– బీజేపీ పొలిటికల్ ఫీడ్ బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్
ఒక వైపు, 108 వాహనాలు & నిర్వహణ నేషనల్ హెల్త్ మిషన్ సహకారంతో అయినప్పుడు.. ” వైయస్సార్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ” పేరుతో స్వంత డప్పు ఏమిటి? ?తల్లి కి విశ్రాంతి సమయం ఖర్చుల కోసం, చేతిలో పెట్టే 5000 రూపాయిలు మొత్తం కేంద్ర ప్రభుత్వం ” ప్రధాన మంత్రి మాతృ వందన యోజన” నుండి ఇస్తున్నవే.
తల్లికి ఇచ్చే 5000 రూపాయిలలో ఒక్క పైసా కూడా జగన్ ప్రభుత్వం భాగం లేదు. మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఎప్పటిమాదిరిగా జగన్ స్టిక్కర్ వేశాడు. నేడు జగన్ ఫోటో స్టిక్కర్ వేసి ప్రారంభంచబోయే 500 ” వైయస్సార్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ” వాహనాల వ్యయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి.
మరో వైపు , రామాలయం లో అన్యమత కూటమి తప్పు. ప్రశ్నించిన వ్యక్తి పైన ” దిశ కేసు ” దుర్మార్గం. జగన్ పాలనలో రాష్ట్రాన్ని అన్యమత కూటమిగా మారుతుంది, దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిది. ఇతర ప్రార్ధన మందిరంలో శ్రీ రామ కీర్తనలు పాడిస్తారా? ఇదేనా సెక్యులరిజం అంటే?

