Suryaa.co.in

Andhra Pradesh

సిగ్గులేకుండా మగతనం గురించి మాట్లాడుతున్నారు

– తన బాబాయ్ ప్రాణాలతో చెలగాటమాడి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ప్రజల ప్రాణాలతో కూడా అలానే ఆడుకోవాలనిచూస్తే, ఆ ఆటే ఆయన కథను ముగిస్తుంది
• నాటుసారామరణాలపై కట్టుకథలుచెప్పిన ముఖ్యమంత్రి, మంత్రులు సిగ్గులేకుండా మగతనం గురించి మాట్లాడుతున్నారు
• మంత్రలు చెప్పేది..ముఖ్యమంత్రికి వారంతా ఉంది అనుకునేది నిజమైన మగతనం కాదని వారుతెలుసుకుంటే మంచిది
• ప్రజలిచ్చినఅధికారంతో వారికిహానికలిగించకుండా, చేసినతప్పులనుసరిచేసుకుంటూ, వారుమెచ్చేలా పాలనచేయడమే అసలైన మగతనమని తెలుసుకోండి.
• చంద్రబాబు హాయాంలో మద్యంసీసాలు పగలగొట్టిచిందులుతొక్కి, వీరంగంవేసిన రోజా జంగారెడ్డిగూడెం మరణాలపై స్పందించదేం?
– టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి

జగన్మోహన్ రెడ్డిపాలనలో రాష్ట్రం శిరస్సులేని మొండెంలా తయారైందని, ముఖ్యమంత్రి పొరపాటున కూడా ఎవరికీ హోలీ శుభాకాంక్షలు చెప్పకపోవడమే మంచిదని, ఆయన నిర్వాకంతో జంగారెడ్డిగూడెంలో 28కుటుంబాలవారు గుండెలవిసేలా విలపిస్తు న్నారని టీడీపీ అధికారప్రతినిధి దివ్యవాణి తెలిపారు.

శుక్రవారం ఆమె మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే …
కల్తీసారా మరణాలను సహజమరణాలుగా చిత్రీకరించిన ముఖ్య మంత్రి తెలివితేటలుచూసి ప్రజలంతా విస్తుపోతున్నారు. జగన్మోహ న్ రెడ్డి నరంలేని నాలుక ఎంతఈజీగా అబద్ధాలాడుతుందో చెప్ప డానికి నాడు జరిగిన కోడికత్తి డ్రామా మొదలు, నేడుజరిగిన సారా మరణాలవరకు అనేక ఉదంతాలున్నాయి.
బాబాయ్ గొడ్డలిపోటు కథ ముఖ్యమంత్రి నరంలేని నాలుకనుంచి జారువాలిన అబద్ధాలఉదంతాల్లో అగ్రస్థానంలో ఉంటుంది. 28 కుటుంబాల్లో సంతోషం అనేది లేకుండాచేసింది కాక, సారాతాగి చనిపోయినవారివి సహజమరణాలే అని ముఖ్యమంత్రి నాలుక మడతపెట్టడం క్షమించరాని నేరం. జగన్మోహన్ రెడ్డి అలా మాట్లా డితే బీబీ మంత్రి….అలియాస్ బూతులమంత్రి నానీకూడా సహజ మరణాలే అంటూ గొంతుచించుకున్నాడు. కల్లబొల్లిమాటలతో.. అవాస్తవాలు..అబద్ధాలతో గతంలో చంద్రబాబుగారిపై విషప్రచారం చేసిన రోజా ఇప్పుడు సారామరణాలపై స్పందించదేం?

రోజాఒక్కతే కాదు…అన్నవిజయంకోసం పాదయాత్రచేసి, చంద్రబా బు వస్తే యువతకు జాబ్ వస్తుందా అని ప్రశ్నించినషర్మిలకూడా జంగారెడ్డిగూడెం అంశంపై స్పందించాలి. రోజా, జగన్మోహన్ రెడ్డిని నిజంగా అభిమానించేది..ప్రేమించేది అయితే, ఆయన ఇచ్చిన మద్యపాననిషేధం ఏమైందో ఆమె సమాధానంచెప్పాలి. ముఖ్య మంత్రి సాగిస్తున్న నాసిరకం మద్యంఅమ్మకాలు, కల్తీసారా అమ్మ కాలను ఆమె ఎలాసమర్థిస్తుందో కూడా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

రోజాకు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి భజనచేయడం తప్ప వేరేపనేమీ లేనట్లుంది. తన నగరి నియోజకవర్గంలో జరిగేవాటిపై ఆమె ఎలాగూస్పందించదు..పట్టించుకోదు. కనీసం తాడేపల్లి గూడెం సారామరణాలపై కూడా స్పందించలేని దౌర్భాగ్యపుస్థితిలో ఆమె.. ఆమెపార్టీఎమ్మెల్యేలు ఉండటం సిగ్గుచేటు.

ఎక్సైజ్ , పోలీస్ అధికారులు మామూళ్లమత్తులో జోగుతూ, కల్తీసారా అమ్మకాలను వదిలేయబట్టే, నేడు 28మంది ప్రాణాలు పోయాయి. రాష్ట్రంలో వేసవివచ్చినట్టే ఎండలుపెరిగాయి. ఇప్పుడు మారుమూలప్రాంతాల్లో మంచినీళ్లు దొరకడంలేదుగానీ.. జగన్మోహన్ రెడ్డి అమ్మిస్తున్నకల్తీమద్యం, నాటుసారావంటివి ఎక్క డపడితే అక్కడ లభిస్తున్నాయి.

జంగారెడ్డిగూడెం ప్రాంతంలోనేకాదు..తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో, ప్రకాశంజిల్లా కురిచేడుప్రాంతంలో, పశ్చిమగోదావరిజిల్లా కొయ్యలగూడెం, చిత్తూరుజిల్లా ఎర్రవారిపా లెంలో కల్తీమద్యం, నాటుసారావల్ల ఎంతోమందిచనిపోయారు. ఆయాప్రాంతాల్లో చనిపోయినవారుగురించి,అక్కడసాగుతున్న అక్రమమద్యం అమ్మకాలగురించి జగన్మోహన్ రెడ్డికి పట్టదు. ఆయనప్రభుత్వానికి, మంత్రులకు అసలేపట్టదు. జగన్ రెడ్డి మద్యంధరలు పెంచడంతో కరోనాసమయంలో చాలామంది శానిటై జర్, స్పిరిట్ వంటివితాగిప్రాణాలుకోల్పోయారు. ముఖ్యమంత్రికి ఎప్పుడూ నెగెటివ్ ఆలోచనలే వస్తుంటాయి. ఎందుకంటే ఆయన పనులుఅలాఉంటున్నాయి మరి. తానుఅధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చేసిన ప్రజావేదికను కనీసం మద్యండీఆడిక్షన్ సెంటర్ గా అయినామార్చిఉంటే, ఇప్పుడు అదిచాలామందికి ఉపయోగపడిఉండేది.

బూతులమంత్రి నానీ జగన్మోహన్ రెడ్డిచర్యలనుసమర్థిస్తూ, ఆయనపై ఉమ్మేయడం అంటేసూర్యుడిపై ఉమ్మేయడమే అంటు న్నాడు…కానీ నానీతెలుసుకోవాల్సింది ఒకటుంది…ఆయనతో సహా, వైసీపీఎమ్మెల్యేలు,మంత్రులంతా వారిముఖాలపై వారిఉమ్మే వేసుకోవడానికికూడా అనర్హులే.
జంగారెడ్డిగూడెంలోని డాంగేప్రాంతంలో ముగ్గురువైసీపీవారు సారా విక్రయాలుసాగిస్తున్నారని, వాటిలో బ్యాటరీల్లో వాడేపదార్థాలతో పాటు.. మిథైల్ వంటి ఇతరత్రాహానికారకపదార్థాలు కలుపుతు న్నారని మృతుల కుటుంబీకులు చెబుతున్నారు. వారు ఆమాట చెప్పగానే మంత్రి ఆళ్లనాని తనఅనుచరులను రంగంలోకి దింపి, వారిని బెదిరించడం తోపాటు ఉద్యోగాలు,డబ్బులిస్తామని ప్రలోభ పెట్టారు.
ముఖ్యమంత్రి తనబాబాయ్ ప్రాణాలతో చెలగాటమాడినట్టుగా రాష్ట్ర ప్రజలప్రాణాలతో ఆడుకోవడం ఆయనకే చేటని హెచ్చరిస్తున్నాం.

ప్రజలప్రాణాలుపణంగాపెట్టి, ముఖ్యమంత్రి ఆడుతున్న ఆట ఆయన భవిష్యత్ కే ముగింపుపలుకుతుంది. గుడివాడలో కేసినో ఆడించి.. తప్పించుకున్నంత తేలిగ్గా జంగారెడ్డిగూడెం మరణాలపై కూడా తప్పించుకోవచ్చని బూతులమంత్రిఅనుకుంటున్నారేమో .. అది ఆయనకు, ఆయనప్రభుత్వానికి మగతనంకానేకాదని తెలు సుకుంటే మంచిది. ప్రజలవిషయంలో చేస్తున్నతప్పులనుసరిచేసు కొని పరిపాలన చేయడమే అసలైన మగతనమని నానీ గ్రహించా లి. జంగారెడ్డిగూడెం నాటాసారా మరణాలపై సమాధానంచెప్పకుం డా అసెంబ్లీ, మండలిలో టీడీపీసభ్యులనుసస్పెండ్ చేయడం ఎంత వరకు సబబో మీరే ఆలోచించుకోండి.

అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా కూడా ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఒక్కకంపెనీకూడా తీసుకురాకుండా, మద్యంఅమ్మకాలపైవచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్నినెట్టుకొస్తున్నాడు. మద్యపాననిషేధమని చెప్పి, ఆఖరికి మద్యంఅమ్మితేనే ప్రజలసంక్షేమం సాధ్యమవుతుం దంటూ ఈముఖ్యమంత్రి నిస్సిగ్గుగాజీవోని కూడా తీసుకొచ్చాడు. టీడీపీ హాయాంలో మద్యం అమ్మకాలపై ఏటారూ.5వేల నుంచి రూ.6వేలకోట్ల ఆదాయం వస్తే, ఈముఖ్యమంత్రి వచ్చాక దాన్ని రూ.16,500కోట్లకుపెంచాడు. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన పెద్దమనిషే మద్యంపై వచ్చేఆదాయాన్నితాకట్టుపెట్టిమరీ రూ.25వే లకోట్ల అప్పులుతెచ్చాడు. ఉన్నమద్యందుకాణాలు తొలగించకుం డా ముఖ్యమంత్రే స్వయంగా వాక్ ఇన్ స్టోర్స్ పేరుతో కొత్తదుకా ణాలు తెరిపించాడు.

ఇదేనా జగన్మోహన్ రెడ్డిచెప్పిన మద్యపాన నిషేధం? మంత్రులందరూ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మగతనం గురించి మాట్లాడుతుంటారు..
మగతనంఅంటే మంత్రులైన పేర్నినాని, ఆళ్లనాని, మరోనానీనో అనుకునేదికాదు. కరకట్టపై ఉన్న ప్రజావేదికను కూల్చేసిన ముఖ్యమంత్రి అదేకట్టపైఉన్న ఇతరనిర్మాణాలజోలికి వెళ్లలేకపో యాడు.. అదేనా ఆయనమగతనం? కరోనాసమయంలో ప్రజలసొ మ్ముని దోచుకోవడానికి కక్షపూరితపాలనచేయడమేనా జగన్మో హన్ రెడ్డి మగతనం? ఇసుకను దోపిడీవనరుగా మార్చుకొని రాష్ట్రాన్ని అథోగతిపాలుచేయడమేనా జగన్మోహన్ రెడ్డి మగతనం ?

పరిపాలనచేతగాని మీ ముఖ్యమంత్రిని, మీప్రభుత్వాన్ని ప్రశ్నించే మాలాంటివారిపై వేశ్యలకన్నాహీనమైనవారితో మాటలు అనిపించడమేనా మీ మగతనం? మగతనం..దానికి ప్రతిరూపమైన పాలన ఎలాఉంటుందో మీకు తెలియదు.. అదేగానీ జగన్మోహన్ రెడ్డికి, ఆయన మంత్రులకు చేతనైఉంటే వివేకానందరెడ్డికుమార్తె సునీత సీబీఐని ఆశ్రయించ దు. తనకున్యాయంచేయమని ఢిల్లీపెద్దలచుట్టూ తిరగదు.

చంద్రబాబు ఎంతో కష్టపడి పరిశ్రమలు తీసుకొచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధిచేస్తే ఆఫలాలను దోచుకోవడం మాత్రమే తెలిసినమీరు.. అదే మగతనమనుకుంటున్నారు. అధికారంలోఉన్న మీరు కేంద్రం పై పోరాడి రాష్ట్రానికిరావాల్సినవాటిని సాధించకుండా.. చంద్రబాబు పై , పవన్ కల్యాణ్ పై పడిఏడుస్తారెందుకు? అంటే మీకు కేంద్రాన్నిఎదిరించిపోరాడే మగతనంలేకనే వారిపై పడి ఏడుస్తున్నా రా? చంద్రబాబుగారు మగాడుకాబట్టే ధర్మపోరాట దీక్ష పేరుతో మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రప్రయోజనాలకోసం గళమెత్తారు. తన ఎంపీలతో రాజీనామాలుకూడా చేయించారు. అదీ చంద్రబాబు మగతనం.

రాజకీయ అపరచాణక్యుడైన చంద్రబాబు ఎక్కడా .. ప్రజలకు భయపడిపోలీసులను అడ్డంపెట్టుకొని బతుకుతున్న మీరుఎక్కడా? రేపుజరిగే ఎన్నికల్లో వైసీపీఓటమికి మీరు, మీ ముఖ్యమంత్రే ప్రధానకారకులు అవబోతున్నారు. సీబీఐవారి వద్ద ఉన్న మీ నాయకుడిపాపాలచిట్టాపుట్ట పగిలేరోజు దగ్గర్లోనేఉందనే వాస్తవాన్ని గుర్తుంచుకోండి. అనకొండలాంటి దుర్మార్గపు విషప్రా ణి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబు అన్నివర్గాల ను, అందరినీ కలుపుకొని పోతేనే సాధ్యమవుతుంది.

LEAVE A RESPONSE