– ఉద్దేశపూర్వకంగా నా పై వ్యక్తిత్వ వ్యక్తిత్వ హననం
– సి.పి.ఆర్.ఓ శ్రీహరి ఇచ్చిన సమాచారం ఎక్కడా చార్జి షీట్ లో లేదు
– పూడి శ్రీహరి గారూ.. నాపై వేసిన నిందలు నిరూపించండి
– మీడియా ముందుకొచ్చిన సీనియర్ ఐపియస్ అధికారి ఏ.బి. వెంకటేశ్వరరావు
విజయవాడ : తన సస్పెన్షన్ తర్వాత ఇప్పటి వరకూ మౌనంగా ఉన్న ఏపీ నిఘా మాజీ దళపతి ఏబీ వెంకటేశ్వరావు.. పెగాసస్ స్పైవేర్ కొనుగోలు ఆరోపణల నేపథ్యంలో హటాత్తుగా తెరపైకొచ్చారు. తాను నిఘా దళపతిగా ఉన్నంతవరకూ పెగాసస్ కొనలేదని కుండబద్దలు కొట్టారు. ఇక తనకు వ్యతిరేకంగా నాడు ఆరుపేజీల పత్రాలు మీడియాకు విడుదల చేసిన సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి లక్ష్యంగా ఏబీ ప్రశ్నాస్త్రాలు సంధించారు. శ్రీహరి ప్రచారం చేసిన ఆరోపణలు చార్జిషీట్లో ఎందుకు లేవని, ఈ వ్యక్తిత్వ హననానికి శ్రీహరి సమాధానం చెప్పాలని ఏబీ నిలదీశారు. తన హయాంలో ఎవరి ఫోన్లూ ట్యాపింగ్‌కు గురికాలేదన్న ఏబీవీ.. పెగాసస్ కొనుగోలు వ్యవహారంలో కొద్దిరోజుల నుంచి తనను లక్ష్యంగా చేసుకుని మీడియా, రాజకీయ పార్టీ సాగిస్తున్న దుష్ప్రచారంపై నిప్పులు చెరిగారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు ఏమన్నారంటే…
నాలుగు రోజుల నుండి పెగాసెస్ అంశం పై మీడియా లో చర్చ సాగుతుంది. నా పై వ్యక్తిగత ఆరోపణలు, కధనాలు వస్తున్నాయి. ప్రజల్లో కూడా దీని అనుమానం, ఆవేదన నెలకొంది.ఈ చర్చల వల్ల ప్రజలు అభద్రతాభావానికి గురవుతున్నారు.
నాకు తెలిసినంత వరకు ప్రజల అనుమానాలకు సమాధానం చెబుతా. పెగాసస్‌పై వస్తున్న సందేహాలను నివృత్తి చేయడం నా బాధ్యతగా భావిస్తున్నా . నిజానికి ప్రభుత్వమే ఈ అనుమానాలకు తెర దించాల్సి ఉంది. సమాచార హక్కు చట్టం కింద ఒక వ్యక్తి పెగాసెస్ సమాచారం అడిగారు. ప్రజల భయాలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.
పెగాసస్ కొనలేదని ఇప్పటికే డీజీపీ కార్యాలయం తెలిపింది. అప్పటి డీజీపీ ఆఫీస్ కాకుండా మరొకరు కొన్నారని ఆరోపిస్తున్నారు . అయినా కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు.దీనిపై ఏమీలేదని వారు జవాబు ఇచ్చారు. కోడి గుడ్డుపై ఈకలు పీకే వ్యక్తులు ఎక్కడో జరిగిందని ప్రచారం చేశారు. నేను పదవిలో ఉన్న సమయంలో అటువంటివి ఏమీ జరగలేదు.మే 2019 తర్వాత ఏం జరిగిందో నాకు, నాపై ఆరోపణలు పరమ టైమ్ వేస్ట్ తప్ప మరొకటి కాదు. ఎప్పుడూ కొనని, వాడని దానికి నాకు ముడిపెట్టడం ఏమిటో అర్థం కావడం లేదు.
గత ప్రభుత్వంలో నిఘా ఛీఫ్‌గా ఉన్నందున నాకు పూర్తి సమాచారం ఉంది.నేను పూర్తి సమాచారం తో ప్రజలకు ఈ అంశాలను చెబుతున్నా.మే 2019 వరకు పోలీసు శాఖలో ఏ ఒక్క విభాగమూ పెగాసెస్ కొనలేదు, వాడలేదు. నాకు ఆనాడు ఉన్న పూర్తి సమాచారంతో ప్రజలకు హామీ, భరోసా ఇస్తున్నా.
ఫోన్ లు హ్యాక్ అయ్యాయనే అనుమానాలు వద్దు. ఆగస్టు 2021 సంవత్సరం వరకు కొనలేదని డీజీపీ కార్యాలయం కూడా చెప్పింది. ఇంకా ఎక్కడైనా కొనుగోలు చేసినట్లు అనుమానాలు ఉంటే విచారణ కోరవచ్చు. ప్రభుత్వమే దీని పై స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుంది.
అసత్యాలు, అసంబద్ధమైన ప్రచారాలతో ప్రజలను గందరగోళం లో పడేయవద్దని విజ్ఞులను కోరుతున్నా.నాకు ప్రమేయం లేని, నేను కొనని అంశాల పై వివరణ ఇవ్వాల్సి రావడం వింతగా ఉంది.
చీఫ్ సెక్రటరీ గారి కార్యాలయంలో నేను మూడు వినతి పత్రాలు ఇచ్చాను.నేను మీడియా ముందు ఏదో మాట్లాడాననే దాని త్వరగా విచారణ పూర్తి చేయాలని కోరా. నాపై గతంలో ప్రభుత్వం విచారణ చేసి సస్పెండ్ చేసింది.
కేంద్రం ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతుందో? నా సస్పెన్షన్ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పూ ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే
తెచ్చుకుంది. ఏపీ నుంచి కొన్ని పత్రాలు రాలేదని కేంద్రం చెబుతోంది.నేను ఏ కారణాలతోనూ విచారణకు దూరంగా లేను.త్వరగా పూర్తి చేయాలనే కోరుతున్నాను. నాపై కేసులు పెట్టడానికి కొంతమంది అధికారులు కొన్ని తప్పు పత్రాలు సృష్టించారు.నాకు విచారణ లో ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను.
సీనియర్ ఐపియస్ అధికారిగా నా పై జరిగిన కుట్ర కు విచారణ చేయాలని కోరినా స్పందన లేదు.ఉద్దేశపూర్వకంగా నా పై వ్యక్తిత్వ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.కొంతమంది మీడియా ప్రతినిధులు నాపై అసత్యాలు ప్రచారం చేశారు. వారిపై దావా వేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను.
ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వార్తలు రాయవచ్చు.కానీ నాపై కుట్ర పూరితంగా అసత్య ప్రచారం చేశారు.ఆనాడు సస్పెన్షన్ ఆర్డర్ తో పాటు, శ్రీహరి అనే సి.పి.ఆర్.ఓ వ్యక్తి ఇచ్చిన ఆరు పేజీల కాపీని ముద్రించారు.
డిసెంబర్ లో చార్జి షీటు ఇచ్చేంత వరకు ఈ నిందలు మోయాల్సిందే.శ్రీహరి ఇచ్చిన సమాచారం ఎక్కడా చార్జి షీట్ లో లేదు.రూ.25 కోట్ల కుంభకోణం నేను మోయాలా… మీరు ఇష్టం వచ్చినట్లు రాస్తారా?
నా కుటుంబ సభ్యులు, మిత్రులు, ప్రజల్లో నా పరపతిని దిగజారుస్తారా?నేను దేశ ద్రోహినా, అవినీతి పరుడినా?మరి ఛార్జ్ షీట్ లో ఈ అంశాలు ఎక్కడ ఉన్నాయో చూపాలి.నాపై అన్యాయంగా బురద జల్లి పైశాచిక ఆనందాన్ని పొందారు.ప్రభుత్వం జీతం తీసుకున్న శ్రీహరికి బాధ్యత ఉండక్కర్లేదా? ఇందులో నైతికత, న్యాయం, ధర్మం ఉందా?
నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేయత్నాలు చేసినవారిపై పరువు నష్టం దావా వేసేందుకు అనుమతి కోరా. సాక్షి పత్రిక, సాక్షి చానెల్, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, అబ్బయచౌదరి, విజయసాయిరెడ్డి, పయనీర్ పత్రిక, స్వర్ణాంధ్ర మధ్యాహ్న పత్రిక, గ్రేట్ ఆంధ్ర డాట్‌కామ్‌పై పరువు నష్టం దావా వేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరా.
సాక్షి మీడియా ద్వారా విష ప్రచారం ఎంత వరకు నైతికం? నాపై సీపీఆర్వో చేసిన ప్రచారానికి, ప్రభుత్వ చార్జిషీట్‌కు ఏమైనా పొంతన ఉందా? ఒక్క రూపాయి తిన్నట్టుకాని ప్రభుత్వానికి నష్టం చేసినట్టుగానీ చార్జిషీట్లో లేదు.
30 ఏళ్ళపాటు దేశం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేశా.నేను దేశద్రోహినా.. చార్జిషీట్లో ఎక్కడుంది చెప్పండి.. సీపీఆర్వో గారూ..
నా కుమారుడిపై చేసిన ఆరోపణలు చార్జిషీట్లో ఎందుకు లేవు? సీఐలకు పదోన్నతి విషయంలోనూ నాపై అసత్యాలు ప్రచారం చేశారు. ఒకే సామాజికవర్గం వారు ఉన్నారనడం అబద్ధమని హోంమంత్రే చెప్పారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏమన్నారో స్పష్టత లేదు . పెగాసస్ అమ్ముకునేందుకు వచ్చినవారు పలువురి పేర్లు చెప్పారని తెలిసింది. ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
పెగాసిస్ ఉదంతంలో కూడా నా పై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదు.అసలు పెగాసెస్ పై కనీసం విచారణ కూడా జరిగే అవకాశం లేదు.పూర్తి స్థాయి సమాచారం తెప్పించుకోకుండా ఎలా రాస్తారు?ఐపీఎస్ అంటే నా బలం అనుకున్నా.అదే బలహీనత అనుకుంటే ఎలా?
అందరూ అధికారులు బుద్ది మంతులు అని నేను చెప్పడం లేదు.నిజంగా తప్పు చేసి ఉంటే ఎవరినైనా శిక్షించండి.నా వృత్తిలో ఎంతో మందిని కాపాడాను. నాకే రక్షణ కరువైతే ఎలా?ఇక నేను ప్రజలను ఎలా రక్షిస్తాను?
జీవితాంతం దుష్టుల నుంచి తాను ప్రజలను రక్షిస్తే.. ఇప్పుడు తనకే రక్షణ లేకుండా పోయిందని ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని.. కానీ ఉద్యోగం చేసే వారికీ కొన్ని నిబంధనలు ఉంటాయన్నారు. ప్రభుత్వాన్ని తాను విమర్శించకూడదని.. తాను ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని.. ప్రైవేట్ వ్యక్తులు చేస్తోన్న ఆరోపణలను తిప్పి కొట్టడానికి తాను మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.
తానేం నాగాలాండ్ నుంచి రాలేదని.. పంజాబ్ నుంచి రాలేదని.. ఏపీ మట్టిలోనే పుట్టానని తెలిపారు. తప్పు చేయాలంటే తాను భయపడే వ్యక్తిని అని.. పెగాసస్ లాంటి వివాదంలోకి తనను లాగుతారని తెలిస్తే సివిల్ సర్వీసెస్‌లోకి వచ్చేవాడిని కాదన్నారు. ఇలా జరిగితే మరేవరైనా వస్తారా అని ఆయన ప్రశ్నించారు.తాను ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నానని ఇష్టం వచ్చినట్టు అబద్దాలు ప్రచారం చేయడం సరికాదని మండిపడ్డారు.
జీవితాంతం దుష్టుల నుంచి తాను ప్రజలను రక్షిస్తే.. ఇప్పుడు తనకే రక్షణ లేకుండా పోయిందని ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని.. కానీ ఉద్యోగం చేసే వారికీ కొన్ని నిబంధనలు ఉంటాయన్నారు. ప్రభుత్వాన్ని తాను విమర్శించకూడదని.. తాను ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని.. ప్రైవేట్ వ్యక్తులు చేస్తోన్న ఆరోపణలను తిప్పి కొట్టడానికి తాను మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.