్లకోసం వేధిస్తుంటే, ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నాడు. ఏపీ యువత బూమ్ బూమ్ బీర్లు అమ్ముకుంటూ, గంజాయి పీలుస్తూ బతకాలన్నదే జగన్ రెడ్డి ఆలోచన. నాలుగేళ్లలో రాష్ట్రానికి వచ్చినపరిశ్రమలు, యువతకు ఇచ్చిన ఉద్యోగాలపై పూర్తివాస్తవాలతో జగన్ రెడ్డి శ్వేతపత్రం విడుదలచేయాలి.

నాలుగేళ్ల తనపాలనలో రాష్ట్రానికి ఏంపరిశ్రమలు తీసుకొచ్చాడో, ఎన్ని ఉద్యోగాలిచ్చాడో జగన్ రెడ్డి శ్వేతపత్రం విడుదలచేయగలడా? అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ సొంత రాష్ట్రానికి గుడ్ బై చెప్పి హైదరాబాద్ కు ఎందుకు వెళ్లిందో ముఖ్యమంత్రి చెప్పాలి. టీడీపీప్రభుత్వంలో రూ.10 లక్షలకోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందంచేసుకున్న పరిశ్రమలన్నీ, జగన్ రెడ్డి బ్లాక్ మెయిల్ దెబ్బతో రాష్ట్రానికి గుడ్ బై చెప్పాయి. రూ.67వేలకోట్ల పెట్టుబడితో ఒప్పందం చేసుకున్న అదానీ డేటా సెంటర్, రూ.50వేల కోట్ల పెట్టుబడి పెడతామన్న సింగపూర్ స్టార్టప్ కంపెనీలు, రూ.28వేలకోట్లు ఇన్వెస్ట్ చేస్తామన్న ఏషియన్ పేపర్ మిల్స్ , రూ.15వేలకోట్ల రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, రూ.9,500కోట్ల అమర్ రాజా బ్యాటరీస్, రూ.2,200కోట్ల లులూ గ్రూప్, రూ.727కోట్ల టైటాన్, రూ.500కోట్ల ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలన్నీ జగన్ రెడ్డి అవినీతిదెబ్బకు రాష్ట్రం విడిచిపోయింది నిజంకాదా? జగన్ రెడ్డి నిర్వాకంతో ఉపాధి, ఉద్యోగా లు లేక రాష్ట్రయువత నిర్వీర్యమైపోతోంది. ఏపీ యువత బూమ్ బూమ్ బీర్లు అమ్ముతూ, మాంసం కొట్టుకుంటూ, గంజాయి పీలుస్తూ బతకాలన్నదే జగన్ రెడ్డి ఆలోచన. నాలుగేళ్ల వినాశకర పాలనతో రాష్ట్రాన్ని, యువశక్తిని నిర్వీర్యంచేసి, ఏపీకి భవిష్యత్ లేకుండా చేసినం దుకు జగన్ రెడ్డి రాష్ట్రయువతకు, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి” అని బొండా ఉమా డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE