లేదయ్యా! మీరు మా గుండెల్లో, మా ఊపిరిలో, మా మాటల్లో, మా మాధుర్యంలోనే కొలువై ఉన్న కళామూర్తి. అయ్యా బాలు గారు.. మీ స్వరం యావత్తు భారతాన్ని ఐదు దశాబ్దాల పాటు ఊర్రూతలూగించిన మహాశక్తి! మీ పాట వినని రోజు లేదు, మనిషే లేడు… మీ గాత్రం తెలియని ప్రదేశం లేదు… మీరు ప్రాంతాలకతీతం, మీరు రాజకీయాలకతీతం — మీరు భారతమంతా ప్రేమించిన గానగంధర్వులు. ఒక కళాకారునికి ప్రాంతం అంటగట్టడం… అది భావదారిద్రం కాదు, అది మనుషుల్ని విడదీయాలనే చీకటి ప్రయత్నం.
రాష్ట్రాలుగా విడిపోయి దశాబ్దం దాటినా… ఎందుకీ విభజన వాదం? ఎందుకీ విద్వేషపు గోడలు? ప్రేమతో కలపడమే కళాకారుల ధర్మం. విడదీయడమే కొందరి రాజకీయ వ్యూహం. ఎన్నాళ్ళు ఈ విభజనలపై రాజకీయాలు చేస్తారు? ఎప్పుడైనా అభివృద్ధిపై, ఏకతపై, మనసులు కలపడంపై రాజకీయాలు చేసారా? భావొద్వేగాలు పేరిట ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన కళాకారులను రాజకీయాలకు పావులుగా మార్చడం భావ్యం కాదు.. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా కలిసివుందాం. విద్వేషాలు రెచ్చేగొట్టేవారికి కాలమే సమాధానం చెబుతుంది.