– బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
తెలంగాణ రాష్ట్ర సాధన బీజేపీ లేకుండానే జరిగిందా అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన హడావిడిగా చేసి ఇరు రాష్ట్రాల ప్రజలకు తీవ్ర అన్యాయం చేసి ఘర్షణలు సృష్టిస్తున్నారని అంటే అదేదో ప్రధాన మంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని పుకార్లు లేపి, తెలంగాణ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని డీకే అరుణ ద్వజమెత్తారు.
అసలు తెలంగాణ విభజన బిల్లుపై పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు, ఓటింగ్ జర్గుతునప్పుడు సభలో లేని కెసిఆర్, తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధాని మోడీ పై విమర్శలు చేయడం దుర్మార్గం అని డీకే అరుణ అన్నారు. తెలంగాణ కోసం గల్లి నుంచి ఢిల్లీ వరకు కోట్లాడిన ఏకైక పార్టీ బీజేపీ అని , తెలంగాణ కోసం యువకులు ఆత్మ హత్యలు చేసుకుంటుంటే, ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ ,తెలంగాణ ప్రజలకు భరోసా కల్పిస్తూ ఇచ్చిన ప్రసంగం ఈ రాష్ట్ర ప్రజలు మరచిపోలేదని డీకే అరుణ గుర్తు చేశారు.
తెలంగాణ లో రహదారుల కోసం 3500 కిలోమీటర్లకు 80,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన విషయం తెలంగాణ ప్రభుత్వం మర్చిపోయినట్లు ఉందనీ డీకే ఎద్దేవా చేసారు. గతంలో బీజేపీ ప్రభుత్వం పలు రాష్ట్రాల విభజన చేసామని, అక్కడ కనీసం చిన్న వివాదం కూడా లేదన్న విషయం బీజేపీ వ్యతిరేకులు గుర్తు పెట్టుకుంటే మంచిదని డీకే అరుణ పేర్కొన్నారు.
తెలంగాణ లో 18 సంవత్సరాలు నిండిన వారు 2 కోట్ల 70 లక్షల మంది ఉన్నారని, వారికి ఉచితంగా కరోనా వాక్సిన్ ఇచ్చి 2700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం అని ఆమె అన్నారు. యూపీఏ వైఖరి పై ప్రధాన మంత్రి పార్లమెంట్ లో మాట్లాడితే, తెరాస కు అంతా కోపం ఎందుకు వస్తుంది అని, తెర వెనుక తెరాస, కాంగ్రెస్ కు దోస్తీ ఉందన్న దానికి ఇదే నిదర్శనం అని డీకే అరుణ అన్నారు.
కేసీఆర్ ను విమర్శించినా, ఆయన వైఖరి నిరసిస్తూ దిష్టిబొమ్మలు కాల్చితే వారి పై కేసులు పెట్టే పోలీసులు, ఇప్పుడు తెరాస నాయకులు దేశ ప్రధాని పై అవ్వాకుచవాకులు మాట్లాడుతుంటే, ప్రధాని దిష్టి బొమ్మలు కాల్చుతుంటే పోలీసులకు కళ్ళు, చెవులు పని చేస్తలేవు అనుకుంటా అని డీకే అరుణ పోలీసుల తీరు పై మండ్డిపడ్డారు.