Suryaa.co.in

Andhra Pradesh

మీకు మీ మీద, మీ కుమారుడి మీద ఆ నమ్మకం ఉందా?

-2024లో మీ సొంత పుత్రుడిని నమ్ముకుని ఎన్నికల్లోకి దిగుతారా? లేక దత్తపుత్రుడితో దిగుతారా?
– మీకు మీ మీద, మీ కుమారుడి మీద ఆ నమ్మకం ఉందా?
– తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్‌ వి.విజయసాయిరెడ్డి

ప్రెస్‌మీట్‌లో వి.విజయసాయిరెడ్డి ఇంకా ఏం చెప్పారంటే..:
అభివృద్ధి వికేంద్రీకరణ పార్టీ సిద్ధాంతం:
మా వైయస్సార్‌సీపీ సిద్దాంతం అభివృద్ధి వికేంద్రీకరణ. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఏ ఒక్క ప్రాంతం కూడా వెనకబడి ఉండకూడదు. అందుకు అనుగుణంగానే మూడు ప్రాంతాల్లో జాబ్‌ మేళాలు. రేపు (16వ తేదీ, శనివారం) తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం మొదలువుతోంది. ఆదివారం కూడా కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత ఈనెల 23, 24 తేదీలలో విశాఖలో, ఏప్రిల్‌ 30, మే 1న నాగార్జున యూనివర్సిటీలో జాబ్‌మేళా నిర్వహిస్తాం.

రికార్డు సృష్టించిన సీఎం:
రాష్ట్ర చరిత్రలోనే ఒక విప్లవం. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కూడా పూర్తి కాకముందే, ఆయన ఒక రికార్డు సృష్టించారు. ఒక విప్లవంగా 35 నెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలు కల్పించారు. నేరుగా 2.5 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు, ఆర్టీసీకి చెందిన దాదాపు 52 వేల ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది. ఇంకా 2.6 లక్షల వలంటీర్లు, ఆప్కొస్‌ ద్వారా 95 వేల ఉద్యోగాలతో పాటు, గ్రామ సచివాలయాల ద్వారా కూడా ఉద్యోగాలు కల్పించడం జరిగింది.

ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాలు:
ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు మాత్రమే కాకుండా ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం.
తిరుపతిలో తొలిరోజు జాబ్‌మేళాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
రెండో రోజు ఆదివారం నాడు అనంతపురం, హిందూపురం, నంద్యాల, కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
ఈ ఇంటర్వ్యూల కోసం ‘వైయస్సార్‌సీపీజాబ్‌మేళాడాట్‌కామ్‌’ లో రిజిస్టర్‌ చేసుకున్న వారికి అక్నాలెడ్జ్‌మెంట్‌ ఇచ్చాం. వాటిని చూపించిన వారిని యూనివర్సిటీలోకి ఇంటర్వ్యూలకు అనుమతిస్తాం. వారు తమ కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ తప్పనిసరిగా చూపాలి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం.

ఆ విషయంలో రాజీ పడబోము:
మా పార్టీ అ«ధ్యక్షుడు బలంగా నమ్మేది.. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హతే ఆధారంగా అవకాశాలు కల్పించడం. అదే దిశలో దాదాపు 30 పథకాలను ఆయన గత 35 నెలలుగా అమలు చేస్తున్నారు. ఎక్కడా ఎవరిపైనా వివక్ష చూపడం లేదు.
ఇటీవల పప్పునాయుడు పదే పదే మాపై విమర్శలు చేస్తున్నాడు. యూజీసీకి కూడా లెటర్‌ రాశాడట. ఇది వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించింది మాత్రమే అని. ఎవరికీ అవకాశాలు కల్పించడం లేదంటూ పప్పునాయుడు ఆరోపణలు చేస్తున్నారు.
అయితే మా పార్టీ బడుగు, బలహీనవర్గాలకు ఎప్పుడైనా, ఎక్కడైనా అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విషయంలో ఎక్కడా రాజీ పడబోము. అందరికీ అవకాశం కల్పిస్తాం.
అదే పప్పునాయుడు, పెద్దనాయుడు ఇద్దరూ, కేవలం తమ కులం వారికి మాత్రమే మేలు చేసేలా పని చేశారు. అది వారి 14 ఏళ్ల పాలనలో స్పష్టంగా కనిపించింది.

ఇది ఆరంభం మాత్రమే:
తిరుపతి జాబ్‌మేళాకు అన్ని ఏర్పాట్లు చేశాం. యూనివర్సిటీతో పాటు, అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కటి చట్టపరంగానే జరుగుతోంది.
ఇది ఆరంభం మాత్రమే. రాబోయే కాలంలో మరిన్ని జాబ్‌మేళాలు నిర్వహిస్తాం. ఉద్యోగాల కల్పన, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ద్వారా తలసరి ఆదాయం పెరగడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది.

చంద్రబాబుకు ప్రశ్న:
ఈ సందర్భంగా చంద్రబాబుకి ఒక ప్రశ్న. మా సీఎం 35 నెలల పాలనలో 30కి పైగా సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేసి, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేశారు. మరి మీ 14 ఏళ్ల చరిత్రలో ఒక్కటంటే ఒక్క పథకం అయినా అలా అమలు చేశారా?
మీరు ప్రజలను హింసించడం, దోచుకోవడం తప్ప, ఒక్కటైనా పథకం విజయవంతంగా అమలు చేశారా?
చంద్రబాబు ఎంతసేపూ ప్రెస్‌మీట్ల పేరుతో బూతులు తిట్టడం. పిచ్చి వాగుడు వాగడం తప్ప చేసిందేమీ లేదు. అతడికి ఒక్కటే ధ్యేయం. జగన్‌ని దూషించడం. వారి పార్టీలో దిగజారిన వ్యక్తులతోనూ తిట్టించడం, దూషించడం.

మీ పుత్రుడిని నమ్ముకుని ఎన్నికల్లోకి దిగుతారా?:
మీరు 44 ఏళ్ల రాజకీయ జీవితం. 14 ఏళ్లు సీఎంగా ఉన్నారు. కానీ ఏం చేశారు? రాష్ట్రానికి ఏమైనా సాధించి పెట్టారా?.
బాబూ ఒకటి అడుగుతున్నాను. 2024 ఎన్నికల్లో మీ సొంత పుత్రుడిని నమ్ముకుని ఎన్నికల్లోకి దిగుతారా? మీకు ఆ నమ్మకం ఉందా? లేక మీ దత్తపుత్రుడితో కలిసి దిగుతారా?. మీది 44 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల చరిత్ర చూపి ఒంటరి పోటీకి ఎందుకు సిద్ధం కావడం లేదు. మీ కొడుకు మీద నమ్మకం లేకనే కదా, మిగతావారి మీద ఆధారపడుతున్నారు.
అదే మా పార్టీ అప్పుడు కూడా ఒంటరిగానే పోటీ చేస్తుంది.

ఆయన సంతోషంలో..మీరు బాధలో:
స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డి చనిపోయి స్వర్గంలో ఉన్నా కూడా, తన కొడుకు ప్రయోజకుడు అయ్యాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు అన్న సంతోషంతో ఉన్నారు. కానీ నీవు ఈ భూమి మీదే ఉన్నా, నీ కళ్ల ఎదురుగా ఉన్న నీ సొంత కొడుకు పప్పు ముద్దలా, దేనికీ పనికి రాకుండా, 40 ఏళ్లకే గడ్డం నెరిసిపోయి, జుట్టు ఊడిపోయి.. ఒక నియోజకవర్గం.. మంగళగిరిలో కూడా గెలవలేకపోయిన ఒక అసమర్థుడిని కని బాధ పడుతున్నావు.

లోకేష్‌ అసలు స్టాన్‌ఫొర్డులోనే చదివావా?
లోకేష్‌ నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీవు అసలు స్టాన్‌ఫొర్డులో చదివావా? నీకు ఏ డిగ్రీ వచ్చిందా? డిగ్రీ వస్తే ఏ భాషలో చదివావు?
నీవు ఒక్క మాట మీ తండ్రి నారా చంద్రబాబునాయుడుగారు అని స్సష్టంగా పలుకు. నీకు డిగ్రీ వచ్చిందని నమ్ముతాను. మంగళగిరిని మందలగిరి అంటావు. ప్రజలు నిన్ను తిరస్కరించారు. ఎమ్మెల్యేగా కూడా ఎన్నుకోలేదు. నీలాంటి పప్పునాయుడును మీ నాన్న చంద్రబాబు, రాష్ట్రానికి తన వారసుడిగా పదవిలో కూర్చోబెట్టాలనుకున్నాడు. అసలు పప్పునాయుడు. నీవు మాట్లాడే భాషకు, స్టాన్‌ఫొర్డు యూనివర్సిటీకి ఏమైనా సంబంధం ఉందా?.

చంద్రబాబు వలసపక్షి:
చంద్రబాబునాయుడు ఒక వలస పక్షి. సోమవారం సాయంత్రం వస్తాడు. మంగళవారం, బుధవారం, గురువారం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాడు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌ తిరిగి వెళ్తాడు.
అంటే తెలంగాణలో ఉంటూ, స్థిర నివాసం అక్కడే ఏర్పాటు చేసుకుని, ఆంధ్రప్రదేశ్‌కు సీఎం కావాలనుకుంటున్నాడు. మరి దీన్ని ప్రజలు కోరుకుంటున్నారా?

ఆ పార్టీ ఇక ఉండబోదు:
2024లో కూడా చంద్రబాబు అధికారంలోకి రాడు. అప్పటికే ఆయన వయసు మీరుతుంది. ఆ తర్వాత రాజకీయాల్లో ఆయన రాజకీయాల్లో ఉండే వీలు లేదు. మరోవైపు ఆయన కొడుకు ఇప్పటికే పప్పునాయుడుగా పేరు పొందాడు. కాబట్టి 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు. ఇది స్పష్టంగా తెలుస్తోంది.
ఇక మేము మరిన్ని పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చి దిద్దే సామర్థ్యం ఒక్క జగన్‌గారికే ఉంది.

తిరుపతి జాబ్‌మేళాలో..:
తిరుపతి జాబ్‌మేళాకు 147 కంపెనీలు వస్తున్నాయి. ఇక్కడ ఇంటర్వ్యూల కోసం 41 వేల మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. అయితే అంత మందిని ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉండదు కాబట్టి, ఆయా కంపెనీలే షార్ట్‌లిస్ట్‌ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి.
నేను గతంలో చెప్పిసట్లు మూడు సెంటర్లలో 15 వేల కన్నా ఎక్కువే 20 వేల ఉద్యోగాలు ఇవ్వడం కోసం ప్రయత్నిస్తాం. ఎన్ని ఖాళీలుంటే అంత మందిని తీసుకోవడం జరుగుతుంది. శనివారం సాయంత్రం, ఆ మరుసటి రోజు కనీసం 1000 మందికి వెంటనే నియామకపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వారికి మెయిల్‌ లేదా లెటర్ల ద్వారా సమాచారం అందించడం జరుగుతుంది.

మాది బాధ్యతాయుతమైన పార్టీ:
ఐటీ సంస్థలతో పాటు, ఇంకా కొన్ని పెద్ద కంపెనీలు కూడా జాబ్‌మేళాల్లో పాల్గొంటున్నాయి. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ప్రైవేటు కంపెనీలను కూడా సంప్రదించి, జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నాం.
అదే చంద్రబాబునాయుడు తన 14 ఏళ్ల పాలనలో లేదా.. కనీసం 2014 నుంచి 2019 వరకు అయినా ఆం««ధ్రప్రదేశ్‌లో కనీసం ఒక్కసారైనా జాబ్‌మేళా నిర్వహించారా? లేదు. అందుకు కారణంఆయనది ఒక కుల పార్టీ.. అని విజయసాయిరెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE