Suryaa.co.in

Political News

వారిని వదలొద్దు..

అసలు దోషి బీజేపి..
వైసీపీ భుజం పై తుపాకి పెట్టి టీడిపీ ని గురి చూసి కొడుతున్నారు.
వైసీపీ ప్రభుత్వ అరాచకాల్లో సింహభాగం బీజేపి పెద్దల మనోవాంఛ మాత్రమే!
వారు ఆదేశిస్తారు సామంతుడు పాటిస్తాడు..!
రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసినదే!
టీడీపీ ఇంత కన్నా నష్డపోయేది లేదు..!
రాష్ట్రం సర్వనాశనమయిపోయింది..!
కళ్ళ ముందు కరిగి పోయింది..!
ఒక వ్యక్తిని బూచి గా చూపి ఆడుతున్న కపట నాటకాన్ని బట్టబయలు చెయ్యాలి.
ఒక యంపీ ని తీసుకెళ్ళి అక్రమంగా నిర్భంధించి..హింసించి..గాయపరిచారు.
చరిత్రలో ఇలాంటి దారుణం ఎన్నడయినా చూసారా..!?
విచిత్రంగా ప్రివిలేజ్ కమిటీ మౌనం..!
చర్యలు శూన్యం..!
ఏళ్ల తరబడి ఆర్ధిక నేరస్ధులు బయట తిరుగుతారు.
అరాచకాలకు పాల్పడతారు.
రాజ్యాంగం..చట్టం యధేచ్ఛగా ఉల్లంఘిస్తారు.
వీరిని ఆదాయ వనరుగా మార్చుకున్న పెద్దలు..!
వ్యవస్ధలు అన్నీ నిర్వీర్యమయిపోయాయి.
అసలు దోషులెవరో తెలిసిన తర్వాత కూడా ఇంకా ఒదిగి ఉండటం కరెక్టా!?
పోనీ వారిలో మార్పు ఉన్నదా..!?
నిస్సిగ్గు గా మాట్లాడుతున్నారు..!
ప్రజల్ని వెర్రి వెంగళప్పలను చేస్తున్నారు..!
చావో రేవో..!
తేల్చుకోవాలి..!
ఇవాళ గౌతుశిరీష కుండబద్దలు కొట్టి మాట్లాడారు.
గొంతు విప్పండి మిగతా నాయకులు..!
ప్రజల మనసులో ఉన్నది మీ గొంతు ద్వారా బయట పెట్టాల్సిందే!
పుండు ఎక్కడ ఉంటే రచ్చ అక్కడ వెయ్యాల్సిందే!
ఇక్కడ బీజేపి కి స్ధానం లేదని వారి మీద పోరాటం చెయ్యాల్సిన అవసరం లేదని భావిస్తే అసలు కే ఎసరు..!
అవును వారికిక్కడ స్ధానం లేదు కాబట్టి అసలు పట్టించుకోరు.
కాని దేశం ఉంది కదా!?
దేశం దృష్డికి తీసుకెళ్ళాలి కదా..!?

వారి అసలు రంగు బయటపెట్టాలి కదా..!?
ఎన్నాళ్ళిలా..!?
ఉట్టికి మూడు సేకులు తెగినాయి..ఇంకోటి తెగితే ఏమిటి..!?
ఉంటే ఏమిటి?
ఎప్పటి కప్పుడు..మానవహక్కుల ఉల్లంఘన..రాజ్యాంగ ఉల్లంఘన ..దుష్టపాలన..ఆర్ధిక అత్యవసర పరిస్ధితి దేంట్లోనూ కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది.
వారు ఇప్పటికీ కలిసే ఉన్నారు..ఇక ముందూ ఉంటారు.
ఇద్దరినీ కలిపి శత్రు కూటమిగా చూడనంతవరకు..ప్రజల తో పాటు పార్టీలు ఇబ్బంది పడతాయి.
తస్మాత్ జాగ్రత్త!
టీడీపీ నాయకత్వం ఆలోచించుకోవాలి.

adusumilli-srinivasrao
– అడుసుమిల్లి శ్రీనివాసరావు

LEAVE A RESPONSE