అది తెలువాలి అంటే కనీసం విషయ పరిజ్ఞానం ఉండాలి
దొంగ సర్టిఫికెట్లతో వై ఎస్ దగ్గర డబ్బులు సంపాదించడం కాదు
20 ఏండ్లు గెలిచి సాధించింది ఏమిటి
జరుగుతున్న అభివృద్ధి కళ్ళకు కనిపించడం లేదా
ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకున్నారు.
అందుకే జెట్ స్పీడ్ తో నల్లగొండ పురోగతి
కోటాను కోట్లతో అభివృద్ధి జరుగుతుంటే గ్లోబెల్స్ ప్రచారమా
ప్రజలను మోసం చేయడానికే దండు బయలు దేరింది
అన్నదమ్ములు జిల్లాకు చేసింది శూన్యం
బత్తాయి రైతులను ఏనాడైనా పట్టించుకున్నారా
అసలు వ్యవసాయం గురించి కాంగ్రెస్ నేతలకు ఎం తెలుసు
ఉమ్మడి జిల్లాలో యాసంగి లొనే 17 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి
రైతులకు 2,950 కోట్ల చెల్లింపులు
క్షమాపణల కాదు కాంగ్రెస్ నేతలు గల్లీ నుండి ఢిల్లీ వరకు ముక్కులు నేలకు రాయాలి
ఫ్యూడల్ రాజకీయాలకు కాలం చెల్లింది
ఐదు ఎకరాల భూమి ఉంటే బెంజి కార్లు ఎక్కడివి
మళ్ళీవచ్చేది బి ఆర్ యస్ ప్రబుత్వమే
– మంత్రి జగదీష్ రెడ్డి
ఐటి హబ్ అంటే ఏందో తెలుసా…అది తెలువకుండా దాని గురించి మాట్లాడితే
చదువుకున్నోళ్లు మాత్రమే కాదు కంప్యూటర్ పై సరయిన పరిజ్ఞానం లేని వారు కూడా నవ్వుకుంటారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు. అది తెలియాలి అంటే కనీస పరిజ్ఞానం ఉండాలి అని ఆయన దెప్పి పొడిచారు. పట్టణ ప్రగతి లో బాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి అనంతరం మీడియా తో మాట్లాడారు.
చదవని చదువు చదువుకున్నట్లు చెప్పి వై ఎస్ దగ్గర పదవులు పొంది డబ్బులు సంపాదించుకున్నట్లు కాదని ఐటీ హబ్ ల గురించి తెలుసుకోవడం అని ఆయన విరుచుకుపడ్డారు.20 ఏండ్లుగా అధికారం లో ఉండి నల్లగొండ అభివృద్ధికి చేసింది ఏమిటో తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.కాంగ్రెస్ నేతల పాదయాత్రలో త్రాగేది ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన మంచి నీరు అని,కాంగ్రెస్ నాయకుల పొలాలకు,ఇళ్లకు అందుతున్న విద్యుత్ ముఖ్యమంత్రి కేసీఆర్ సరఫరా చేసిందేనని ఆయన మండిపడ్డారు.
మాటి మాటికి అవాకులు చెవాకులు పేలుతున్న కాంగ్రెస్ నాయకులు చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. మీకు మాలాంటి నేతలఅక్కర లేదని అభివృద్ధిలో భాగస్వామ్యం అయి మాతో సెల్ఫీలు దిగుతున్న ప్రజలు సరితూగుతారని ఆయన చెప్పారు. మరోసారి ప్రజలను మోసం చేయడానికి దండు బయలు దేరిందని ఆ దండుపై ప్రజలకు విశ్వసనీయత లేదని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ ను దత్తత తీసుకున్నాక రూపు రేఖలే మారి పోయాయని ఆయన చెప్పారు. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ నేతలకు అభివృద్ధి గురించే కాదు వ్యవసాయం గురించి మాత్రం ఏమి తెలుసని ఆయన నిలదీశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క యాసంగి లొనే 17 వేల ధాన్యం దిగుబడి కాగా రైతులకు చెల్లించిన మొత్తం2,950 కోట్లు అని ఆయన చెప్పారు.
క్షమాపణలు కాదు కాంగ్రెస్ నేతలే గల్లీ నుండి ఢిల్లీ వరకు 1000 సార్లు ముక్కులు నెలకు రాయాలని ఆయన డిమాండ్ చేశారు.ఫ్యూడల్ రాజకీయాలకు కాలం చెల్లిందని ఆయన స్పష్టం చేశారు.ఐదు ఎకరాల భూమి ఉంటే అన్న తమ్ముళ్లకు కోటాను కోట్ల బెంజి కార్లు ఎక్కడివని ఆయన నిలదీశారు.మళ్ళీ అధికారంలోకి వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమే ఇందులో ఎటువంటి సందేహం లేదని మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు