ఆస్తి కోసం సోదరుల మద్య కుస్తీ కాదిది..
హక్కు కోసం అన్నదమ్ములం కలిసి చేస్తున్న పోరాటం..
ఒక ఉమ్మడి కారణం..
దాని కోసమే ఇంత పెద్ద రణం..
తెలుగు వాడి రుణం..!
విశాఖ నగర సమోన్నత
కీర్తి శిఖరం..
తెలుగు జాతి మొత్తం
పోరాడి సాధించుకున్న
కలల సౌధం…
అందుకోసం నాటి సర్కారు సాగించినా నరమేధం
వెరవక సాగించిన మహాయజ్ఞం..
విశాఖ స్టీల్ ప్లాంట్..
ఈ ఫలకం చూడ్డమే మనోఙ్ఞం..!
అలాంటి గుడిపై వేటు..
ప్రైవేటు కాటు..
రక్తం సలసలా మరగదా..
మోడీ గుండె కరగదా..!
నాడు కావాలని ఉద్యమం
నేడు కాపాడుకోవాలని పోరాటం..ఆరాటం..
పరిశ్రమ దేవాలయం
అన్నాడు చాచాజీ..
దాని భవితే దైవాధీనం చేసేస్తున్నాడు మోడీజీ..
ఇది దీనాతి దీనం..
ఇంతటి చరిత్రను ఎవరికి చేసేస్తారో అధీనం?
అసలు ఏమిటీ
ప్రైవేటీకరణ ఉద్యమం..
ఎక్కడ మొదలై ఎక్కడికి పోతున్నాం మనం…
ప్రభుత్వ రంగానికే రంగు మార్చే మన సరంగు..
సర్కారుకూ
ఒకనాటికి అద్దేస్తారేమో ప్రైవేటు హంగు..!
ప్రభుత్వ రంగ సంస్థల మూసివేతకు
నష్టాల సాకు
కొనసాగించాలంటే
ప్రైవేటు సోకు…
మీ మీ సెటప్పుల కోసం దింపేస్తారా తెలుగోడి
గుండెల్లో బాకు..
సర్కారు స్టీల్ ప్లాంట్ ను
నడపలేనంత కొజ్జానా..
ఆ సంస్థ ప్రైవేటుకు
తాయిలంగా
ఇచ్చే పిజ్జానా..?
దానాదీనా చెప్పొచ్చేదేంటంటే
సర్కారులో పెద్దలారా..
మ”నోళ్ళ”నుకుంటే
ఏమైనా ఇచ్చుకోండి…
మానోళ్లను కొట్టి కాదు..
విశాఖ ఉక్కు మా హక్కు
మీ చేతిలో చెక్కు కాదు..
ఇది మీరే కోరి
తెచ్చిన చిక్కు..
తెలుగోడి గుండె చివుక్కు..
అయినా ఇదే కదా ఇదే కదా
మోడీ చమక్కు..!
విశాఖ ఉక్కు ఆందోళన
మొదలై ఏడాది..
ఎలిశెట్టి సురేష్ కుమార్
9949546286