మొఘలుల కాలం నాటి వక్ఫ్‌ చట్టాలు మనకు అవసరమా?

-వక్ఫ్ చట్టం – రాజ్యాంగబధ్ధత
-మత ప్రాతిపదికన ఏర్పడ్డ దేశాలలో లేని వక్ఫ్ బోర్డు వంటివి సెక్యులర్ దేశంలో ఎందుకు?
-జ్యుడీషియరీకి ప్రమేయం లేని అధికారాలు ఇవ్వడం ముమ్మాటికీ రాజ్యాంగ వ్యతిరేకమే
-ఏ మతానికీ లేని అమితమైన, అంతులేని అధికారాలను కాంగ్రెస్ కేవలం ముస్లిమ్స్ కు మాత్రమే ఎందుకు ఇచ్చింది?
-ముస్లిమ్ భర్తలనుండి విడాకులు పొందిన మహిళల భారం ఈ దేశ ప్రజలదా?
-దేశ ప్రజల పన్ను నుంచి వారికి డబ్బులు చెల్లిస్తారా?

ఈ వక్ఫ్ అనేది మొఘలుల కాలంలో మన దేశంలో మొదలయిందంటారు. బాగా సంపన్నులైన ముస్లిమ్స్ నుండి విరాళాలు తీసుకుని, పేదలైన ముస్లిమ్స్ కు విద్య, వైద్యం, గృహ సదుపాయం వగైరాలు కల్పించేందుకు ఈ వక్ఫ్ అనేది మొదలయింది.

ఇప్పుడు ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం చూద్దాం. దేశ విభజన అనంతరం పాకిస్థాన్ కు వలస వెళ్ళిన మహమ్మదీయుల ఆస్తులను రక్షించి, వారి ఆస్తులను కాపాడి, వాటిని సక్రమంగా వినియోగించేందుకు, వాటిపై వచ్చే ఆదాయాన్ని సద్వినియోగం చేసేందుకు ఈ చట్టం చేసారు.

అంతకు ముందు 1913 లో ఈ వక్ఫ్ ఆస్తి మీద తగాయిదా వచ్చినప్పుడు, కేసు ప్రైవీ కౌన్సిల్ దాకా వెళ్ళింది. అక్కడి న్యాయమూర్తులు ఈ చట్టాన్ని ‘a perpetuity of the worst kind’ అని కొట్టివేయడం జరిగింది. కానీ అప్పటి ఉమ్మడి భారత్ లోని ముస్లిమ్స్ దానిని అంగీకరించకపోవడంతో అప్పటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం ‘The Musalman Waqf Validation Act’ ను ప్రత్యేకంగా చేసి భారత్ లో వక్ఫ్ కు చట్టబధ్ధత కల్పించింది.

తరువాత దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుండి వలస వచ్చిన హిందువుల ఆస్తులను పాకిస్థాన్, తమ దేశస్థులకు పంచడమో లేక అక్కడి సైన్యానికి అప్పచెప్పడమో జరిగింది. ఇక్కడ నుండి పాకిస్థాన్ కు వలస వెళ్ళిన ముస్లిమ్స్ ఆస్తులను కాపాడి, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద ముస్లిమ్స్ అభివృధ్ధికి ఉపయోగించే ఉద్దేశ్యంతో 1954 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ చట్టం చేసింది. (ఇది Concurrent List లో ఉన్న అంశం కాబట్టి కేంద్రం చేసిన చట్టాలకు రాష్ట్ర స్థాయిలో సవరణలు చేసుకోవచ్చు).

అయితే 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం పాత చట్టాన్ని రిపీల్ చేసి (రద్దు చేసి) కొత్త వక్ఫ్ చట్టాన్ని అమలులోకి తెచ్చింది.ఇంతకుముందు 1991 లో కేంద్రం చేసిన The Places of Worship Act ప్రకారం 1947, ఆగస్టు 15న ఉన్న స్థితినే కొనసాగించాలే తప్ప వాటి మౌలిక స్వరూపాలను మార్చకూడదు.

కానీ 1995 లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం కొత్త వక్ఫ్ చట్టం తీసుకువచ్చింది. ఇందులో వక్ఫ్ బోర్డుకు అనేకమైన అధికారాలను ఇచ్చింది. కానీ కమీషనర్ ను అందరికంటే ఉన్నతమైన స్థానంలో పెట్టింది. అయితే ఇది నచ్చని వక్ఫ్ బోర్డు UPA ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చి, 2009 లో చేసిన సవరణల ద్వారా తిరుగులేని, నిరంకుశమైన అధికారాలు వక్ఫ్ బోర్డు సంపాదించుకుంది. (హిందూ దేవాలయాలలో కమీషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ సర్వాధికారి. కానీ వక్ఫ్ విషయంలో వక్ఫ్ బోర్డు సర్వాధికారి).

దాని ప్రకారం వక్ఫ్ బోర్డు ‘ఫలానా స్థలం లేదా ఆస్తి తమదే’ అని ప్రకటిస్తే చాలు, అది వక్ఫ్ బోర్డు ఆస్తిగా మారిపోతుంది. అది ‘తమదే’ అని ఋజువు చేసుకునే బాధ్యత ఆ ఆస్తి యజమానిదే. ఆ ఆస్తి Immovable కావచ్చు లేదా Movable కావచ్చు. అంటే మీ ఇల్లు, స్థలమే కాదు, మీ డిపాజిట్లు, నగలు కూడా వక్ఫ్ బోర్డు తమవిగా ప్రకటించవచ్చు.

వక్ఫ్ బోర్డు నిర్ణయం యజమానికి వ్యతిరేకంగా వస్తే, వక్ఫ్ బోర్డు ట్రైబ్యునల్ కు వెళ్ళాలే తప్ప, జోక్యం చేసుకునే అధికారం సుప్రీమ్ కోర్టుకు కూడా లేదు. ఆ ట్రైబ్యునల్ లో ఉండేది ముస్లిమ్ మత పెద్ద, స్థానిక MLA లేదా MP, మరొక అధికారి. వీరిలో ఇద్దరు అంగీకరిస్తే చాలు, అది వక్ఫ్ ఆస్తి అయిపోతుంది. ఏ మతానికీ లేని అమితమైన, అంతులేని అధికారాలను కేవలం ముస్లిమ్స్ కు మాత్రమే ఎందుకు ఇచ్చింది UPA?

ఇంతే కాదు. 2014 ఎన్నికలకు ముందు ఢిల్లీలోని 123 ఆస్తులను వక్ఫ్ బోర్డుకు ఒప్పగించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం.(తరువాత వచ్చిన NDA ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుంది). ఇది రాజ్యాంగవిరుధ్ధమైన చట్ట సవరణ. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి తమ మతాన్ని పాటించే, పాలించుకునే హక్కు ఉంది.

కానీ వక్ఫ్ బోర్డుకు, ఇతర మతసంస్థలకు లేని అధికారాలు అప్పటి UPA ప్రభుత్వం అప్పగించడం కేవలం మైనారిటీ ఓట్ల కోసమే లేదా దేశం మొత్తం మీద వాళ్ళ ఆధిపత్యం కలిగించడానికే అనుకోవాలి. మరొక విషయం – దేశంలో సైనిక దళాలు, రైల్వేల తరువాత అత్యధికంగా స్థలం ఉన్నది వక్ఫ్ బోర్డుకే.

2009 లో వక్ఫ్ బోర్డు ఆధీనంలో నాలుగు లక్షల ఎకరాలు ఉండగా, 2013 సవరణ అనంతరం ఆ సంఖ్య 8,54,509 ఎకరాలకు పెరిగింది. తమిళనాడులో 6 గ్రామాలను పూర్తిగా తమ ఆస్తిగా ప్రకటించింది వక్ఫ్ బోర్డు. అందులో 1,500 సంవత్సరాలనాటి హిందూ దేవాలయం కూడా ఉన్నది. ఈ చట్టానికి 2009, 2013 లో చేసిన సవరణలు పూర్తిగా సెక్యులర్ విధానానికి వ్యతిరేకం. రాజ్యాంగంయొక్క బేసిక్ స్ట్రక్చర్ కు వ్యతిరేకం.

మత ప్రాతిపదికన ఏర్పడ్డ దేశాలలో లేని వక్ఫ్ బోర్డు వంటివి సెక్యులర్ దేశంలో ఎందుకు? ఉన్నా జ్యుడీషియరీకి ప్రమేయం లేని అధికారాలు ఇవ్వడం ముమ్మాటికీ రాజ్యాంగ వ్యతిరేకమే. వీటికి తోడు ప్రాంతీయ పార్టీలు వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కట్టపెడతామని చెప్పడం, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పడం రాజ్యాంగ వ్యతిరేకమే కాదు ముస్లిమ్స్ ను మోసం చెయ్యడం కూడా.

ఒక వక్ఫ్ ఆస్తికి ‘ముతావల్లి’ అధికారి. అతడు కేవలం ట్రస్టీ మాత్రమే. అతనికి ఆ ఆస్తిని అమ్మే అధికారం లేదు. ఆ ఆస్తులపై వచ్చే ఆదాయంలో కేవలం 7% మాత్రమే వక్ఫ్ బోర్డుకు చేరుతుంది. మిగిలిన సొమ్ము పేద ముస్లిమ్స్ సంక్షేమానికి ఉపయోగించాలి.

పేద ముస్లిమ్స్ అభివృధ్ధికోసం ఏర్పాటు చేయబడ్డ వక్ఫ్ బోర్డు, రాన్రాను భూకామందుల చేతిలోకి వెళ్ళింది. ఆ స్థలాలలో ఇప్పుడు రియల్ ఎస్టేట్, మాల్స్, విల్లాలు వెలుస్తున్నాయి.వీటివల్ల నష్టపోయేది ముఖ్యంగా దళిత ముస్లిమ్స్, పాస్మందా ముస్లిమ్స్. సంక్షేమ కార్యక్రమాలలో మరొక వైచిత్రి చోటు చేసుకుంది, రాజీవ్ గాంధి హయాంలో. అదేమిటంటే ‘తలాక్’ ద్వారా విడాకులు ఇవ్వబడ్డ ముస్లిమ్ మహిళలకు భరణం వక్ఫ్ బోర్డు ఇవ్వడం.

వక్ఫ్ బోర్డుకు కేవలం 7% మాత్రమే అందుతుంది అని పై పేరాలలో చెప్పుకున్నాం కదా! మరి డబ్బులు లేని వక్ఫ్ బోర్డు భరణం ఎక్కడనుండి ఇస్తుంది? ప్రభుత్వ నిధులు …. అంటే దేశప్రజలందరు కట్టే పన్నులనుండి. ముస్లిమ్ భర్తలనుండి విడాకులు పొందిన మహిళల భారం ఈ దేశ ప్రజలది.

ఈ చట్టంపై, అందులోని వివిధ నిబంధనలపై అనేక హైకోర్టుల్లో దాదాపు 150 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అన్నిటినీ కలిపి విచారించేందుకు సుప్రీమ్ కోర్టు, అన్ని హైకోర్టులను ఆయా పిటీషన్లను తమకు బదిలీ చేయవలసిందిగా ఆదేశించిందని విన్నాను.అయితే ఇక్కడ కూడా వక్ఫ్ బోర్డు వాదన ఒకటే ‘తమ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదు’ అని. (జ్యుడీషియల్ అధికారాలు, ఇస్లామిక్ బ్యాంకింగ్ అనే రెండు పాయింట్ల మీద విడిగా పోస్టు పెడతాను).

ఈ క్రింద ఇచ్చిన సమాచారం మిత్రులనుండి వచ్చినది. (Edited)
ప్రజలారా! తస్మాత్ జాగ్రత్త ….1991 నాటికి అయోధ్య ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతోంది. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గాభరా పడిపోయింది. మహమ్మదీయ పాలకులనేకులు దేశంలోని వేలాది దేవాలయాలను కూలగొట్టి మశీదులుగా మార్చిన సంగతి కాంగ్రెస్ కి బాగా తెలుసు. అయోధ్య ఉద్యమంలో న్యాయం హిందువుల పక్షాన మొగ్గితే భవిష్యత్తులో అనేక మసీదులను హిందువులకు అప్పగించాలన్న డిమాండ్లు పెరుగుతాయనీ కాంగ్రెస్ కి తెలుసు.

అందుకే అప్పటికప్పుడు ఆదరాబాదరాగా ఓ చట్టం చేసి పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇక భవిష్యత్తులో ఎవ్వరూ, ఏ విధంగానూ వివాదాస్పద మశీదుల జోలికి వెళ్లకుండా ఓ రక్షణ కవచాన్ని ముస్లింలకు ఏర్పరిచిందన్నమాట. ఇదే, కాంగ్రెస్ మొదటి నుంచి అనుసరిస్తూ వస్తున్న కుటిల నీతి.

ఈ విధంగానే ఎప్పటికప్పుడు ముస్లిముల అరాచకానికి వెన్నుదన్నునిస్తూ వస్తోంది. హిందువులకు మెత్తని మాటలు చెబుతూ సుతిమెత్తగా వెన్నులోకి బాకు గుచ్చుతోంది. ఎప్పుడు చట్టం చేసిందో, ఏమని చేసిందో కూడా ఎవ్వరికీ పెద్ద తెలియకుండానే ఓ నల్ల చట్టాన్ని, ఓ చీకటి చట్టాన్ని రహస్యంగా రూపొందించేసింది జిత్తులమారి కాంగ్రెస్. ఒక్క కాంగ్రెస్ అనే కాదు దేశంలోని మిగిలిన సెక్యులర్ రాజకీయ పక్షాలదీ అదే తీరు. 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వం మూడో కంటికి తెలీకుండా చేసిన ఆ చీకటి చట్టమే Places of Worship Act.

ఇప్పుడు ఆ చట్టం ఏంటో, ఎంత ప్రమాదకరమైనదో తెలుసుకుందాం. దశాబ్దాలుగా తాతల ముత్తాతల కాలం నుంచి ఉంటున్న ఇల్లు, స్థలం ఇప్పుడు మీది కాదని తెలిస్తే? దానిపై మీకెలాంటి హక్కూ లేదని తెలిస్తే? మీ పరిస్థితేంటి? సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితులే తమిళనాడులోని కొన్ని గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి కారణం, అక్కడి వక్ఫ్ బోర్డ్. తమిళనాడుకు చెందిన రాజగోపాల్ అనే రైతు, చేసిన అప్పులు తీర్చడానికి తాతల కాలంనాటి తన భూమిని అమ్మేయాలనుకున్నాడు.

కొనాలనుకున్న వారు లీగల్ ఒపీనియన్ కి వెళితే, అక్కడ ఊహించని షాక్ తగిలింది. తను అమ్మాలనుకున్న భూమి తనది కాదని, వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉందని, దాన్ని అమ్మడం, కొనడం అసాధ్యమని చెప్పి పంపించేశారు. ఒక్క రాజగోపాల్ మాత్రమే కాదు…. జ్యోతిలక్ష్మి, షణ్ముగన్, పెరియ స్వామి ఇలా ఎన్నో వందల మంది ఇప్పుడిదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నిజానికి తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా దాదాపు 60 వేల వరకూ ఇలాంటి కేసులు కోర్టుల్లో నడుస్తున్నాయి అనేది అధికారిక లెక్కలు చెప్తున్న మాట.

2018లో సున్నీ వక్ఫ్ బోర్డు తాజ్ మహల్ ఉన్న స్థలం మా పేరున వ్రాయండి, మేము తాజ్ మహల్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటామని ప్రభుత్వాన్ని కోరింది. అంతటితో ఆగకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. ఇదే కాదు భారతదేశం మొత్తంలో దాదాపు 8 లక్షల ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డు ఇలాగే తమదని క్లెయిమ్ చేస్తోంది. తిరుచ్చిలోని అనేక గ్రామాల్లో లక్షల ఎకరాల భూములు తమవేనని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తోంది.

అంతే కాదు, ఏకంగా ఇనాం గ్రామం మొత్తం తమదేనని కూడా వక్ఫ్ బోర్డు వాదిస్తోంది. అంటే ఓ గ్రామంలోని మొత్తం భూమి వాళ్ళదేనట. ఇనాం గ్రామం ఒక్కటే కాదు, కేవలం తిరుచిలోనే ఆరు నుంచి ఏడు గ్రామాలు పూర్తిగా తమవేనని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తోంది. అంతేకాదు వక్ఫ్ బోర్డు తమవేనని చెప్తున్న భూముల్లో, గ్రామాలలో 1000 నుంచి 1500 ఏళ్ళ నాటి ఆలయాలు కూడా ఉన్నాయి.

1991 Places of Worship Act ప్రకారం 1991 తర్వాత ఏదైనా మసీదును కూల్చి అక్కడ ఆలయం కట్టడానికి లేదా అంతక ముందు ఎప్పుడో ఆలయం ఉన్నచోట ఆ తర్వాత కాలంలో మశీదు కట్టారని చెప్పి, ఆ ప్రాంతాన్ని తిరిగిచ్చెయ్యాలని కోరే అధికారం హిందువులకు లేదు. ఈ చట్టంలో ఆ విషయం స్పష్టంగా ఉంది.

పీవీ నరసింహారావు హయాంలోనే జరిగిన ఇంకో భయంకరమైన విషయమేంటంటే… 1995లో వక్ఫ్ బోర్డు చట్టంలో కూడా ఓ మార్పు జరిగింది. ఈ చట్టంలోని సెక్షన్ 40, క్లాజ్ 3 ప్రకారం, ఏదైనా ట్రస్ట్ భూమిని కానీ, మతం భూమిని కానీ, అఖాడా భూమిని కానీ, ఏదైనా సరే, వక్ఫ్ గనక ఆ భూమి తమదేనని క్లెయిమ్ చేస్తే, ఆ భూమి ఎలాంటి అడ్డంకి లేకుండా వక్ఫ్ బోర్డుకే చెందుతుంది. దీనిపై ఎవరూ సివిల్ కోర్టులో కూడా ఎలాంటి పిటిషన్లూ వేయడానికి వీల్లేదు. దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే వక్ఫ్ బోర్డులోనే పోరాడాలి.

అక్కడ బోర్డుకు చెందినవారే, అంటే ఇస్లామిక్ మతానికి చెందిన ఓ అధికారి, ఓ ఎంపీ, తదితరులు కలిసి ఆ భూమిని వక్ఫ్ బోర్డుదా, లేదా పిటిషన్ దారుడిదా అని ఇస్లాం పద్ధతిలో సర్వే చేసి తేలుస్తారు. ఆ తర్వాత వారు ఏది న్యాయం అనుకుంటే, అదే తీర్పు. అదే చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం, ఏదైనా రిజిస్టర్డ్ భూమి వక్ఫ్ బోర్డుకి సంబంధించిందని బోర్డు అధ్యక్షుడు భావిస్తే, వెంటనే ఆ స్థలంలో నివసిస్తున్న వ్యక్తికి షోకాజ్ నోటీసిచ్చి 45 రోజుల్లో ఖాళీ చెయ్యాలని చెబుతారు.

ఒకవేళ ఆ వ్యక్తి ఖాళీ చెయ్యకపోతే, ఎలాంటి అడ్డంకులూ లేకుండా ఆ స్థలాన్ని ఆక్రమించుకునే అధికారం వక్ఫ్ బోర్డుకి ఉంది. విచిత్రమేంటంటే ఈ రెండు చట్టాలూ కాంగ్రెస్ హయాంలో, అది కూడా పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనే అమలులోకి వచ్చాయి. ఇలాంటి చట్టం భారతదేశంలో మరే ఇతర మతానికీ లేకపోవడం గమనార్హం.

వక్ఫ్ ఆగడాలు ఏ ఉత్తరప్రదేశ్ కో, తమిళనాడుకో పరిమితం అయ్యాయి అనుకుంటే పొరపాటు. మన రాష్ట్రంలోనూ….6870 ఆస్తులను వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తోంది. వాటిలో 90 శాతం పైగా ఆస్తులు ఇప్పటికే వక్ఫ్ అధీనంలో ఉన్నాయి. ఉదాహరణకు గుంటూరు బండ్ల బజారులో కన్యకా పరమేశ్వరి అమ్మవారికి చెందిన 100 గజాల స్థలాన్ని వక్ఫ్ బోర్డు తమదంటోంది. ఇక గొడవర్రు గ్రామంలోని జంధ్యాల వసంతమ్మ అమ్మవారికి చెందిన 60 సెంట్లలో, 20 సెంట్లను ఎప్పుడో ముస్లింలు ఆక్రమించి ఖబరస్థాన్ గా మార్చేశారు. ఇక మిగిలిన దానిలో 10 సెంట్లు రోడ్డు నిర్మాణంలో పోయింది. మిగిలిన 30 సెంట్లలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ముక్కలు చేసి, పక్కనే ఉన్న బావిలో పడేసి, రాత్రికి రాత్రి ఆ బావిని పూడ్చేశారు. అక్కడ వాయువేగంతో ఓ మసీదును కూడా నిర్మించారు.

అయితే స్థానిక హిందువులు, ముఖ్యంగా అక్కడి అరుంధతీయులు తిరగబడి రాత్రికి రాత్రి ఆ మసీదును కూల్చేశారు. దానిని ఆనుకుని ఉన్న రెండెకరాల భూమిని కూడా ముస్లింలు తమదిగా క్లెయిమ్ చేస్తున్నారు. నిజానికి ఆ భూమి కూడా జంధ్యాల వసంతమ్మ అమ్మవారిదే. అలాగే కొండపాటూరులో హిందువులు కృష్ణాష్టమి జరుపుకునే 14 సెంట్ల భూమిని కూడా వక్ఫ్ బోర్డ్ తనదిగా క్లెయిమ్ చేస్తోంది. వినుకొండలో 108 ఎకరాల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం మాన్యాన్ని కూడా వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉంది.

మంగళగిరిలో లక్ష్మీ నరసింహ స్వామి మాన్యం భూమి మూడు ఎకరాల పై కూడా వక్ఫ్ బోర్డు కన్నేసింది. అలాగే చీరాలలోని 550 గజాల శివాలయం స్థలం కూడా ప్రస్తుతం వక్ఫ్ స్వాధీనంలో ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలోనూ వక్ఫ్ కబ్జా చేసిన దేవస్థానం భూములున్నాయి.

ఇంకో తమాషా విషయమేమిటంటే…. సుబ్రమణ్య స్వామికి వైశాఖుడు, విశాఖుడు అని పేరు. ఆ పేరు మీదనే విశాఖపట్నం అనే పేరు వచ్చింది. కానీ ఇప్పుడు ముస్లింలు ఒక విచిత్రమైన వాదనని ముందుకు తీసుకొస్తున్నారు. విశాఖని ఇసాక్ అని మహమ్మదీయుడు పరిపాలించాడని, దాని కారణంగానే విశాఖకు ఇసాక్ పట్టణ్ అనే పేరు రాగా, కాలాంతరంలో హిందువులు దానిని విశాఖ పట్టణంగా మార్చుకున్నారని ఓ కొత్త వాదాన్ని సృష్టించి, విశాఖకు చెందిన ఓ రాణి గారి 80 ఎకరాలను తమదిగా క్లెయిమ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదీ ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ బోర్డు ఆగడాలు. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకే చంద్రబాబు జ్యుడీషియల్ పవర్స్ ఇస్తానంటున్నారు. ఇప్పుడే కాదు, 2018లోనే వక్ఫ్ క్లెయిం చేసిన ఆస్తులను వారికి దఖలు చేస్తూ G.O తెచ్చిన ఘనత కూడా చంద్రబాబుదే. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నట్టు, వక్ఫ్ బోర్డుకు కనుక జ్యుడీషియల్ పవర్స్ ఇవ్వడమంటూ జరిగితే….. ఈ రాష్ట్రంలోని హిందువులు తమకు తాముగా వంద అడుగుల గోతిలో దిగినట్టే.

హిందూ దేవాలయాలను కూల్చి, దేవీ దేవతల విగ్రహాలను పగులగొట్టి, రథాలను తగులబెట్టి హిందువులను, వారి విశ్వాసాలను రకరకాలుగా అవమానపరచిన వారిని ఒక్కరంటే ఒక్కరిని కూడా అరెస్టు చెయ్యలేదు.రాష్ట్ర వ్యాప్తంగా మతమార్పిడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయ్. మతమార్పిడి మాఫియా మునుపెన్నడూ లేనంతగా చెలరేగుతోంది.

తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఈయన అని కాదు. ఇట్స్ వెరీ క్లియర్. మనం ఇప్పుడు సరిక్రొత్త ప్రత్యామ్నాయం దిశగా ఆలోచించడం ముఖ్యం. ఆ ప్రత్యామ్నాయం హిందువుల హక్కుల రక్షణకు కట్టుబడి ఉన్న పార్టీ మాత్రమే. మనం ఇప్పుడు ప్రాధాన్యమివ్వాల్సింది వాళ్ళ స్వలాభం కోసం మనల్ని పిచ్చివాళ్ళను చేసే కుల నాయకులకో, ఉచిత పథకాలిచ్చి మనల్ని బిచ్చగాళ్ళను చేసి రాష్ట్రాన్ని మరో శ్రీలంకగానో, వెనుజులాగానో మార్చే నాయకులకో కాదు.

దేశం యొక్క, రాష్ట్రం యొక్క దీర్ఘ కాలిక ప్రయోజనాలకు పెద్ద పీట వేసే, మన పిల్లల, మన భావితరాల భవిష్యత్తుకు రాచబాట వేసే, జాతీయ భద్రతకు, అభివృద్ధికి పెద్దపీట వేసే రాజకీయ పార్టీకి. ఓటేసే ముందు అదేంటో ఒక్కసారి ఆలోచించి ఓటేద్దాం. మన భవిష్యత్తుకు, మన పిల్లల, భావి తరాల రక్షణకు భరోసాగా నిలుద్దాం.

– ఏ.మురళీకృష్ణ
న్యాయవాది
9866881262