Suryaa.co.in

Andhra Pradesh

కోనసీమ జిల్లాలో పింఛన్ల పంపిణీ పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ పింఛన్ల పంపిణీ కొనసాగుతుండగా, కోనసీమ జిల్లాలో స్వయంగా జిల్లా కలెక్టర్ హిమాన్హు శుక్లా క్షేత్ర స్ధాయిలో పర్యవేక్షించారు. బుధవారం తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయగా, కోనసీమ వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించి, అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. మరోవైపు ఇంటివద్దే జరుగుతున్న బియ్యం పంపిణీని సైతం పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నిబంధనల మేరకు సక్రమంగా బియ్యం, పింఛన్లు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఆరా తీసారు. ఈ సందర్బంగా కలెక్టర్ హిమాన్హు శుక్లా మాట్లాడుతూ కోనసీమలో పింఛన్లు, పీడీఎస్‌ బియ్యం పంపిణీ షెడ్యూల్‌ ప్రకారం ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందన్నారు.

LEAVE A RESPONSE