చిత్తూరు : కుప్పంలో డిజిటల్ నర్వ్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. బుధవారం కుప్పంలోని రాష్ట్రంలో తొలిసారిగా కుప్పంలో డిజిటల్ నర్వ్ సెంటర్ పనితీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతికత వినియోగించడంతో వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవచ్చన్నారు.
తద్వారా ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ఈ కేంద్రం ద్వారా కుప్పం నియోజకవర్గ పరిధిలోని 13 పీహెచ్ సి లు, 92 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను అనుసంధానం చేయడం జరిగిందని తెలిపారు. వ్యక్తిగత వైద్య రికార్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఈ కేంద్రం సేవలందించ నుందని రోగుల కన్సల్టెన్సీ సేవలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
డిజిటల్ నర్వ్ సెంటర్ నందు జిల్లా కలెక్టర్ హాజరు రిజిస్టర్ ను పరిశీలించి, ఎంతమంది పేషెంట్లు వస్తున్నారని, డాక్టర్లు ఏ సమయానికి వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారో అని అడిగి తెలుసుకున్నారు.డాక్టర్లు అందు బాటులో ఉండి సెలవు రోజుల్లో కూడా హాజరుకావాలని, సెలవు రోజు హాజరైన డాక్టర్ కి ప్రత్యాయంగా ఇంకో రోజు సెలవు తీసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.