Suryaa.co.in

Andhra Pradesh

పెన్ కెమెరాతో వీడియోలు తీసి ఇచ్చినప్పుడు అధికారులకు జైలు నిబంధనలు గుర్తుకు రాలేదా?

– నారా లోకేష్

జగన్ జమానాలో లేఖ రాయడం కూడా దేశ ద్రోహమా? నిబంధనలకు విరుద్ధంగా పెన్ కెమెరాతో వీడియోలు తీసి ఇచ్చినప్పుడు అధికారులకు జైలు నిబంధనలు గుర్తుకు రాలేదా? చెయ్యని తప్పుకి 44 రోజులుగా జైలులో బంధించారు. ములాఖత్‌లో భాగంగా ఆయన ప్రజలతో చెప్పాలనుకున్న అంశాలు అన్ని మాతో పంచుకున్నారు. ప్యాలెస్ ఆదేశాలకు భయపడి లేఖ రాయడం కూడా నేరం అన్నట్లు పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏపీలో పరిస్థితులు ఎమర్జెన్సీ తలపిస్తున్నాయి. నాలుగు గోడల మధ్య నిర్బందించినా జగన్‌కి కక్ష తీరలేదు. ఆఖరికి లేఖ రాసే హక్కు కూడా లేదంటూ వేధిస్తున్నారు.

LEAVE A RESPONSE