-బూతులు మాట్లాడితే మంత్రి పదవులు, అదనపు గన్ మెన్లా ?-ఉగ్రవాదాన్ని తాలిబన్లు ప్రోత్సహించినట్లు బూతుల సంసృతిని జగన్ ప్రోత్సహిస్తున్నారు
-టీడీపీ శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు
వైసీపీ పార్టీ ఆవిర్బావం తర్వాత రాజకీయాల్లో నైతిక విలువలు, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు పతనమయ్యాయి. ప్రతిపక్ష నేతల్ని బూతులు తిట్టడం, మహిళల వ్యక్తిత్వాన్ని కించపర్చటం వంటి సంస్ర్కతిని జగన్ రెడ్డి పెంచి పోషిస్తున్నారు. మహిళల వ్యక్తిత్వాన్ని కించపర్చేలా అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్, అంబటి రాంబాబులపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకుకోపోగా వారికి అదనంగా గన్ మెన్లను కేటాయించటం సిగ్గుమాలిన చర్య. మహిళలను కించపర్చిన వారిని పదవుల్ని నుంచి భర్తరప్ చేయకుండా భద్రత పెంచుతారా? అంటే ఇంకా ఎక్కువగా బూతులు మాట్లాడాలని చెబుతున్నారా? ఉగ్రవాదాన్ని తాలిబన్లు ప్రోత్సహించినట్లు బూతుల సంసృతిని జగన్ ప్రోత్సహిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు ఉన్న గన్ మెన్లను తొలగించి బూతులు మాట్లాడే మీ ఎమ్మెల్యేలకు అదనంగా గన్ మెన్లను కేటాయిస్తారా? బాద్యతయుతంగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధులే సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తిస్తుంటే జగన్ వారిని మందలించకపోగా ప్రోత్సహించటం దుర్మార్గపు చర్య. జగన్ రెడ్డి పాలన తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో సరైనవిధంగా బుద్ది చెబుతారు.