– వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి
కడప: సూపర్ సిక్స్ పథకాలపై రెఫరండంగా కుప్పం, మంగళగిరి, పిఠాపురం ఉపఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా అని వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సవాల్ విసిరారు. కాకమ్మ కబుర్లు దద్దమ్మ మాటలు మాట్లాడితే సరిపోతుందా.. దమ్ముంటే కుప్పం, మంగళగిరి, పిఠాపురం, పులివెందుల ఉప ఎన్నికలకు రావాలి అంటూ అవినాష్ రెడ్డి సవాల్ విసిరారు. వైసీపీ అధినేత జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో చంద్రబాబుకు సినిమా చూపిస్తాడని భయం అంటూ వ్యాఖ్యలు చేశారు.