– తెలంగాణ లక్ష్యాలను నెరవేర్చకుండా అడ్డుగా ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేసి రాష్ట్ర లక్ష్యాలు, ఆశలు, ఆకాంక్షలు సాధించుకుందాం.
– తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కోసం కాంగ్రెస్తో చేయి చేయి కలిపి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నడవాలని పిలుపు
– ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరం
– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
– ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ లో కార్నర్ మీటింగ్
మనం ఏకమై ప్రజల సంపదను దోచుకుంటున్న మోడీ కేసీఆర్లను మూటకట్టి బజారులో పడేద్దాం.నీళ్లు నిధులు నియామకాలు ఆత్మ గౌరవం కోసం తెచ్చుకున్న లక్ష్యాలు బిఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కటి నెరవేరలేదు.తొమ్మిది సంవత్సరాల టిఆర్ఎస్ పరిపాలనలో 18 లక్షల కోట్ల బడ్జెట్ 86% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సన్న చిన్న కారు రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పు తేలేదు.ప్రాణత్యాగాలకు ముందుకొచ్చి అగ్నికి ఆహుతై రాష్ట్రం కోసం త్యాగం చేసిన అమరవీరుల లక్ష్యాలు ఏ ఒక్కటి కూడా కెసిఆర్ నెరవేర్చలేదు. మనందరి బాగు కోసం తెలంగాణ లక్ష్యాలు కాంగ్రెస్తోనే సాధ్యమని పిప్పిరి నుంచి పాదయాత్ర మొదలుపెట్టాను. మద్యాన్ని అమ్మండి అమ్మండి తాగండి తాగండి అని చెప్పడానికేనా తెలంగాణ తెచ్చుకుంది.జనాలను మద్యం మత్తులో నుంచి తన ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్న కేసీఆర్ ఇక ఆటలు సాగవు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో ఉన్న బెల్టు షాపులు మూసివేస్తాం.
18 లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చిన 5 లక్షల కోట్ల అప్పు డబ్బులు ఏమైనాయి.ఏ ప్రాజెక్టు కట్టారని 18 లక్షల కోట్లు తెలంగాణ సొమ్మును దోపిడీ చేశారు.లక్ష 25 వేల కోట్లతో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఎత్తిపోతల ప్రాజెక్టుతో తెలంగాణలో ఒక్క ఎకరానికైనా అదనంగా సాగునీరు ఇచ్చారా? తెలంగాణలో భారీ ప్రతి నీటి బొట్టు ఆనాటి కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల నుంచే పారుతున్నవి.శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్ మానేర్ ప్రాజెక్టుల నీళ్లను కాళేశ్వరం నీళ్లుగా చూపించి వీటిని నిర్మాణానికి ఖర్చుచేసిన లక్ష 25 వేల కోట్ల తెలంగాణ సొమ్మును దోపిడీ చేశారు.
నోటిఫికేషన్లు వేయకుండా, వేసిన ఒక నోటిఫికేషన్ ప్రశ్నపత్రాన్ని లీకేజీ చేసి లక్షల మంది యువతకు మానసిక క్షోభ పెట్టిన టిఆర్ఎస్ కు బుద్ధి చెప్పడానికి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నా. గద్దర్ అన్న లాంటి తెలంగాణ పోరాట యోధుల త్యాగాలతో వచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ మళ్ళీ దొరల రాజ్యం తెచ్చారు.ప్రశ్నిస్తే కేసులు అడిగితే అరెస్టులు నిలదీస్తే జైలు ప్రశ్నించిన వారిని వేధింపులకు పాల్పడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణలో ప్రశ్నించడమే ఆగిపోవడం వల్ల కళాకారులు మేధావులు, కవులు నిశ్శబ్దంగా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరం.