– జగన్మోహన్ రెడ్డికి కోటి 40 లక్షల ఓట్లు కేవలం హిందువులే వేశారు
– కర్నాటక తరహాలో ఏపీలోనూ మతమార్పిడి బిల్లు తీసుకురావల్సిందే
– శ్రీపీఠాథిపతి స్వామి పరిపూర్ణానంద
హైదరాబాద్ : హిందువుల పండుగలపై కరోనా, ఒమైక్రాన్ అంటూ షరతులు విధిస్తున్న జగన్ ప్రభుత్వానికి క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ గుర్తుకురావా? కేవలం హిందువుల పండుగలకే వైరస్ గుర్తుకొస్తుందా అని శ్రీపీఠాథిపతి, బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద ప్రశ్నించారు. హిందువుల ఓట్లతో గెలిచిన జగన్, అదే హిందువుల పండుగలపై ఉక్కుపాదం మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.స్వామి పరిపూర్ణానంద మీడియాతో ఏమన్నారంటే..
డెల్టా వేరియంట్ నెపం తో గతంలో హిందువుల పండుగలు పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపరీతమైన ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు ఒమైక్రాన్ నేపథ్యంలో క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి అంక్షలు వర్తించవా?
151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చాయంటే అందులో కోటి 40 లక్షల ఓట్లు కేవలం హిందువులే వేశారు.కానీ ముఖ్యమంత్రి వైఖరి చూస్తుంటే హిందువుల పండుగలకు ఆంక్షలు పెడతారు. విజయవాడలో గుళ్ళు పగలగొట్టుతున్నారు అప్పుడు వీళ్లంతా రోడ్లపైకి వచ్చిన వారే.దేవాదాయ మంత్రి విజయవాడ లో ఉండి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు.
ప్రతి జిల్లాలో పథకం ప్రకారం దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంతర్వేది రథం కాల పెడితే వాళ్ళ గుడ్డలూడదీయాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఇలాంటి పనులు చేస్తే యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తున్నారు. రామతీర్థం లో దేవుడి తల తొలగిస్తే చూసీచూడనట్లు వ్యవహరించారు.మీకు హిందువుల ఆవేదన తెలియడం లేదా ఎందుకు ప్రతిస్పందించడం లేదు?
వేయి కాళ్ల మండపం పునరుద్ధరిస్తామని జీయర్ స్వామి సమక్షంలో చెప్పారు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదు?హిందువుల అంటే మీకు గొర్రెల లాంటి భావన మీరు అది మార్చుకోండి పింక్ డైమండ్ గురించి బయట పెట్టండి. టిటిడి లో నిరాషి వ్యవస్థలో ఉన్న వ్యక్తుల్ని మీరు ఉద్యోగులు గా మార్చారు అంటే మీ కాళ్లు పట్టుకుంటా కూర్చోవాలా?
తిరుమలలో వెంకటేశ్వరుడే గొప్ప కోటీశ్వరుడు కాదు.తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరునిది మాత్రమే. వకుళమాత గురించి పోరాటం చేస్తే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించి మంచి ఆలయాన్ని నిర్మించారు. దానికి మనసా వాచా కర్మణా అభినందిస్తున్నాను.క్రైస్తవ మహ్మదీయ సమాజాన్ని నేనెప్పుడు విమర్శించను. టీటీడీ లో డబ్బులు విపరీతంగా పెంచుతున్నారు. సేవల పేరుతో డబ్బులు వసూలు చేసి వేరే వాటికి పెట్టకండి. ఆస్పత్రులు విద్యాలయాలు రోడ్లు నిర్మించాలంటే వేరే సొమ్ము తో పెట్టండి టిటిడి సొమ్ముతో నిర్మించమని ఆగమ శాస్త్రం లో ఎక్కడా లేదు.
గోమాత వెంకటేశ్వర స్వామికి పాలిచ్చి పోషించింది. టీటీడీ ఈవో కానీ, పాలకవర్గం కానీ గోవధను ఆపమని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కోరడం లేదు?గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి.ఏపీలో కొన్ని శక్తులు విపరీతమైన డబ్బు ఖర్చుపెట్టి మతమార్పిడులు చేస్తున్నారు. హిందువులు నమ్మి మీకు ఓట్లు వేశారు మీరు వాళ్లని మోసం చేస్తున్నారు.మతమార్పిడులు చేసేవారిని మీరు ఎందుకు అడ్డుకోవడం లేదు?కర్ణాటకలో మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం చేశారు. మీరు ఏం చేస్తున్నట్టు?
పింక్ డైమండ్ దొంగిలించిన వారిని మీరు ఎందుకు పట్టుకోవడం లేదు మీకు సమర్థత లేదా?విజయవాడలో పగలగొట్టిన గుళ్ళను ఎప్పుడు పునర్నిర్మిస్తారో చెప్పాలి.తిరుమలలో కోటీశ్వరుల కు సేవలు ఆపకపోతే ,పరిపూర్ణానంద తిరుమల నుంచి తాడేపల్లి వరకు పాదయాత్ర చేసి సెగ పుట్టిస్తాడు. మీ పద్ధతులు మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో గడపగడపకు తిరిగి మీరు చేసే అరాచకాలు గురించి బయట పెట్టాల్సి వస్తుంది.
హిందూ వ్యతిరేక శక్తుల పట్ల కనికరం చూపించకుండా వ్యవహరించాలని జగన్మోహన్రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. మా మాటలను పెడచెవిన పెడితే ఆంధ్రరాష్ట్రంలో హిందూ సునామీని చూస్తారు.క్రిస్మస్ రోజునే ఈ పనులకు శ్రీకారం చుట్టండి.బిజెపి కోరితే కొన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించాను. త్వరలో యూపీలో కూడా ఆ పార్టీ తరఫున కార్యక్రమాల్లో పాల్గొంటాను. కానీ ఏపీ లో జరుగుతున్న పరిణామాలను రాజకీయ కోణంలో కాకుండా, హిందుత్వ అజెండాతో పోరాటం చేస్తాను. నా పోరాటంలో ఏ రాజకీయ పార్టీ నాయకులు వచ్చిన కలుపుకొని పోతాను. రాజకీయాలు వేరైనా భక్తి మాత్రం అందరికీ ఉంటుంది.