-మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి
అబద్ధాలకోరు బాబు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార బాధ్యతలు చేపట్టిన నాటినుంచి మా మేనిఫెస్టోను సంపూర్ణంగా సమగ్రంగా అమలు చేస్తున్నారు. ఎక్కడైనా సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పథకాలు లబ్ధిపొందలేని కుటుంబాల కోసం ముఖ్యమంత్రి ‘జగనన్న సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేపట్నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతోన్న తరుణంలో దీనిపై చంద్రబాబు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. మరి, ఈ సందర్భంలో చంద్రబాబు ఎంత నీతిమాలినవాడో.. ఎంత అబద్ధాలకోరనేది అందరూ తెలుసుకోవాల్సి ఉంది.
సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ లో చేరింది 1992లో.. బాబు అప్పటికి సీఎ కాలేదు
– ఆధారాలతో సహా మీడియా ముందు వీడియోను ప్రదర్శించిన మంత్రి కాకాణి
చంద్రబాబు ఎంత అబద్ధాలకోరు అనేదానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ రావడం, అందులో పనిచేయడానికి సత్య నాదెళ్ల అక్కడ చేరబట్టే ఆయన సీఈవో స్థాయికి ఎదిగారని.. ఇది తన గొప్పతనమని చంద్రబాబు పదే పదే చెబుతుంటారు. నా వల్లే, నా వల్లే.. సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సీఈవో అని డప్పాలు కొట్టుకుంటారు.
– ఇందులో నిజనిజాల్ని పరిశీలిస్తే.. సత్యనాదెళ్ల 1992లో సన్‌మైక్రోసిస్టమ్ కంపెనీ నుంచి మైక్రోసాఫ్ట్‌లో చేరారు. అప్పట్లో ఈ చంద్రబాబు ఎక్కడున్నారో అందరికీ తెలుసు కదా..? అప్పటికింకా ఆయన సొంతమామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు కూడా పొడవలేదు. మామను వెన్నుపోటు పొడిచాకే కదా.. బాబు ముఖ్యమంత్రి అయ్యింది. ఎన్టీఅర్ ను వెన్నుపోటు పొడిచి, బాబు అధికారంలోకి వచ్చింది 1995 సంవత్సరంలో. 1992లోనే మైక్రోసాఫ్ట్‌లో చేరిన సత్యనాదెళ్లను పట్టుకుని.. బాబు తన వల్లే అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం..?
-మరొక అంశం- 1999లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు వస్తే.. 2004లో పనులు ప్రారంభించింది. 2004లో హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ప్రారంభమైతే.. 1992లో ఆ కంపెనీలో చేరిన సత్య నాదెళ్ళ.. తన వల్లే అతను ఆ స్థాయికి వచ్చాడని చెప్పడం అంతే.. ఇంతకంటే సిగ్గుమాలినతనం మరొకటి ఉంటుందా..?. ఇలా చెప్పుకోవడం ఎంత దారుణమైన విషయం. బాబు నోరుతెరిస్తే అబద్ధాలే వినిపిస్తాయి అనేందుకు ఇదొక ఉదాహరణ. సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ లో ఎప్పుడు చేరారు.. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు ఎప్పుడు వచ్చింది..? అన్న విషయాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను మంత్రి మీడియా ముందు ప్రదర్శించారు.
ఇంగ్లీషు నేర్పించడం నేరామా బాబూ..?
నిలువెత్తు అబద్ధానికి ప్రతిరూపం చంద్రబాబు. బాబు కంపునోరుతో పలికే ప్రతీ మాట కూడా నాది.. నేను.. నా ప్రతిభ.. నా గొప్ప అంటూ వినిపించేదే.. సెల్‌ఫోన్ నేనే కనిపెట్టానంటాడు. ఆనాడు వాజ్‌పేయ్‌ని ప్రధానిని నేనే చేశానంటాడు. ఇదిలాఉంటే, చంద్రబాబు అప్పుడప్పుడూ తెగ ఇంగ్లీషు మాట్లాడతాడు కదా..? ఓటుకు నోటు కేసు సందర్భంలో ఆనాడు లీకైన ఆడియోలో ‘మనవాళ్ళు బ్రీఫ్డ్‌మీ..’ అంటూ నొక్కినొక్కి చెప్పాడుకదా..? (ఆ వీడియో ప్లే చేసి చూపారు)
– ఆ నాలుగు మాటలు ఆయనకు రాబట్టే కదా.. ఆరోజు ఎమ్మెల్సీతో కమ్యూనికేట్ చేయగలిగాడు కదా..? అంటే, నువ్వు ఇంగ్లీషు భాష అవసరాన్ని గుర్తించావు. మరి, నీ నోటినుంచి వచ్చే ఇంగ్లీషుకు అంతర్జాతీయ ఉద్యోగాలొస్తాయా..?
– కాబట్టి, ప్రతి ఒక్కరికీ ఇంగ్లీషు భాష వచ్చి ఉండాలి. ఇంగ్లీషును బాగా మాట్లాడగలిగి ఉండాలి. ఆ తపన , తాపత్రయం కలిగిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
అందుకే, ఆయన ప్రతీ విద్యార్థి ఇంగ్లీషు నేర్చుకుని ఆ భాషలో మాట్లాడగలగాలని రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాల్లో అమలు చేశారు. అయితే, ఇంగ్లీషు మీడియం చదవటమే.. పెద్ద అపరాధమన్నట్టు.. ఇంగ్లీషు విద్య మన పిల్లలకు నేర్పరానిదంటూ చంద్రబాబు విమర్శించడం ఆయన నీచస్థితిని తెలియపరుస్తుంది. ఆయన ఇంతగా దిగజారడం చాలా దురదృష్టకరం.
బాబు దృష్టిలో మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్ట
టీడీపీ ఆఫీసులో నిన్న ఓ పదిమందిని కూర్చోబెట్టి, ప్రెస్‌మీట్ పెట్టి వైఎస్‌ఆర్‌సీపీపై మేనిఫెస్టోపై ఛార్జిషీట్ విడుదల చేశామంటున్నారు. అసలు, ఛార్జిషీట్‌లు పెట్టడానికి మీరెవరు..? మా మీద, మా ప్రభుత్వ పనితీరుపై ఛార్జిషీట్ విడుదల చేయడానికి మీకు ఏ అర్హత ఉంది…? మీలా మేము మ్యానిఫెస్టోను విడుదల చేసిన తర్వాత అమలు చేయకుండా వదిలేయలేదు కదా..? మేం మీలా మ్యానిఫెస్టో ప్రకటించి వెబ్‌సైట్‌లో నుంచి మాయం చేసిన నీచ చరిత్ర మాదికాదు కదా..?
అప్పట్లో మీరు రిలీజ్ చేసిన యాడ్స్‌ను యూట్యూబ్‌లోనుంచి తొలగించిన నీచులం మేము కాదు కదా. ఆనాడు మీరు 650 వాగ్దానాలు ఇస్తే.. అందులో 10 శాతం కూడా అమలు చేయలేకపోయారే.? కనీసం, బాబు ప్రకటించిన మ్యానిఫెస్టో అంశాలు ఆయన హయాంలో పనిచేసిన ఎమ్మెల్యేలకు అయినా తెలుసా.. ? అబద్దాల లోకేశ్‌కైనా తెలుసా..? మీ దృష్టిలో మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్ట. ప్రజల్ని మభ్యపెట్టి మాయచేసే బురిడీ కాగితాల కట్టగా చెప్పుకోవాలి.
మేనిఫెస్టోను పవిత్రంగా అమలు చేస్తున్నాం
మా మేనిఫెస్టోను ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీతగా పవిత్రంగా భావిస్తూ, దాన్ని పట్టుకుని మా పార్టీ నేతలు ధైర్యంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రతీ గడప గడపకు తిరిగాం. ఇదిగో మా మేనిఫెస్టో అని గడప గడపకూ చూపెట్టాం. మీ కుటుంబంలో ఉన్న వారి అర్హతల ప్రకారం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నాం.. ఇంకా ఏమైనా సాంకేతిక కారణాలతో పథకాలు ఆగితే వాటిని సైతం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా అందజేస్తామని ప్రజలకు చెప్పాం. బాబు మాదిరిగా ప్రజలకు మేనిఫెస్టో పేరుతో ఎరవేసి ఓట్లు దండుకుని.. అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయకుండా మాయం చేసే నీచచరిత్ర వైఎస్‌ఆర్‌సీపీకి లేదు అని మేం స్పష్టం చేస్తున్నాం.
మేనిఫెస్టో అమలుపై కుప్పం, టెక్కలిలో చర్చకు సిద్ధమా..?
ఏనాడైనా చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోను తీసుకుని వారి నాయకులు ఇంటింటికి తిరిగారా..? పోనీ, అధికారంలోకొచ్చాక వాటిని పూర్తిగా అమలు చేసి ప్రజామద్ధతు పొందగలిగారా..? ఈరోజు మేం గర్వంగా నవరత్నాల పథకాలు అమలు చేస్తూ.. మేనిఫెస్టో గౌరవాన్ని పెంచామని చెబుతున్నాం. అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా, 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వడంతో పాటు 25 లక్షలమందికి ఇళ్లు కట్టిస్తున్న పథకాలు నవరత్నాల్లో ఉన్నవి కావా..? వాటిని అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందివ్వడం లేదా..?
ఈ సందర్భంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడుకు ఒక సవాల్ విసురుతున్నాను. రాష్ట్రంలో మీకు నచ్చిన నియోజకవర్గానికైనా.. లేదంటే, బాబు పోటీచేసే కుప్పంలోనైనా.. అచ్చెంన్నాయుడు గెలిచిన టెక్కలికైనా పోదాం. టీడీపీ హయాంలో జరిగిన మేలు గురించి.. ఇప్పుడు మా ప్రభుత్వం తరఫున అందించిన నవరత్నాలపై ప్రజలను కలిసి అడుగుదాం. బాబు, అచ్చెన్నాయుడుకి చీమూనెత్తురూ ఉంటే నా సవాల్‌ను స్వీకరించాలి.
మీ హయాంలో ఏం మేలు జరిగిందో.. మేం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రజలకు ఏం మేలు జరిగిందో చర్చిద్దాం. వస్తారా..? ఇందుకు మీరు సిద్ధపడితే .. మీరే కనుక ప్రజలతో మాట్లాడి ఈ విషయాల్ని అడిగితే.. మీ మొఖాన ప్రజలే ఉమ్మెస్తారనేది ఖాయం. కనుక, ఇప్పటికైనా బాబు నోరు కడుక్కుని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అమలు చేసే నవరత్నాలు, జగనన్న సురక్షపై మాట్లాడితే మంచిది.
బిందుసేద్యంపై దొంగ దోకేశ్ తన తండ్రిని చర్చకు పంపాలి
అట్టర్ ఫెయిల్యూర్ యాత్ర చేస్తున్న లోకేశ్‌ను ఇకనుంచి దొంగ దోకేశ్ అని పిలవాల్సిందే. అతను నిన్న ఒకచోట సెల్ఫీ తీసుకుంటూ బిందుసేద్యంపై మాట్లాడాడు. ఈయన తండ్రి చంద్రబాబు హయాంలో సూక్ష్మసేద్యానికి రూ.1250 కోట్లు ఖర్చుపెడితే.. మా ప్రభుత్వం పక్కనబెట్టిందని మాట్లాడాడు. ‘అయ్యా.. దొంగ లోకేశం.. ఈలెక్కలు నీ తండ్రి బాబు చెప్పాడా..? నువ్వు చెప్పిన అబద్ధాలా..?. నీ తండ్రి అధికారంలో నుంచి దిగిపోయేనాటికీ రూ. 800 కోట్ల 16 లక్షలు బాకీపెట్టాడు.
అయితే, మేం అధికారంలోకొచ్చాక మీ తండ్రి బకాయి పెట్టిన రూ.8 వందల కోట్ల 16 లక్షలతో పాటు మేం మరో రూ.1289 కోట్లు బిందుసేద్యానికి సంబంధించి రైతులకు అందించడం జరిగింది. అంటే, దాదాపుగా రూ. 2 వేల కోట్ల 89 లక్షలు ఖర్చుపెట్టడం జరిగింది. ఈ గణాంకాలపై దొంగ దోకేశ్ దమ్మూధైర్యం తెచ్చుకుని అతని తండ్రి చంద్రబాబును చర్చకు పంపాలని కోరుతున్నాను. ఎందుకంటే, కేరాఫ్ అడ్రస్ లేని వ్యక్తిగా ఉన్న దొంగ దోకేశ్‌కు చర్చకు ఛాలెంజ్ విసిరి నా స్థాయిని నేను తగ్గించుకోలేను. యువగంగాళం యాత్ర నెల్లూరు జిల్లా దాటి వెళ్లేలోపు ఈ దొంగ దోకేశ్ అతని తండ్రిని చర్చకు పంపాలి.
బిందుసేద్యంపై కేంద్ర అవార్డు సంగతి తెలుసుకో..
ఒరే పిచ్చోడా.. దొంగ దోకేశా.. నువ్వు తెలుసుకోవాల్సిన రాజకీయ పరిజ్ఞానం చాలా ఉంది. అదేమంటే, నీ బాబు హయాంలో ఏం జరిగింది..? మా ప్రభుత్వం వచ్చాక ఏం జరుగుతుందనేది తెలుసుకో.. నువ్వు బిందుసేద్యంపై మాట్లాడేటప్పుడు మేం పెట్టిన నిధుల వెచ్చింపునకు సంబంధించి స్వయాన కేంద్రప్రభుత్వమే బిందుసేద్యంపై అవార్డును అందించిందన్న సంగతి తెలుసుకో.. అని చెబుతున్నాను.
ఈ రాష్ట్రంలో 10 జిల్లాల్లో బిందుసేద్యం అమలు చేస్తే.. నాలుగు జిల్లాలకు సంబంధించి కేంద్రం మాకు అవార్డును ప్రకటించింది. అందులో అనంతపురం, సత్యసాయి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాలకు సంబంధించి మా ప్రభుత్వానికి అవార్డు దక్కింది. మరి, ఈ సందర్భంగా బాబును ఒక విషయంపై ప్రశ్నిస్తున్నాను. నీ కొడుకు దోకేశం చెప్పే అబద్ధాల్ని పరిగణలోకి తీసుకోవాల్నా..? లేదంటే, తెలిసీ తెలియక మాట్లాడే నీ కొడుకు మాటల్ని లైట్‌గా తీసుకోండని చెబుతావా బాబు..? అని నిలదీస్తున్నాను.
99.5శాతం హామీల్ని అమలు చేసిన ప్రభుత్వం మాది
రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయ చరిత్ర పరిసమాప్తమైపోయింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మ్యానిఫెస్టోలో చెప్పిన పథకాలలో 99.5 శాతం అమలు చేశారు. మిగతా ఒక్కశాతం కూడా అర్హులైన వారికి నవరత్నాల లబ్ధి జరగాలనే తపనతో ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో సంక్షేమ పథకాల్ని సమగ్రంగా అమలు చేయడం, వివిధ సర్టిఫికేట్ల జారీ కోసం మొత్తం 2.60 లక్షల మంది గ్రామ వాలంటీర్లు, 1.50 లక్షల మంది సచివాలయ సిబ్బందితో పాటు 3వేల మంది మండలస్థాయి అధికారులు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు.
వీరు ప్రతీ గడప గడపకు వెళ్లి జగనన్న సురక్ష యాప్‌లో సమాచారం సేకరించడం, ప్రతీ సచివాలయ పరిధిలో క్యాంప్‌లు నిర్వహిస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా 15వేల క్యాంపులు పెడుతున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ మేలు కలిగేందుకు ఈ జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుంది. ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.