యువగళంపై నారా లోకేష్ కు మద్దతు తెలిపిన టీడీపీ నేతలు

Spread the love

– ఉండవల్లిలో లోకేష్ ను కలిసిన పలువురు నేతలు

అమరావతి:-తెలుగు దేశం పార్టీ లో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన పాదయాత్ర సందడి మొదలైంది. పార్టీలోని అన్ని ప్రాంతాల నేతలు లోకేష్ ను కలిసి పాదయాత్రకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో లోకేష్ ను పలువురు టీడీపీ సీనియర్ నేతలు కలిశారు. కుప్పం నుంచి ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే యువగళం పాదయాత్రపై నేతలు చర్చించారు. యువగళం యాత్రకు తమ మద్దతు తెలిపారు.

ఈ రోజు కలిసిన వారిలో మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చిన రాజప్ప, పిఎసి చైర్మన్ పయ్యావుల కేశవ తదితరులు ఉన్నారు. తన పాదయాత్ర వివరాలను లోకేష్ వారిలో పంచుకున్నారు. మద్దతు తెలిపిన నేతలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతల మద్దతు, సహకారంతో…ప్రజల్లో చైతన్యం తెచ్చేవిధంగా యువగళం పాదయాత్ర నిర్వహిస్తానని లోకేష్ వారికి తెలిపారు.

Leave a Reply