Suryaa.co.in

Telangana

తార్నాక డివిజన్ లో కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్,CMRF చెక్కుల పంపిణి

మారేడుపల్లి/ముషీరాబాద్ రెవిన్యూ మండలాల పరిధిలో తార్నాక డివిజన్ పరిధిలో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. తార్నాక, నాగార్జున నగర్, లాలాపేట, చంద్రబాబు నగర్, ఆర్య నగర్, మానికేశ్వరి నగర్, రవీంద్ర నగర్, తదితర ప్రాంతాల్లో లబ్దిదారుల ఇళ్ళ వద్దకే చేరుకొని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, cmrf చెక్కులను పద్మారావు గౌడ్ అందించారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, తెరాస నేత మోతే శోభన్ రెడ్డి, తెరాస యువ నేతలు తీగుల్ల కిషోర్ కుమార్, రామేశ్వర్, త్రినేత్ర గౌడ్, తహసిల్దార్లు జానకి, సునీల్ కుమార్ తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.కాగా తన పర్యటనలో భాగంగా వివిధ స్థానిక సమస్యల పై కూడా తీగుల్ల పద్మారావు గౌడ్ వెన్వెంటనే స్పందించి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుమారుగా రూ. 45 లక్షల మేరకు విలువ చేసే 46 చెక్కులను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా లబ్దిదారులకు అందించారు.

LEAVE A RESPONSE