– చంద్రబాబు హయాంలో జరిగిన పని – 87%
జగన్ రెడ్డి హయాంలో జరిగిన పని – 13%
– 2019 నాటికి చంద్రబాబు చేసిన పని – 87%
– 13% పనులు చేయటానికి, జగన్ కి పట్టిన సమయం – 57 నెలలు
– టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ రెండో దశలో భాగమైన కేబీసీ కాలువపై ప్రత్యేక దృష్టి పెట్టి భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి చేయించారు. గత సార్వత్రిక ఎన్నికలనాటికి సుమారు 87 శాతం పనులు పూర్తయ్యాయి. కుప్పం నియోజకవర్గానికి పక్కనే ఉన్న వి.కోట మండలం కృష్ణాపురం వరకు నీళ్లు తెచ్చారు.
కేవలం 2.20 కి.మీ.కాలువ, 103 స్ట్రక్చర్లు, 1.43 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 22వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు, కొంతమేర పంప్‌హౌస్‌ల నిర్మాణమే మిగిలింది. వీటిని చేసేందుకు జగన్ ప్రభుత్వానికి ఏకంగా 57 నెలలు పట్టింది. ఇప్పటికీ వి.కోట మండలం ఆదినపల్లి వద్ద పంప్‌హౌస్ పనులు కొనసాగుతున్నాయి.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీ-నీవా రెండవ దశ పూర్తిచేసి… ఒక్కో జలాశయం నింపుతూ… నీటిని చిత్తూరు జిల్లా మదనపల్లికి తరలించారు. అటు పుంగనూరు బ్రాంచి కాలువ, కుప్పం కాలువ వైపు నీళ్ళు ప్రవహించేలా పనులు పరగులు పెట్టారు. ఈ జగన్ రెడ్డి 13% పనులు చేయటానికి ఆపసోపాలు పడి ఎన్నికల ముందు హడావిడి చేస్తున్నాడు..