– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబురావు
విజయవాడ: రాజధానిలో ఉన్న ప్రైవేటు యూనివర్శిటిలో స్థానిక, సి.ఆర్.డి.ఎ పరిధిలోని విద్యార్థులకు రాయితీలు కల్పించాలి. యూనివర్శిటీలకు కేటాయించిన రాయితీల వల్ల కలిగే లబ్ధి ప్రజలకు చెందాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించని యూనివర్శిటీలకు మళ్ళీ భూములు కేటాయించ వద్దని సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సి.హెచ్.బాబురావు అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విలేఖర్లతో మాట్లాడారు.
ల్యాండ్ ఫూలింగ్ చట్టం ప్రకాంర రాజధానిలోని ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించాలి. రాజధానిలో ఉన్న ప్రైవేటు యూనివర్శిటీలో స్థానిక, సి.ఆర్.డి.ఎ పరిధిలోని విద్యార్థులకు ఫీజులలో, ఇతర సౌకర్యాలలో రాయితీలు కల్పించాలని, ల్యాండ్ఫూలింగ్ చట్టం ప్రకారం ఉచిత విద్య, వైద్యం అందించాలని, ప్రభుత్వం ద్వారా రాయితీ వల్ల భూములు పొందిన విద్యాసంస్థలలో ప్రభుత్వ నిబంధనలు పాటించని వాటికి మళ్ళీ భూములు కేటాయించడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపియం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాశం రామారావు, కె.నళినీకాంత్, ఎన్.భావన్నారాయణ, ఈమని అప్పారావు, ఎమ్.రవి, తదితరులు పాల్గొన్నారు.