– అది జగన్ సొంత మీడియా చందాల కోసమేనా?
– గ్రామసచివాలయాలకు పేపర్లు రావా?
రాష్ట్రంలో ఉండే రెండు లక్షల 66 వేల మంది వాలంటీర్లకు, నెలకు 200 రూపాయలు లెక్కన ఇచ్చి పేపరు కొన్ని చదువుకొనుటకు జగన్ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం.. న్యూస్ పేపర్లలో స్కీములు గురించి ఇతర పార్టీల నాయకులు ,ప్రజలు రకరకాల విమర్శలు, కామెంట్లు చేస్తుంటారు వాటిని తిప్పికొట్టుటకు వాలంటీర్లకు సమాచారం కోసం, పేపర్లు కొని చదవరు. కాబట్టి పేపర్ కొనుటకు ఇస్తున్నామని అర్థం వచ్చేటట్టుగా చెబుతున్నారు .
అయితే విమర్శలు అనేవి రకరకాల పేపర్లలో రకరకాలుగా వస్తుంటాయి. మరి మీరు ఇచ్చిన 200 రూపాయలను ఎన్ని పేపర్లు కొ ని చదవాలి? సాక్షి పేపర్ ఒకటే కొంటే సరిపోతుందా? అన్ని పేపర్లు చదవాలంటే నెలకు 200 రూపాయలు సరిపోతాయా? మరేం చేయాలి ?
నిజంగా ప్రభుత్వానికి వాలంటీర్లకు పేపర్లలో స్కీముల మీద వచ్చిన విమర్శనాత్మక విషయాలు తెలియాలంటే.. మీరు పెట్టిన సచివాలయ వ్యవస్థ ఒకటి ఉందికదా? ఆ సచివాలయంలో ప్రముఖంగా ఉండే మూడు నాలుగు పేపర్లు వేయిస్తే, ప్రతిరోజు సచివాలయం కు వాలంటీర్ పోయి వచ్చే అవసరము వ్యవస్థ ఉంది. అక్కడ చదువుకుంటారు. మరి ఈ విధంగా ఎందుకు ఆలోచించరు ? దీనిని బట్టి చూస్తే మీ సాక్షి పేపర్ కు రాష్ట్ర మొత్తం 2,66,000 సబ్స్క్రిప్షన్ పెరిగే దానికోసం చేస్తున్నారా అనిపిస్తుంది.
50 కుటుంబాలకు ఒక వాలంటరీ అవసరమా? వాలంటీర్లకు ఖర్చు ప్రభుత్వం చెప్పే దాని ప్రకారం సంవత్సరానికి 1930 కోట్లు ఖర్చు అవుతుంది .గతంలో ఉన్న ప్రభుత్వాలు మీరు ఇస్తున్న ఈ నవరత్నాలు పేర్లు మారాయి తప్ప, సుమారుగా అదే రకమైన సంక్షేమ పథకాలు అందుతూనే ఉన్నాయి. ఈ వాలంటరీ వ్యవస్థ లేనప్పుడు కూడా ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ, వెనుక ముందు అందుతూనే ఉన్నాయి. ఆ రోజున గ్రామ విఆర్ఓ లకు, విలేజ్ అసిస్టెంట్లకు, వీడివోలకు ఎక్కువ పని ఉండేది. ఈరోజున వారికి పని తగ్గిపోయింది . వాస్తవంగా పని చేసినా చేయకపోయినా, పని ఉన్నా లేకపోయినా, వాలంటరీ అనే మనిషి ఇంకొక పనికి పోక, చేసుకోలేక మీరిచ్చే 5,000 రూపాయలు సరిపోక, అవినీతికి పాల్పడుతున్న సంఘటనలు ఈ మధ్య రోజులో వస్తున్నాయి. కొత్తగా చెత్త పన్ను వాలంటరే వసూలు చేస్తున్నారు. దానికి రసీదులు అన్నిచోట్ల ఇవ్వడం లేదు.
ఈ వాలంటరీ వ్యవస్థ వైయస్ఆర్సీపీ పార్టీకి బూత్ లెవెల్ కార్యకర్త లాగా, ప్రభుత్వ డబ్బుతో, అధికారికంగా వాడుకుంటున్నారు . పట్టణాలలో, సిటీలలో ఒక్కొక్క అపార్ట్మెంట్లోనే 30, 40, 50 ఇండ్లు కూడా ఉన్నాయి. మరి వాటికి మీరు ఇచ్చే సహాయం ఏమిటి ? వారికి ఈ వాలంటీర్లు రోజు వెళ్లి ఏమి సేవలు చేస్తారు ?
మీరు చెప్పినట్టుగా నవరత్నాలు స్కీములు పెట్టినప్పుడు.. ఎన్రోల్మెంట్ కోసం, తదితర అవసరాల కోసం పెట్టుకున్నాము అని భావించిన.. జరుగుతున్న రోజు వారి కార్యక్రమాలలో వారి అవసరం పెద్దగా అవసరం లేదనిపిస్తుంది. ఇదంతా పరికించి చూస్తే.. కేవలం వైఎస్సార్సీపీ పార్టీకి బూత్ లెవెల్ కార్యకర్తలా, ఎక్కువ ఉపయోగించుకునే దానికోసం వీరిని కొనసాగిస్తున్నారు అనే అనుమానం ప్రజలకు కలుగుతుంది.
అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ ఆర్థిక కట్టుబాట్లు చేయకపోతే, ఇప్పటికే ఈ రాష్ట్రం ఏడు లక్షల కోట్లు అప్పుల పాలైపోయింది. ఇంకా ఇంకా అప్పుల పాలయ్యే అవకాశం ఉంది .
కరణం భాస్కర్
బిజెపి ,
మొబైల్ నెంబర్ 7386128877 .