Suryaa.co.in

Andhra Pradesh

చీర్ బాయ్స్ ను పెంచైనా కేసినో వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు

– రాష్ట్ర ప్రజలకు మరింత వినోదం అందించండి
– పక్క రాష్ట్రాల్లో చీర్ బాయ్స్ గా బతకాల్సి వస్తుంది
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

మరో పది మంది చీర్ బాయ్స్ ను పెంచి అయినా కేసినో వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చంద్రబాబుకు సూచించారు. గురువారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర మీడియా పాయింట్లో మంత్రి కొడాలి నాని మాట్లాడారు. చంద్రబాబు చీర్ బాయితో కమిటీ వేశాడన్నారు. గోవా చీర్ గర్ల్స్ వచ్చారని సంక్రాంతి పండుగకు మూడు రోజుల హడావుడి చేశారన్నారు. పండగ అయిన తర్వాత వినోదం కోసం టీడీపీ చీర్ బాయ్స్ ను దింపాడన్నారు. వాళ్ళు ఫీల్డ్లోకి దిగి ఒకరోజు డీఎస్పీ దగ్గరకు వెళ్ళి లెటర్ ఇవ్వడం, బయటకు వచ్చి డ్యాన్స్లు వేయడం, మీడియాతో మాట్లాడడం జరిగిందన్నారు. రెండవ రోజు ఎస్పీ దగ్గరకు వెళ్ళి అక్కడ డ్యాన్స్లు, మీటింగ్లు పెట్టారన్నారు. ఆ తర్వాత డీఐజీ దగ్గరకు వెళ్ళి అదే లెటర్ ఇచ్చి అక్కడ కూడా డ్యాన్స్లు వేసి మీటింగ్లు పెట్టారన్నారు.

సీఎం జగన్, డీజీపీ గౌతమ్సవాంగ్ ను తిట్టడం , ఆ తర్వాత డీజీపీ దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేశారన్నారు. గేటు దగ్గర ఆపిన వెంటనే మీడియా ముందు మళ్ళీ చీర్ బాయ్స్ డ్యాన్స్లు వేసి మీటింగ్లు పెట్టడం అయిపోయిందన్నారు. ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్ధం కాక చంద్రబాబు దగ్గరకే వెళ్ళారన్నారు. చంద్రబాబు వేసిన కమిటీ ఆయనకే నివేదిక ఇచ్చిందన్నారు. చీర్ బాయ్స్ వేసిన డ్యాన్స్లను చంద్రబాబుకే వేసి చూపించారన్నారు. జనానికి వినోదం బాగా అందించామని తెలిపారన్నారు. గవర్నరు కలిసి ఈ రోజును కూడా ముగించారన్నారు. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ను కలిసే వరకు వెళ్తారన్నారు .

చంద్రబాబు, టీడీపీకి రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఏ ఇష్యూలూ లేవన్నారు. సీఎం జగన్ చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుతూ ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చారన్నారు. ప్రజలకు ఏ అవసరం ఉన్నా నేనున్నాననే భరోసాతో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారన్నారు. సీఎం జగన్ పై పోరాటం చేయడానికో, ఆయనకు సలహాలు ఇవ్వడానికి రాష్ట్రంలో ఏ ఇష్యూ లేదని చెప్పారు. కేసినో విషయాన్ని వదలవద్దని చంద్రబాబుకు సూచించారు. చీర్ బాయ్స్ ను పెట్టి రచ్చ రంబోలా చేసి రోజుకో చోటకు పంపాలన్నారు. వీరితో ఆటాపాటా, చిందులు వేయించి రాష్ట్ర ప్రజలకు వినోదం కల్పించాలని కోరారు. కేసినో వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దని, కోడిగుడ్డుకు ఈకలు ఎంత పీకుదామని ప్రయత్నించినా ఈకలే ఉండవని చెప్పారు. ఇంకో పది మందితో టీడీపీ చీర్ బాయ్స్ ను పెంచి రాష్ట్ర ప్రజలకు వినోదం అందించాలని కోరారు. ఎడ్ల పందాలకు, కేసినోకు తేడా తెలియని వ్యక్తులను పెట్టి రాజకీయం చేయాలనుకున్న చంద్రబాబు కుప్పంలో కూడా ఓడి పక్క రాష్ట్రాల్లో చీర్ బాయ్స్ గా బతికే పరిస్థితి ఏర్పడుతుందని మంత్రి కొడాలి నాని అన్నారు.

LEAVE A RESPONSE