నెల్లూరు జిల్లాలో బాధాకర పరిస్థితులు

-మాజీ మంత్రి సోమిరెడ్డి ఆవేదన

నెల్లూరు జిల్లాలో బాధాకర పరిస్థితులు నెలకొన్నాయి.ప్రశాంతమైన జిల్లాలో అశాంతిని రేకెత్తిస్తున్నారు. ఒకప్పుడు అధికారులు నెల్లూరు జిల్లాలో పనిచేయడానికి ఇష్టపడితే నేడు నెల్లూరు అంటే వద్దంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్, ఎస్పీలు నెల్లూరు కావాలని కోరుకునేవారు. అటువంటి జిల్లా దుర్మార్గంగా తయారైంది. నెల్లూరు జిల్లాలో ఊహించని పరిస్థితులు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో ఐదుమంది వ్యక్తులు పోలీసుల వేధింపులు, దాడులవల్ల చనిపోయారు. నలుగురు జిల్లావాసులు వైసీపీ నాయకుల వేధింపులు, దాడుల వల్ల చనిపోయారు. ఈ మూడు సంవత్సరాల్లో జిల్లాలో మొత్తం 9 మంది చనిపోయారు. వీరికి న్యాయం చేయడానికి మేము తెలుగుదేశం పార్టీ తరపున అహర్నిశలు పోరాడాం.

ఇటుక బట్టీలో కూలీగా పనిచేసే ఉదయగిరి నారాయణ అనే దళితుడిని పోలీసులు కొట్టి చంపారు. వీరిది అరుంధతి కుటుంబం వారి సాంప్రదాయంలో దహన సంస్కారాలు నిర్వహించకుండా 40 మంది పోలీసులు దహనం చేయించారు. అతను కొట్టడంవల్లే చనిపోయాడని సీనియర్ డాక్టర్ చెప్పడంతో ఈ కేసును చాలెంజ్ గా తీసుకొని పోరాడాం. కేంద్ర మంత్రి సహాయం తీసుకున్నాం. పొదలకూరు నియోజకవర్గంలోని సర్వేపల్లిలో ఈ సంఘటన జరిగింది. రాష్ట్ర మంత్రి అనుచరుడు ఈ అఘాయిత్యానికి కారకుడు. ఈ అంశంపై పొదలకూరులో ఫైట్ మొదలుపెట్టాం. పోస్టుమార్టం రిపోర్టును పోలీసులు మార్చేశారు.

చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడుగార్లతో మాట్లాడి డోలా బాల వీరాంజనేయస్వామి, నక్కా ఆనందబాబు, రాష్ట్ర టీడీపీ నాయకులు పొదలకూరుకు వచ్చారు. 45 నిమిషాలు అధికారులతో మాట్లాడారు. చనిపోయిన వ్యక్తి భార్యకు లక్షా 50 వేలు ఇచ్చి నా భర్తే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని ఎవరికీ సంబంధం లేదని 174 సెక్షన్ కింద కేసును క్లో జ్ చేశారు. ఆత్మహత్య చేసుకునేవాడి శరీరంపై కొట్టిన దెబ్బలుండవుకదా? సబ్ ఇన్సెపక్టర్, ఇటుకబట్టీ యజనాని ఇద్దరు ఫ్రెండ్స్. వీరిద్దరే ఈ తతంగం నడిపారు. ఎస్పీ దళితుడి భార్యను ప్రలోభపెట్టారు.

టీడీపీ నాయకులంతా ఢిల్లీవెళ్లి వెంకయ్యనాయుడు చే ఫోన్ చేయించారు. గ్రామ సచివాలయం కార్యదర్శి చేతులు పట్టుకుని పొరపాటైందని కాళ్లబేరానికి వచ్చంది. భర్త డెత్ సర్టిఫికెట్ తీసుకొమ్మని ప్రాధేయపడింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో 4వ తరగతి ఉద్యోగం ఆర్డర్ మృతుడి భార్యకు ఇచ్చారు. జీవిత కాలం నెల నెలా 5 వేలు పింఛన్ వచ్చేలా కుదుర్చారు. 4లక్షల 12వేల 500 డబ్బు ఇప్పుడు అకౌంట్ లో వేశారు. తరువాత మరలా 4లక్షల 12వేల 500 డబ్బు ఇచ్చేలా అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. ముగ్గురు బిడ్డలకు ఉచిత విద్య అందించేలా కుదర్చారు. నెల్లూరు సిటీలో 3 సెంట్ల ఇంటి పట్టా ఇచ్చారు. 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. ఇవన్నీ 24 గంటల్లో ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ చొరవ చూపి ఢిల్లీ వెళ్లి పోరాడటంతో వారికి న్యాయం జరిగింది. మేం చర్యలు తీసుకోకుండా ఉండివుంటే ఉదయగిరి నారాయణ తల్లి, చెల్లి, బిడ్డలు అనాధలయ్యేవారు. ఇలాంటివి అనేకం చేవాం. జిల్లాలో పన్నెండుగురికి తీవ్ర అన్యాయం జరిగింది. 12 కేసులను 12 మంది లాయర్లను పెట్టి రోజూ తెలుగుదేశం పార్టీ తరపున పోరాడుతున్నాం. వైసీపీ అరాచకాలను చట్టాలను వినియోగించుకొని ప్రజల ఆస్తులు కాపాడుకోవాలి. ప్రజల మాన, ప్రాణాలు కాపాడుకునే అవకాశాలను వెతుక్కోవాల్సిన అవసరం ఉంది.